Friday, September 22, 2017

20/09/17, 9:51:11 AM: ‪+91 98490 65431‬: (శాక్తేయం, వామాచారం.)*
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
*శక్తి ఉపాసనలో "మంత్రం-యంత్రం" అనే మరి రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.*
-----------------------------------------------------------
      శక్తి ఉపాసనలో మరి రెండు ముఖ్యమైన "మంత్రం - యంత్రం" అంశాలు ఉన్నాయి.
      మంత్రము శబ్ద శక్తి. మంత్రోపాసన మానసికమైన పూజ. మంత్రాలకు బీజాక్షరాలకు (ఐం, క్లీం, హ్రీం) అలౌకిక శక్తులున్నాయని వాటి ద్వారా దేవతలను వశపరుచుకోవచ్చని తాంత్రికుల నమ్మకం.
      యంత్రము చిత్ర శక్తి. యంత్రం బాహ్యపూజ. శ్రీ చక్రం, గాయత్రి మంత్రం మొదలైన వాటిని ప్రతిష్టించి వాటిని పూజించడం ద్వారా దేవతలను సంతృప్తి పరచి కోరికలను సిద్ధింప చేసుకోవచ్చని నమ్మకం.
      యంత్రము శరీరము. మంత్రము ప్రాణము. యంత్రమందు మంత్రం చేర్చినప్పుడు జీవం కలది అవుతుంది అంటారు.
      కామక్రోధాధులను నియంత్రణ చేయునది యంత్రము. మనన చేత తరింప జేయునది మంత్రము. యంత్ర మంత్రములు రెండునూ రహస్యముగా ఉంచదగినవే.
*************************************
    *తాంత్రిక మతంలో త్రికోణ యంత్రం ఆదిశివునికి, ఆదిశక్తికి యాంత్రిక సంకేతం.*
*************************************
      యంత్రము సాంకేతిక శక్తి. శివునికి గాని, శక్తికిగాని త్రికోణము యాంత్రిక సంకేతము, 3 గీతలు ఒక్క ఆకారంగాచేసిన త్రికోణము. ఒక్క రూపంలో 3 వస్తువులున్నవి. ఒకడే 3 ఆకారములుగా ఉంది.అందుకే త్రికోణము ఆదిశక్తికి గాని, ఆది శంభునికి గాని సంకేతమైన యంత్రము.
      తంత్ర సిద్ధికి సాధనలు మంత్రయంత్ర పూజలు (బహిర్ముఖమైనవి), హఠ, రాజయోగములు (అంతఃముఖమైనవి). మంత్రయంత్రములు శక్తిసమన్వితములైనవి.
      మంత్రము శబ్దబ్రహ్మమునుండి పుట్టింది. కనుక మంత్రము బ్రహ్మ శక్తి. దీనివల్ల అంతఃసాధనయైన కుండలినీశక్తి కలుగుతుంది.
************************************
        *నేటికి తాంత్రిక మతంలోని*
          *"మంత్రం - యంత్రం" పట్ల*
  *కొంత మంది ప్రజల్లో విశ్వాసమున్నది.*
*************************************
      మధ్య యుగాలలో తాంత్రిక మతం బాగా ప్రచారంలో ఉండేది. తాంత్రిక సాధనా పద్ధతులు, తాంత్రిక వాజ్ఞ్మయం అపారంగా, శాఖోపశాఖలుగా పెరిగింది.
    ఆనాటి ప్రజాసామాన్యంలో కూడా తంత్రం, మంత్రం - యంత్రం పట్ల విశేషమైన ఆదరణ ఉండేది. ఈనాటికి కొన్ని వర్గాల ప్రజల్లో వీటిపట్ల నమ్మకాలు ఉన్నాయి.
      ఆధునిక విజ్ఞానం దారి ఆధునిక విజ్ఞానానిదే - మత విశ్వాసాల దారి మత విశ్వాసాలదే

No comments:

Post a Comment