07/09/17,
7:55:49 AM: +91 98490 96074: ఒక హాస్య అవధానంలో ఒక పృచ్చకుడు పంది,
కోడిపెట్ట, చేప, కప్ప ఈ నాలుగు పదాలు బ్రాహ్మణుని ఇంట పెళ్ళిలో ఉపయోగించి
ఒక పద్యాన్ని చెప్పండి అని అవధానికి సమస్యనివ్వడం జరిగింది. దానికి అవధాని
ఇలా సమాధానం ఇచ్చాడు.
ఊరంత 'పంది' రేసి నోరూరునట్లుగా
వేడి వేడి ప'కోడిపెట్ట' ఇంపుసొంపగు రుచుల
పాయసము మోజెల్ల 'చేప ' చెప్పలేని
రుచులు మా'కప్ప' గించే.
అంటూ సమస్యను హాస్యభరితంగా పూరించాడు ఆ అవధాని.
ఇక్కడ మూడవ పంక్తిలో మోజెల్ల చేప అంటే కావలసినంత తాగించి అని అర్ధం
No comments:
Post a Comment