27/09/17, 8:44:52 PM: +91 91105 71415: *గతాన్ని వదిలివేయటానికి తొమ్మిది దశలు*
బాధాకరమైన బావోద్వేగాలను తీసుకు వచ్చే సంఘటనకు లేక ఏ వ్యక్తి మనకు వున్నప్పుడు ఈ తొమ్మిది ప్రశ్నలు అడగండి :
1. *నేర్చుకోవలసిన పాఠం ఏమిటి ?*
మనం
నేర్చుకోవాలి అని ఆత్మ కోరుకుంటున్న పాఠాల కోసం చూడండి. అది మన సత్యాన్ని
మనం చెప్పాలి అని వుండవచ్చు. స్వరపేటిక యొక్క వాపుగా కూడా అది
కనిపించవచ్చు లేక మన గొంతును మనం తరచుగా అణిచివేస్తున్నాము అని మనకు అద్దం
పట్టే వారుగా మనకు అనిపించవచ్చు. అతను లేక ఆమె మన ధ్యాసను పొందటానికి
హద్దులు ఉల్లంఘించవచ్చు. ఈ ప్రవర్తన స్వీకరించబడలేనిది అని మనం మన
సత్యాన్ని చెప్పడంతో మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం వుంది.
స్వీకరించలేని దాన్ని స్వీకరించడం అనేది చేసి ఏదో మనం పావనం అయ్యాము అని
కాదు. అది (స్వీకరించలేని దాన్ని స్వీకరించడం అనేది)
సహజంగా పని చేసేది కాదు.
2. *ఒప్పందం ఏమిటి ?*
ఈ
జన్మ తీసుకోబోయే ముందు, మన ఎదుగుదలకు సహాయం చేయడానికి మనతో సంకర్షణ జరిపే
ప్రతి ఒక్కరూ మనతో ఒప్పందం చేసుకున్నారు. వారు మిమ్మల్ని అంచుకు
తోసేయడానికి ఒప్పుకొని వుంటారు మరియు మనం వారికి అలాగే చేయవచ్చు. అడగండి,
"నేను మరియు మీకు మధ్యన నటిస్తోన్న ఒప్పందం ఏమిటి ?" నాకు ఎన్నో మరణం వరకు
వెళ్ళిన అనుభవాలు వున్నాయి మరియు అప్పుడు ఆత్మల లోకంలో వున్నప్పుడు, ప్రజలు
ఒకరితో ఒకరు చేసుకునే విస్త్రుతమైన ఒప్పందాలను చూసి నేను విస్మయం పొందాను.
వారిలో ఎంతో మంది, ఉత్ప్రేరక సన్నాహకాలుగా వుండటానికి ఎంతో ప్రేమతో
ఒప్పుకున్నారు. మనం సమతులనంలో వున్నప్పుడు, అక్కడ ఎదుగుదల వుండదు కనుక మనం
పాఠాలు నేర్చుకోవటాన్ని కొనసాగించడానికి మనల్ని సమతులనం నుండి పక్కకు
తప్పించమని విశ్వానికి అది ఒక సూచన. అలానే, ఊహించగల ప్రతి దారిలో
పరీక్షించే విధంగా సంబంధాలను మనం మన జీవితంలోకి లాక్కుంటాము.
ప్రజలు
మార్పును ఇష్టపడరు మరియు అది సమంజసం కాని పరిస్థితి, అయినా కూడా, ఎంతో
మంది దాన్ని నివారించడానికి ఎంత దూరం అయినా వెళుతారు. మారడాన్ని ఇష్టపడక
పోవడానికి కారణం వారు మూలంతో వేరు అనే భావన పొందుతారు. వారు ఒంటరి అని
మరియు సృష్టికర్త యొక్క రక్షణ నుండి పూర్తిగా తెగిపోతామేమో అని నమ్ముతారు.
ఇతరులతో మన ఒప్పందాలను మనం అవగాహన చేసుకోవడం అనేది క్రైస్ట్ చెప్పినట్టు
"కనపడేదాన్ని బట్టి తీర్పు చెప్ప కూడదు" అనే విషయాన్ని సాధించటానికి అది
మనకు సహాయం చేస్తుంది. ఆయన ఏమన్నారంటే, మనం కష్టతరమైన అనుభవాల చింతలలో
వున్నప్పుడు, వాటిని చూడకండి - వాటి వెనకాల చూడండి అని అన్నారు.
3. *పాత్ర ఏమిటి ?*
నేను
బాదితుల పాత్రను పోషిస్తున్నానా ? చెడు వ్యక్తి యొక్క పాత్రను
పోషిస్తున్నానా ? బోధకుడి పాత్రనా ? ఈ ఒప్పందంలోపల నేను పోషిస్తున్న పాత్ర
ఏమిటి ? ఉదాహరణకు, మన జీవితంలో మనకు ఒక కౄరమైన వారు వుండవచ్చు. అది మన
జీవిత భాగస్వామి, తల్లి లేక యజమాని కావచ్చు. ఒకసారి మీరు
నిర్ధారించుకున్నాక, ఆ వ్యక్తి యొక్క పాత్రతో మన సంబంధం ఏమిటి. మన
వాస్తవాలకు మనమే సృష్టికర్తలం అని మన పాత్రను మనం మార్చుకోవచ్చు అని
గుర్తుంచుకోండి.
4. *ఇక్కడ అద్దం పట్టేది ఏమిటి?*
కింద
ఇవ్వబడ్డ ఏదో ఒక విషయం చేయడానికి మనం మన జీవితాలలోకి సంబంధాలను
లాక్కుంటాము; మనలోని అంశానికి వారు అద్దం పడతారు, మనం ఏమి ఇచ్చేసాము, అంటే
ఇంకా మనం అభివృద్ధి చెందని వాటి పట్ల మనం మన తీర్పును ఇస్తున్నాము. మన
అమాయకత్వం వెళ్ళిపోతే, మనల్ని మనం ఒక యుక్త వయస్సు వ్యక్తిని
ఆకర్షించడాన్ని కనుక్కుంటాము. మనం మన సమగ్రతను ఇచ్చివేసి వుంటే, మన
దృష్టిలో సమగ్రతకు ప్రాతినిధ్యం వహించే ఒక మిషినరీతో (ఆధ్యాత్మిక సంస్థతో)
మనం ప్రేమలో పడతాము.
ఇక్కడ
అద్దం పట్టే ఇంకొక విషయం ఏమిటంటే మనం తీర్పు చెప్పే విషయం. అపద్దాలు
చెప్పే వ్యక్తుల ద్వారా మనము సమస్యలు పొందుతూవుంటే, వారి మీద మనం మన
తీర్పును పెడుతున్నాము మరియు మనం అపద్దాలు చెప్పే వారిని ఆకర్షిస్తాము. ఒక
పురుషుడు తనలోని స్త్రీ తత్వాన్ని సరిగ్గా తెలుసుకోకుంటే, అప్పుడు ఆయన
సంపూర్ణత్వాన్ని అనుభూతి చెదటానికి తన స్వీయ స్త్రీ తత్వంతో ఎక్కువగా వుండే
స్త్రీని ఎంచుకోవచ్చు. తరువాత, నీళ్ళ పైపు కారితే ఆ పరిస్థితిని ఎలా
నిర్వహించాలో తనకు తెలియదు కాబట్టి, వారాతరాలలో తాను సిటీని వదిలి
వెళ్ళలేక పోతున్నందుకు ఆయన విసుగు చెందుతాడు. ఆయన తన అభివృద్ధి చెందని
స్త్రీ తత్వాన్ని ఇక్కడ తాను ప్రతిబింబిస్తున్నాడు అని స్వేచ్ఛగా
గుర్తించడాన్ని ఎంపిక చేసుకోకుంటే ఈ చిన్న చిన్న విసుగులు ఆగ్రహావేశాలను
నిర్మిస్తాయి.
5. *బహుమతి ఏమిటి ?*
మనం
ఆకస్మికంగా కలిసే ప్రతి వ్యక్తి మనకు బహుమతిని అందివ్వడానికే వచ్చారు. ఇది
ఎంతో సాధారణంగా పొందగలిగే వాటికి కూడా వర్తిస్తుంది. అడగండి, "ఈ వ్యక్తి
నుండి నేను ఏ బహుమతిని పొందబోతున్నాను ? అది బేషరతు ప్రేమను అందించడం లాంటి
ఎంతో సరళమైన విషయం కావచ్చు, లేక ఇతరులు ఎవ్వరూ వారిలో చూడని అందమైన విషయం
మనం గుర్తించవచ్చు. లేక ఎన్నో ఏళ్ళలో మొదటి సారిగా ఆ వ్యక్తి చెప్పేది మనం
స్వచ్చంగా వినవచ్చు. ఇంకొక సారి మనం కోపాన్ని వెలగకక్కే స్త్రీని
ఎదుర్కోవచ్చు మరియు ఆ సంఘటన పట్ల మన స్వామి తత్వాన్ని ప్రదర్శించే అవకాశం
పొందవచ్చు.
గమనిక : రాబోయే నాలుగు ప్రశ్నలు మొదటి ప్రశ్నల యొక్క సమాధానాల పట్ల మన వైఖరులను వివరిస్తాయి.
6. *నేను అనుమతించవచ్చా ?*
దేన్ని
అనుమతించవచ్చు, దేన్ని మార్చాలి మరియు ఆ పని చేయడానికి కాలసిన ధైర్యాన్ని
కనుక్కోవడం అనేవాటిని తెలుసుకునేటందుకు వున్న విషయం ఇది. మిమ్మల్ని మీరు
నదిలోని నీటిగా ఊహించుకోండి. మీ ముందర ఒక రాయి వుంది, మీరు ఇక్కడ ఆగిపోతారా
లేక దాని చుట్టూ ప్రవహిస్తారా ? మీ జీవితంలో ప్రతి సంఘటనను పూర్తిగా
నేర్చుకున్నారు - రాయిని కూడా - అప్పుడు దాన్ని ఆ క్షణానికి అనుమతించవచ్చా ?
ఈ యుద్ధం మనదేనా ? పందెం తెచ్చుకోవడానికి విలువైనవిగా వున్నప్పుడు మాత్రమే
యుద్ధాన్ని పోరాడాలి. పాఠం మీరు ముందే నేర్చుకొని వుంటే, మళ్ళీ యుద్ధం
చేయాల్సిన పనిలేదు.
7. *నేను స్వీకరించవచ్చా ?*
మనకు
జరిగే బాధాకరమైనవి వాటి వెనకాల దాగివున్న పరిపూర్ణతను చూసేంత వరకు మనం
వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదు. కావలసినన్ని జీవితాలు జీవించి మనం
పరిపూర్ణం అయ్యేంత వరకు జన్మల తరువాత జన్మలలో మనం ఎన్నో బాధలకు లోనయ్యే
పునర్జన్మ చక్రం మీద మనం వున్నాము అనేది సాధారణంగా అందరికీ వుండే నమ్మకం.
భగవంతుడు మనల్ని సృష్టికర్త యొక్క సామర్థ్యంతో వుండేలాగ పరిపూర్ణంగానే
సృష్టించాడు. గుర్తుంచుకోండి, ఆలోచనలు మరియు బావోద్వేగాలు కలిసి
వాస్తవికతను సృష్టిస్తాయి. హృదయం ఒక మైక్రోఫోన్ లాంటిది. కనుక మన హృదయం
యొక్క బావోద్వేగాలు ఎంత బలంగా వుంటే, మన కోరికలు వాస్తవరూపం దాల్చటానికి
విశ్వం అంత బలంగా స్పందిస్తుంది. కానీ విశ్వానికి వివక్ష లేదు; మీరు
ఆలోచించింది సకారాత్మకమైనదైనా లేక నకారాత్మకమైనదైనా విశ్వం
వాస్తవీకరిస్తుంది. సంఘటనను మనమే సహ - సృష్టించాము అని మనం అంగీకరించాలి,
అప్పుడు మనకు జరిగిన విషయాల పట్ల మన అనుభూతులను అది తొలగిస్తుంది.
8. *నేను విడుదల చేయవచ్చా ?*
విడుదల
చేయడం అంటే ఒక సంఘటన లేక వ్యక్తి చుట్టు వున్న శక్తిని వదిలివేయడం. మనం
విడుదల చేయక పోతే, దాన్ని మన ఆలోచనల శక్తిని ఆహారంగా ఇస్తూ మనమే దాన్ని
జీవంతో వుంచుతాము. (కన్నిసార్లు సృహ లేకుండా). అతను లేక ఆమె మనల్ని ఏదో ఒక
రకంగా బాధపెట్టి వుంటే కూడా మనం మన భాగస్వామితో విబేధంలో వుంటే, ఆ దశల
ద్వారా మళ్ళీ వెళ్ళి వాటి యొక్క అంతరార్థాన్ని పొందడమే ఉత్తమైన మార్గం.
తరువాత దృష్టి కేంద్రీకరించడాన్ని ఏదైనా సకారాత్మకమైన విషయాలకు మర్చడంతో
దాన్ని విడుదల చేయండి. మనల్ని బంధించి వున్న తాడు మనం తెంచేసేంత వరకు ఆ
వ్యక్తి ఒక పిశాచిలా మన శక్తిని పీల్చేస్తుంది. ప్రతిసారి మనం ఆ వ్యక్తి
గురించి ఆలోచించినప్పుడు, అతను లేక ఆమెకు ఆశీర్వాదాలను పంపండి, మరియు
అప్పుడు ఆ తాడు యొక్క పని పూర్తౌతుంది.
9. *నేను కృతజ్ఞతాభావంతో వుండవచ్చా ?*
అన్ని
తొమ్మిది దశల నుండి మనం వెళ్ళినప్పుడు మరియు నిజంగా కృతజ్ఞతను అనుభూతి
చెందితే అంతరార్థాలు పొందినట్టే, అది చైతన్యాలను ఉన్నతీకరిస్తుంది.
కృతజ్ఞత అనేది మూడు ఎదుగుదల వైఖరులలో ఒకటిది మరియు అది ముగిసే దశ. మనం
నిజమైన కృతజ్ఞతను చేరుకుంటే, అది మనల్ని మన ఉన్నత కాంతి దేహాలతో అనుసంధానం
అవ్వడానికి తోడ్పాటును అందిస్తుంది మరియు కష్టాలను అధిరోహణ పనిముట్లుగా
మారుస్తుంది.
మొదటి
ఎనిమిది దశలను మీరు పూర్తి చేసి వుంటే, మరియు కృతజ్ఞతను అనుభూతి చెంది
వుండకుంటే, దయచేసి మళ్ళీ వెనక్కు వెళ్ళి అవన్ని మళ్ళీ చేయండి. మనం
బహుమతులను, అద్దాలను మరియు విలువైన పాఠాలను చూసినప్పుడు, మన జీవితంలోని
ప్రతిదానికి మనం కృతజ్ఞతతో వుండాలి. పాఠాలు పెద్దవి అయినా కూడా, యుద్ధం లో
పాల్గొనాల్సి వచ్చినా, అత్యాచారానికి గురైనా, లేక అనాధగా మిగలాల్సిన
పరిస్థితి వచ్చే పెద్ద పెద్దవి అయినా కూడా, ఉన్నత దృక్కోణం నుండి వాటిని
చూసినప్పుడు అది మనకు పాఠము లేక బహుమతే. ఇంకా మనం పిల్లలుగా వున్నప్పుడు
అత్యాచారానికి గురైనా కూడా, దాన్ని మనం అధిగమించినప్పుడు భూమి కూడా దీనికి
గురి అయ్యింది కాబట్టి మనం దాని యొక్క ప్రకంపనలను కూడా ఉన్నతీకరిస్తాము.
ఇంకా, మనలో ఏ ఒక్కరు అధిగమించినా, తరువాతి వ్యక్తికి ఇది ఇలాగే చేయడానికి
సులభతరం అవుతుంది
No comments:
Post a Comment