Friday, September 22, 2017

11/09/17, 8:42:02 AM: ‪+91 80088 84529‬: రుద్రాక్ష స్ఫటిక మాల

మా గురువుగారు మహారాజపురం సంతానం కంచి పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తులు. వారు శ్రీవారిపై ఇక థిల్లానా, మూడు సంకీర్తనలు కూడా స్వరపరిచారు. వాటిని చాలా కచేరిలలోనూ, క్యాసెట్టు రికార్దింగుల్లోనూ పాడారు.

ఆగస్ట్ 87 నుండి జూన్ 92 దాకా మా గురువు గారికి గాత్ర సహాయకునిగా పాడడం నా పూర్వజన్మ సుకృతం. వారితో పాటుగా మహాస్వామివారిని దర్శించుకుని, వారి ముందు పాడి, స్వామివారి నుండి ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం నాకు చాలాసార్లు దొరికింది. మా గురువుగారికి స్వామివారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందులో చాలాసార్లు నాతో పంచుకున్న అనుభవం ఇదే :

శ్రీ మహారాజపురం విశ్వనాథ అయ్యర్ నుంగంబాక్కంలో నివసించేవారు. ఒకసారి మహాస్వామివారు వారి ఇంటిపక్కన బస చేశారు. అప్పుడు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. ఒకరోజు సాయింత్రం యం.వి అయ్యర్ గారు ఇంట్లో కూర్చుని “వినాయకుని”, “అనాధరక్షకి శ్రీకామాక్షి” కీర్తనలు పాడుతున్నారు. వెంటనే మహాస్వామివారు లేచి బయటకు వచ్చి యం.వి అయ్యర్ గారి ఇంటి లోపలకు వచ్చారు. అయ్యర్ లేచి నమస్కారం చేసి నిలుచున్నారు.

“నీ ఆలాపన నన్ను నీ ఇంటికే కాకుండా మౌనవ్రతాన్ని వీడివచ్చేలా చేసింది” అన్నారు మహాస్వామి.

యం.వి అయ్యర్ గారికి ఎప్పటి నుండో ఒక కోరిక అలాగే ఉండిపోయింది. పరమాచార్య స్వామివారు ధరించే రుద్రాక్షలు స్ఫటికలు కలిసున్న మాలను ఆశిర్వాచనంగా పొందాలని. కాని వారి జీవితకాలంలో అడి పొందలేక పోయారు.

ఒకనాటి సాయంత్రం మా గురువు గారు (మహారాజపురం సంతానం) సతారాలో మహాస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారు మోహన రాగాన్ని పూర్తిగా పాడమన్నారు. మా గురువు గారు స్వామివారి నుండి సెలవు అడుగగా, ఆ రాత్రికి అక్కడే ఉండిపోమ్మన్నారు.

తెల్లవారుఝామున పక్క గది నుండి ఏవో మాటలు వినబడడంతో లేచి చూసారు. మహాస్వామివారు ఉంటున్న గదిని స్వామివారే స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు.

కిటికీ నుండి చూస్తున్న మా గురువుగారిని స్వామివారు చూసి రమ్మని పిలిచి, మరలా మోహన రాగంలో “ఎవరురా నినువినా!” పాడించుకున్నారు. పాట పూర్తైన తరువాత ప్రసాదం ఇచ్చి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.

తమ తండ్రి గారు పరమాచార్య స్వామీ వద్ద నుండి ఆశించిన బహుమానం తనకు కూడా అందకపోవడంతో మా గురువు గారు భారమైన హృదయంతో బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే మహాస్వామివారు పిలిచారని మఠం ఉద్యోగులు చెప్పగా, మా గురువుగారు స్వామీ వద్దకు పరిగెత్తారు.

మహాస్వామివారు మెడలోని రుద్రాక్ష స్ఫటిక మాలను తీసి మా గురువుగారికి బహూకరించారు. వారు సంతోషంతో ఆందభాష్పాలు రాలుస్తూ స్వామివారికి సాష్టాంగం చేశారు. బహుశా వారి గౌరవాల పరంపర ఇక్కడితోనే మొదలయ్యిందేమో.

--- డా. రాధాకృష్ణన్ గణేష్, vandeguruparamparaam.blogspot.in

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment