28/09/17, 8:40:40 PM: +91 80088 84529: పెద్ద డాక్టర్ (పార్ట్ 2)
మణి అయ్యర్: “ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళలేము. వారు కాంచీపురంలో ఉంటారు”
నేను: “కాంచీపురంలోనా? అంత పెద్ద డాక్టరు అక్కడ ఎందుకున్నారు? ఎవరతను? యమ్.బి.బి.యస్సా లేదా యమ్.డి నా?”
మణి
అయ్యర్: “వారు ఆ డిగ్రీలకన్నా అతీతులు. వారు వైద్యులందరికి వైద్యులు.
(వారింటి పూజగదిలోని స్వామివారి చిత్రపటం వైపు చూపిస్తూ) ఈ డాక్టరు గురించే
నేను చెప్తున్నది”
నేను: పగలబడి నవ్వుతూ “ఏంటి
మణి అయ్యర్! ఈయనా డాక్టర్? వైద్యులకు వైద్యుడా? ఏం మాట్లాడుతున్నారు? ఒక
సన్యాసి డాక్టర్ ఎలా కాగలడు? ఏదో పూజలు పద్ధతుల గురించి ఐతే చెప్పగలరు
కాని. కాని మీరేమో ఈయన్ని డాక్టర్ అంటున్నారు. ఈయన మా అమ్మ అనారోగ్యాన్ని
బాగుచేయగలరా? అది కేవలం మీ భ్రమ మాత్రమే”
మణి అయ్యర్: “ఏంటి మీనాక్షిసుందరం! బ్రాహ్మణుల ఇంట పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నవ్?”
నేను:
“ఐతే ఏంటి సార్! మొదట ఒక పెద్ద డాక్టరు వద్దకు తీసుకుని వెళ్తాను అని
చెప్పి ఇప్పుడు ఒక సన్యాసి వద్దకు తీసుకువెళ్తాను అంటున్నారు. ఇది ఎలా
సాధ్యం?”
మణి అయ్యర్:
“మీనాక్షిసుందరం, నీకు కావాల్సింది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడడం ఒక్కటే
కదా? దానికి నేను పూచీ. మనం రేపే కాంచీపురం వెళ్తున్నాం సరేనా?”
నేను: “మణి అయ్యర్, మనం వెళ్తే నిజంగా మా అమ్మకు బాగవుతుందా?”
మణి అయ్యర్: “ఖచ్చితంగా! కేవలం వారిని దర్శించుకుని మీ తల్లి గురించి ప్రార్థించు ఆవిడకు నయమవుతుంది. నీకు మనఃశాంతి కూడా లభిస్తుంది”
నేను:
“అలా అయితే సరే నేను కాంచీపురం వస్తాను. కాని అక్కడ మీరు నన్ను చొక్కా
తీయమని, స్నానం చెయ్యమని, విభూతి-కుంకుమ పెట్టుకొమ్మని, నమస్కారం చెయ్యమని
ఇలాంటివి నాకు చెప్పకూడదు. వస్తాను; వారిని చూస్తాను; మా అమ్మ గురించి
చెప్తాను అంతే!”
మణి
అయ్యర్: “ఏమయ్యా! రోజూ స్నానం చెయ్యవా? అప్పుడప్పుడు చొక్కా విప్పవా?
ఎప్పుడూ విభూతి-కుంకుమ పెట్టుకోలేదా? అవన్నీ రేపు ఒక్కరోజు చెయ్యి. నీ
వంశానికొచ్చిన సమస్యేంటి?”
మరుమాట్లాడకుండా
సరే అన్నాను. మరుసటి రోజు నేను, మణి అయ్యర్, నా సహోద్యోగి తిరు వేంకటరామన్
ముగ్గురము కంచి బయలుదేరి ఉషోదయ వేళలో కంచి చేరుకున్నాము. సర్వతీర్థ కుళంలో
స్నానం చేసి, విభూతి-కుంకుమ ధరించి, పంచకట్టుకుని నా జీవితంలో మొదటిసారి
కంచి శ్రీమఠం ద్వారం వద్దకు వచ్చాము. నిజం! నాలో ఎదో తెలియని భావన,
ప్రశాంతత కొంత ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
మేము
మఠం లోపలికి వెళ్ళాము. ముందరి హాల్లో కంచి మహాస్వామివారు. పెద్ద డాక్టర్!
కూర్చుని ఉన్నారు. ఒక బియ్యం బస్తాకి ఆనుకుని కూర్చున్నారు. వారి ముందు
పళ్ళ బుట్టలు, పూలహారాలు ఉన్నాయి. స్వామివారి దర్శనం కోసం వరుసలో
నిలబడిఉన్నారు. మేము కూడా ఆ వరుసలో నిలబడ్డాము.
నాచేతిలో
ఒక వెదురుబుట్ట అందులో కొన్ని పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు. సాలోచనగా సన్యాస
చక్రవర్తి మహాస్వామివారిని చూశాను. అప్రయత్నంగా నా కళ్ళు వర్షించడం
మొదలుపెట్టాయి. అవును నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. నేనెందుకు
ఏడుస్తున్నానో కారణం తెలియదు.
ఆ
పలికే దేవుడు నన్ను రమ్మన్నట్టు సైగ చేశారు. నేను చిన్నగా ప్రశాంతంగా
దగ్గరకు వెళ్ళి నా చేతిలో ఉన్న బుట్టని అక్కడ పెట్టి నాకు తెలియకుండానే
స్వామికి సాష్టాంగం చేశాను.
”మీరు అష్టసహస్రం అయ్యర్లా?” (తమిళ అయ్యర్లలో ఒక శాఖ. మన ఆరువేల నియోగుల లాగా)
“అవును”
“కరుకుడిలో(తిరువయ్యారు దగ్గర) ఉన్న శేషాద్రి, కుంజు నీకేమవుతారు?”
“వాళ్ళు మా పిన్నికి బంధువులు”
“తంజావూరు రాజభవనం రిసీవర్ మీ తాతగారు. సుందరం అయ్యర్ కు ముందా లేదా తరువాతా?”
నాకు తెలియదన్నట్టు తలాడించాను. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.
స్వామివారు తలెత్తి, ”మీ అమ్మని ఆస్పత్రిలో చేర్పించావు కదా? ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగారు
నేను ఇక్కడకు వచ్చిందే ఆ విషయం అడిగుదామని. అదే విషయం స్వామివారు అడుగుతున్నారు. దీనికి కూడా మౌనంగా రోదిస్తూ నిలబడ్డమే నా సమాధానం.
”దిగులుపడకు! మీ అమ్మగారు కోలుకుని తిరిగి వస్తారు“
అవును!
ఆ పెద్ద డాక్టరు మా అమ్మ ఆయుష్షును మరికొంత పెంచారు. ఆ మహాత్ములు నావైపు
కొద్దిసేపు తీక్షణంగా చూసి ప్రసాదం ఇచ్చి, “ఇది మీ అమ్మకు ఇవ్వు. తను
ఆరోగ్యవంతురాలై ఇంటికి వస్తుంది” అని నన్ను ఆశీర్వదించారు.
ఈనాటికి
నేను, నాలోని ఆజ్ఞానాన్ని పారద్రోలి నన్ను సరైన దారిలో పెట్టిన ఆ “పెద్ద
డాక్టరు”కి తలవంచి నమస్కరిస్తాను. ’పెద్ద డాక్టరు” చెప్పినట్లుగానే మా
అమ్మకు నయమై ఇంటికి తిరిగొచ్చింది. మా అమ్మను కాపాడింది వారే. ఈనాటికి వారు
మమ్మల్ని సర్వదా రక్షిస్తున్నారు.
[తన
తల్లి సదాచారపరాయణురాలు, భక్తురాలు కాబట్టి ఇతణ్ణి స్వామివారు ధర్మాచరణ
వైపు తిప్పి, అతణ్ణి అతని వంశాన్ని కాపాడారు. మరి తల్లితండ్రులే
నాస్తికులు, హేతువాదులు అయితే వాళ్ళ పిల్లల్నీ, ముందుతరాల్ని
రక్షించేదెవరు? ఏ పుణ్యం అడ్డుపెట్టుకుని ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు?]
--- వి. మీనాక్షిసుందరం, సెక్రెటరి, హిందు ధర్మ మన్రం, చెన్నై-33. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్
#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment