31/08/17, 11:51:23 AM: +91 98490 65431: 🙏 *సూర్యుడి నుండి వచ్చే* *ఏడు*
*కిరణాలు సప్త జ్ఞాన భూమికలు* 🙏
*జ్ఞానం*
జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం.
(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానసం (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్ధభావని (7) తురీయం
అన్నవే సప్త జ్ఞాన భూమికలు.
☄ *శుభేచ్ఛ:* నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.
☄
*విచారణ* : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస;
*బ్రహ్మజ్ఞాన* ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని
తెలుసుకోవడం.
☄
*తనుమానసం* : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్
సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన
సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే *తనుమానసం* .
☄
*సత్త్వాపత్తి* : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం,
రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే.
💥 *తమోగుణం* అంటే సోమరితనం,
💥 *రజోగుణం* అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.
ఈ
నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి
నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి;
మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం
బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు
అయిన స్థితి.
☄
*అసంసక్తి* : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం,
రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి
మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే
పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి
వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం
పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక,
సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ
నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.
☄
*పదార్ధభావని* : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు.
ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా
నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి;
ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా
కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.
☄
*తురీయం* : ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన
స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం
కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే *బుద్ధుడు*
అంటాం. ఇదే *సహస్రదళకమలం* .
ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా *సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది.* ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.
*తురీయం*
అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ
అంటే మూడింటినీ దాటిన అని అర్థం; అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న
స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ
సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి
No comments:
Post a Comment