Wednesday, September 27, 2017

27 Sep at 6:34 PM

27/09/17, 2:38:56 PM: ‪+91 98660 49721‬: 🎆సరస్వతీ దేవి🎆

శ్లో|| యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్రవస్త్రాన్వితా|
యావీణావరదండ మండితకరా యాశ్వేతపద్మాసనా||
యాబ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభి ర్ధేవైస్సదాపూజితా|
సామాంపాతు సరస్వతీ భగవతీ భారతీ నిష్షేషజాడ్జాపహా||

      త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవత సరస్వతీదేవి.  జ్యోతి లక్షణం కాంతి, ప్రసరణ కాంతి యెక్క లక్షణం. అదే విధంగా చైతన్య మయమైన విద్యవల్లనే పరబ్రహ్మం గోచరించబడుతుంది.

      సరస్వతీదేవి స్వరూప వర్ణన:  సఖలాభరణ భూషితయై నాలుగు చేతులతో కూడి కుడిచేతులయందు వీణ, అక్షమాల ఎడమచేతి యందు పుస్తకం ఉండును.హంసవాహిని.

      ఆమెకు తెలుపు అంటె ఇష్టం. తెలుపు చీర ధరించి ఉంటుంది. అందుకని ఆమెని తెల్లటి పూవులతో పూజిస్తారు.

      మాఘశుద్ధ పంచమి ఆమె జన్మదినం. ఈ రోజున వసంతపంచమి లేక శ్రీ పంచమి అంటారు. ఋగ్వేదం, దేవి భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణాల్లో ఈమె గుఱించి తెలియజేయబడింది. సకల సృష్టి కర్త బ్రహ్మ సరస్వతిని కూడా సృష్టించాడని, సృష్టి కార్యక్రమంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ధరించాడని ఒక గాథ. శివమహాపురాణంలో ఉమా సంహితలో సరస్వతీ ప్రాదుర్భావం గుఱించి చెబుతూ ఈసరస్వతి 'పార్వతీదేవి దేహమనే కోశమునుంచి ఉద్భవించుటచే కౌశిక అని పేరు వచ్చిందని శుంభనిశుంభులనే రాక్షసులను వధించిందని చేప్పబడింది'.

      ఈమెను సమస్త దేవతలు, బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సదా కొలుస్తూవుంటారు. ఈమె దేవతల్లో గొప్పది అలాగే నదుల్లోనూ గొప్పది. సరస్వతీనది ఒక మహానదిగా ప్రవహించింది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది.

    అమ్మని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటారు. అందుకునే నవరాత్రుల్లో మూడు రూపాల్లో ఒకే అమ్మ అరాధింపబడుతోంది.

సరస్వతీ ద్వాదశ నామాలు:
1. భారతి,
2. సరస్వతి,
3. శారద,
4. హంసవాహిని,
5. జగతీఖ్యాత,
6. వాణీశ్వరీ,
7. కౌమారి.
8. బ్రహ్మచారిణి,
9. బుద్దిధాత్రి,
10. వరదాయిని
11. క్షుద్రఘంట
12. భువనేశ్వరి.

No comments:

Post a Comment