11/07/17,
10:19:33 PM: +91 94413 84759: ఈ రోజు కంచి పరమాచార్య స్వామి తిరు
నక్షత్రం - "అనురాధ". స్వామి వారి జీవితం లో జరిగిన ఒక చిన్న ఘట్టాన్ని
తెలుస్కోడానికి ఎంత పనిలో వున్నా 2 ని|| కేటాయిద్దాము.
బిల్వ పత్రాలు ఎవరు తెచ్చారు ?
ఒక సారి కంచి మహాస్వాములు దక్షిణ కైలాశం అయిన శ్రిశైలం లో విజయ యాత్ర చెస్తున్నారు.
స్వామి
వారు ఎప్పుడు, ఎన్ని రోజులు ఒక ఊరిలో వుంటారొ ఎవ్వరికి తెలిదు. అలా ఒకసారి
కర్నూల్ పరిసర ప్రాంతం లో విచ్ఛేయగా స్వామి వారిని పూర్ణ కుంభం తో
అహ్వానం పలికి సభ ఎర్పాటు చేెసారు. స్వామి వారు వేద సంరక్షణ, భారతీయ వైభవం
గురించి తెలుగు లో(స్వామి వారు 18 భాషలలో ప్రావీణ్యులు) అనుగ్రహభాషణం
ఇచ్చి తీర్థ ప్రసాదలతొ ఆశీర్వదించి మళ్ళీ యాత్ర మొదలు పెట్టారు ( 73 ఏళ్ళ
పీఠ నిర్వహణ లో వాహనం ఎప్పుడు ఎక్కలేదు) అప్పుడె వర్షం పడటం మొదలు
అయ్యింది. స్వామి వరికి ఎదురు చేప్పే ధైర్యం ఎవ్వరికి లేదు కాని స్వామి
వారి మీద భక్తితొ శిష్యులు, బొయీలు పల్లకి ఎక్క మని విన్నవించారు. స్వామి
వారు నవ్వుతూ మీరు తడుస్తూ ఉంటె నేను పల్లకి లో ఎలా రాగలను? అంటూ ముందుకి
10km నడిచాక ఒక పల్లెటూరు వచ్చింది. ఆ ఊరి జనాలందరు స్వామి వారికి
సాష్టాంగ నమస్కారలు చేసి స్వామి వారిని అక్కడె బస చెయమన్నారు. ఆ ఊరి జనాల
అమృత గురు భక్తికి సంతోషించిన స్వామి అక్కడే బస చెద్దామన్నారు. మరుసటి
రోజుకల్లా ఆ ఊరిలొ పండుగ వాతావరణం వచ్చినట్లయ్యింది. మఠం ఆచారం ప్రకారం
నిత్యం చంద్రమౌళిస్వర ఫూజ చెస్కొవాడానికి పూలు నైవేద్యం సిధ్ధం చేసారు
కాని ఒక్క బిల్వ దళాలు దొరకలేదు. ఆ ఊరువారికి బిల్వ దళాలు(కేవలం మూదు ఆకులు
ఉన్నవి మాత్రమె వాడాలని శాస్త్రం)ఎలా ఉంటాయో తెలీదట, పైగా ఆ చెట్టు
ఎప్పుడు చూడలెదన్నారు. పెరివా బిల్వ దళాలు లేకుండ సహస్ర లింగార్చన ఎలా
చెస్తారు అనుకున్నారు శిష్యులు కంగారుపడుతూ.
స్వామి
వారు అనుష్టానమ్ పూర్తి చేసి పూజ కు కూర్చుని మొదట బిల్వ దళాలు ఎక్కడ
అని అడిగారు. శిష్యులు భయపడుతూ జరిగింది చెప్పారు. అప్పుడేె ఉ. 10.30
అయ్యింది .స్వామి పూజ కి కామాక్షి అమ్మ దే భాద్యత ఆవిడే తెస్తుందిలే అని
మౌనం గా వెనుక ఉన్న గోశాల కి వెల్లి కుర్చుని ధ్యాన మగ్రులైయ్యారు. స్వామి
వారు పూజ కాకుందా భిిక్ష తిస్కోరు అని శిష్యులు బాధ పడుతూ ఉండగా ఎవరో
బుట్టలొ బిల్వ పత్రాలు తెచ్చి గుడి ప్రాంగణంలో పెట్టి వెల్లిపొయారు. అది
చూసి శిష్యులు ఆనందం తో గంతులేసారు. వెంటనే స్వామి వారు వచ్చి బిల్వం
దొరికిందా అని అడిగారు. ఎవరు తెచ్చారు అని అడిగారు? ఎవరోపెట్టి
వెల్లిపొయారు పెరివా అన్నారు.సంతోషం గా ఆ రోజు పూజ ముగిసింది. మరుసటి
రోజు పూజ కి ఎలా అని అందరు అనుకుంటుండగా స్వామి వారు ఆ చత్రం ముందు మళ్ళీ
బుట్ట ఉందేమో చూడండి అన్నారు. ఆశ్చర్యం అక్కడ పెద్ద బుట్టలో బిల్వాలు
ఉన్నవి. ఎవ్వరు పెట్టారో అని ఊరంత అనుకున్నారు. స్వామి వారు శిష్యులని
ఉదయాన్నే త్వరగ లేచి ఎవరు బిల్వలు తెస్తున్నారో వారిని తన దగ్గరకు
తిస్కురమ్మాన్నారు. ఉదయం యధావిధిగా ఒక గోపాల పిల్లవాడు చినిగిన మురికి
బట్టలతో వచ్చి బుట్ట పెట్టి వెంటనే వెల్లిపోతున్నాడు. వెంటనే శిష్యులు
పిల్లవాడిని భయపడుతుండగా ఆపి పెరివా పిలుస్తున్నారు అన్నారు. ఆ పిల్లవాడు
భయపడుతుండగాస్నానం చేసి మంచి బట్టలు వెస్కొరమ్మని స్వామి వారి దర్శనం
చెస్కోమని చెప్పారు. అలాగె అని పరిగిత్తాడు పిల్లవాడు. మధ్యాహ్నం ఉతికిన
బట్టలతొ వచ్చి భయపడుతూ నిల బడ్డాడు. స్వామి ఎంతో ఆనందం తో పేరు అడగగ
"పురంధర కేశవులు" అన్నాడు. తన గురించి ఏడుస్తూ ఈ విధంగా చెప్పాడు. మా
అమ్మ 2 ఏళ్ళ వయసులొ చనిపోయింది మా నాన్న నన్ను పెంచాడు. ఎన్నో మంచి
విషయాలు, కథలు చెప్పెవాడు, పురంధర, త్యాగరాజస్వామి కీర్తనలు ఎన్నో
నెర్పాడు. అందుకే నాకు పురందర అని పెరుపెట్టడని, మా నాన్న నాకెప్పుడు బిల్వ
దళాల గురించి చెప్పేవారు. అవి దేవుని ఇష్టం అని చెట్టునాటిచ్చాడు.
కాని
2 ఎళ్ళ ముందు నాన్న చనిపొయారు. నాకిప్పుడు 12 ఎళ్ళు పెరివా అన్నాడు.
స్వామి వారు పిల్ల వాడి వినయానికి భక్తికి పొంగి పోయారు. ఎమి వరం కావాలో
కోరుకో అన్నారు. ఎదైన ఇస్తాను అన్నారు( పెరిరా ఎప్పుడు ఇలా వరం ఇస్తామని
అనలేదట) పిల్లవాడు వెంటనే స్వామి మా నాన్న లౌకిక విషయాలని కోరుకొవద్దని,
వారిని నిత్యం సేవ చేయాలని చెప్పారు. అందువల్ల మీరు అనుగ్రహిస్తే రెండు
కోరికలు ఉన్నవి అన్నాడు. ఒక్కటి మీ దగ్గర పురంధర,త్యాగరజ స్వామి కీర్తనలు
ఇక్కడ ఉన్నన్నాళ్ళూ పాడాలి అన్నాడు. స్వామి వారు సంతొషించి అలాగె అని ఇంకో
కొరిక ఎంటి అని అడిగారు. నేను మీరు వెళ్ళె ముందు కోరుతా అని సాస్టాంగం
చెసాడు. అలాగె 21 వ రోజులు అయ్యాక స్వామి బయల్దెరుతుండగ పిలిపించి ఆ రెండవ
కొరిక ఎంటి అని అడిగారు. స్వామి మీరు తప్పక ఇస్తానంటేనె చెప్తా అన్నాడు.
స్వామి వారు నవ్వి అలాగే అన్నాడు. " స్వామి నాకు మరు జన్మ వుండకుండ మోక్షం
ఇవ్వండి అని అడిగాదు.స్వామి వారు 12 వయసు గల ఇతని భక్తి ని చూసి పొంగి పోయి
దేవుడు అలానె ఇస్తాడని ఆశిర్వదించి వెల్లిపొయారు.
-----40
ఎళ్ళ తర్వాత--- ఒకసారి కంచి మఠం లో ఉన్నట్టుండి పెరివా మధ్యానం 2 కి లేచి
వెంటనే కామక్షి అమ్మ గుడి పుష్కరిణి కి ( భాగవతం లో శ్రీ మహావిష్ణువు " అల
వైకుంఠం లో నగరిలో" అని వర్ణించి నట్లుగా) కి వెళ్లారు. ఎవో మంత్రాలు
జపిస్తూ 6 సార్లు మునక వేసారు. శిష్యుల కి ఇదంత ఎదొ వింత గా తోచింది. ఇక
భయంతో జంకుతూ స్వామి ఈ సమయం లో ఎందుకు వచ్చారు అని అడుగగా కొంత పాత
శిష్యులను చూస్తూ " మీకు గుర్తుందా 40 ఎళ్ళ క్రితం కర్నూలు దగ్గర
పల్లెటూరులో పురంధర కెశవులు పూజ కి బిల్వాలు తెచ్చాడు. తనకు 52 ఏళ్ళు
ఇప్పుడు వ్యాధితొ మరణించాడు. అప్పుడు మోక్షం కావాలని కోరాడు. తనకి ఇంకా 6
జన్మ ల కర్మ శేషం ఉంది కాని చంద్రమౌళిశ్వరుడు కరుణించి ఇప్పుడేె మోక్షం
ఇచ్చాడు అన్నారు. అందరు స్వామి వారి దయకు నివ్వెర పోయారు.
ఎన్నో జన్మలు తపస్సు చేసినా రాని మోక్షం ఒక సద్గురువిని ఆశ్రయిస్తే వచ్చింది.
జయ జయ శంకర! హర హర శంకర
# కంచి పరమాచర్య స్వామి వైభవం#
No comments:
Post a Comment