Friday, September 22, 2017

20/09/17, 4:55:41 PM: MVMRAO: 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ రోజు మహాలయ అమావాస్య ,దీనినే పితృ అమావాస్య అనికూడా అంటారు.ఈ రోజున ఈ సంకల్పం చెప్పుకొని పెద్దలకు నమస్కరించుకోవాలి.ఆ సంకల్పమే ఇది. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🌻🌻 సంకల్పం 🌻🌻
************************
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

మాతృ దేవోభవ !!
పితృ దేవోభవ !!
ఆచార్య దేవోభవ !!
అతిధి దేవోభవ !!

నా జన్మకు మూల కారణమైన తల్లిదండ్రులకు నాయొక్క అనంతకోటి నమస్కారములు. అలాగే తల్లిదండ్రులకు మూల కారణమైన తాతలకు, ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు.సృష్టి ప్రారంభం నుండి ఇప్పటివరకు ఈ వంశ పరంపరలో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంత కోటి నమస్కారములు. ఎందరో యోగులు,మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను.ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించుచున్నాను. మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి.ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆచంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి.నాలోను,నా కుటుంబ సభ్యులందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి క్షేమ,స్థైర్య,విజయ, అభయ ,ఆయురారోగ్య, ఐశ్వర్యములనొసగి,ధర్మార్థ, కామ, మోక్షములనొసగి,  అహంపదార్థ రహిత స్థితి కలిగేటట్లుగా దీవించి నాజన్మ  ధన్యత చేకూర్చగలరని మనసా,వాచా,కర్మణా త్రికరణ శుద్ధిగా ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించుచున్నాను.
💐💐💐💐💐💐💐💐💐💐
- శ్రీనిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి .
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

No comments:

Post a Comment