07/07/17, 11:51:17 AM: KK: మంత్రములు ఎందుకు గురువునుండి స్వీకరించాలి :
>మొదటిది అక్షర దోషాలవల్ల అర్ధము మారుతుంది
>స్వరము లేని మంత్రము వాసనలేని పువ్వు ఒక్కటే
స్వరయుక్తముగా గురువొక్కడే చెప్పగలడు
>తరువాత మంత్రోద్ధారము గురువు మాత్రమే చెయ్యగలడు
>గురువు సరి అయిన ముహూర్తము నిర్ణయిస్తాడు
దాని వల్ల మంత్రము ఉద్దీపనమగును
>ఏ మంత్రము శిష్యుడు త్వరగా సాధించగలడో, సిద్ధినిపొందగలడో చెప్పగలడు
> గురువులు ఒకఋషి సంప్రదాయములో ఉండడంవల్ల , గురుమండలము శిష్యుని ఉద్దరించగలదు
> మంత్రానికి కల ముఖ్యమైన రహస్యము :
మంత్ర సంస్కారములు : ఉన్నాయి
అవి గురువే చెప్పగలడు
> జపము చెయ్యటంలో - బాహ్య శుచి, ద్వార పూజ, భూతశుద్ధి , ఆసన సంస్కారము ,న్యాసము ,ముద్ర ముఖ్యమైనవి .
అవి గురు సమక్షంలో మాత్రమే తెలుసుకోవలసిన మర్మములు
కావున సద్గురువుని ఆశ్రయించి మంత్ర సాధన చెయ్యండి
No comments:
Post a Comment