19/09/17,
6:35:36 PM: +91 98490 65431: *హఠయోగం/కుండలినీ యోగంలో లక్ష్య సాధనకు
ముఖ్యమైనది ప్రాణాయామం*.
-----------------------------------------------------------
హఠయోగ సాధనలో /కుండలినీ యోగలో ప్రధానమైన సాధనం ప్రాణాయామం.
ప్రాణాయామము అనగా :- "ప్రాణము" అనగా "జీవనము". "ఆయామము" అనగా "పొడిగించుట". ( పెంచుట ).
ప్రాణాయామం (Pranayama) అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం.
ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి
తోడ్పడుతుంది.
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన "హఠయోగ
ప్రదీపిక"లో మరియు పాతంజలి "యోగశాస్త్రం"లో కూడా ప్రాణాయామం గురించి
చెప్పబడెను.
పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
"ప్రాణశక్తి" ముఖ్యంగా ఐదు రకాలుగా పనిచేస్తుంది. ఇవి 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం మరియు 5. వ్యానం.
*************************************
*ప్రాణాయామంలో ముఖ్యమైన దశలు:-*
**************************************
*(1). పూరకం:-* ఊపిరితిత్తుల నిండా మెల్లగా గాలిని పీల్చడాన్ని పూరకమంటారు.
*(2). కుంభకం:-*పూరకం తర్వాత గాలిని లోపలే ఆపి ఉంచడం 'అంతఃకుంభకం'
అవుతుంది. అలాగే రేచకం తర్వాత గాలిని లోపలికి పీల్చకుండా ఆపి ఉంచడం
'బాహ్యకుంభకం' అవుతుంది.
*(3). రేచకం:-* ఊపిరితిత్తుల నుండి గాలిని మెల్లగా బయటకు పంపించడాన్ని రేచకమంటారు.
ఈ మూడు పక్రియలతో కూడిన ఆవృత్తమే ప్రాణాయామం.
ప్రాణాయామ సాధనకు ఉపాంగాలుగా ఈ ఆసనాలను ఆచరిస్తారు.
.'ధౌతి నేతి బస్తి నౌలి త్రాటకం తదా కపాలభాతి,ఏతాని షట్కర్మాణి ప్రచక్సతె' -
*1. ధౌతి:* అనగా శరీరములోని అన్తర భాగములను కడుగుట. (నీరుతొ గాని,
వాయువుతొ గాని, పలుచని కిచిడీతొగాని, మెత్తటి నూలు వస్త్రముతొ గాని నొటి
ద్వారమునుండి ఉదరము వరకు శుద్ద్ది చేయట.)
*2. నేతి :* అనగా నాసిక రంద్రములను నీటితొ గాని, పాలతొ గాని, సూత్రముతొ
గాని కడుగుట. (నేతి - జలనేతి, సూత్రనేతి, దుగ్ధనేతి మరియు ఘృతనేతి - అని
నాలుగు విధములు.)
*3 .బస్తి:* యెనీమా ప్రక్రియ .
*4. నౌలి:* దక్షిణ, మధ్య,వామ అని మూడు విధములు.
*5. త్రాటకము:* అనగా ఏకాగ్రత . దీపములో గాని, ఉదయించు సూర్య చంద్రుల వేపు గాని ద్రిష్టిని నిలుపుట.
* కపాలభాతి:* కపాలము అనగా తల భాగము. వాయువును నాసాగ్రముల ద్వారా వేగముగా బైటకు పదె పదె వదలుట.
పై షట్క్రియలను హఠయోగులు కుండలినీ యోగ సాధనలో అనుసరిస్తారు.
ప్రాణాయామం ద్వారా దేహంలో ఉష్ణ శక్తి జనిస్తుంది. దీని ద్వారా మాత్రమే
కుండలి శక్తిని జాగృతం చేయగలము. కుండలినీ శక్తి సుషుమ్నా నాడి ద్వారా
సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాడు.
ఈ క్రియల వలన చాల శారీరక మానసిక లాభములు ఉన్నాయని, ఈ క్రియలను
సుర్యోదయమునకు ముందుగా చేయుట మంచిదని ప్రాణాయామ సాధకులు చెబుతారు.
*ముఖ్య గమనిక:-* ఈ పద్ధతులను అనుభవముగల యోగ గురువుల వద్ద శక్షణ మరియు పర్యవేక్షణలో మత్రమే నేర్చుకొనవలెను.
No comments:
Post a Comment