04/07/17, 8:48:49 AM: +91 80088 84529: భక్తి ముఖ్యం
ఎప్పటిలాగే
సెలవులప్పుడు ఒకసారి పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోటికి వెళ్ళాను.
రాత్రి నిద్రించడానికి సమాయత్తమవుతున్నాను. నేను ఎక్కడపడితే అక్కడ నేలపైనే
పడుకుంటాను. విలాసాలకు, సౌకర్యాలకు, సుఖాలకు బానిసను కాకుండా మహాస్వామి
వారు నన్ను తీర్చిదిద్దారు. ఇది నాకు ఈనాటికి ఉపయోగపడుతోంది. మకాం ఇప్పుడు
ఉన్న చోట పూజ గది ముందు పెద్ద హాలు ఉంది.
ఆ
హాల్లో ఉద్యోగులకొరకు బల్లలు, కుర్చీలు ఉన్నాయి. అది వేసవి కాలం కావడంతో
దేవాలయంలోని నేలపై పడుకోలేము. ఎందుకంటే నేల చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ
కార్యాలయం గదిలోనే బల్లల మధ్యలో పడుకోవాలని నిర్ణయించుకొని ఒక చిన్న
ఉత్తరీయం పరిచి పడుకున్నాను.
అది
దాదాపు పదిన్నర పదకొండు గంటల సమయం. మొత్తం దీపాలన్నీ ఆర్పేయడంతో చాలా
చీకటిగా ఉంది. ఏదో చిన్న వెలుగు నా ముఖంపై పడడంతో నిద్రాభంగమై లేచాను.
కళ్ళు నులుముకుంటూ ఏమి జరిగిందో చూద్దామని ప్రయత్నించగా, మహాస్వామివారు
కనపడ్డారు. కుడిచేతిలో నీటిపాత్ర, ఎడమ చేతిలో దండం మరియు టార్చిలైటు
పట్టుకుని నిలబడ్డారు.
వెంటనే స్వామివారు, “లే. నాతో రా” అని అన్నారు. ”ఇదో ఈ టార్చి తీసుకో” అని నా చేతికిచ్చారు.
“నాకు ముందు నడుస్తావా? వెనక నడుస్తావా?” అని అడిగారు.
”మీ ఇష్టం పెరియవ”
“సరే. నా వెనుక నడువు. కాని వెలుతురు నా ముందుకు పడేలా చూడు” అని ఆదేశించారు.
అలా
స్వామివారిని అనుసరిస్తూ వెళ్తున్నాము. అది చాలా ఇరుకు దారి. దాదాపు మూడు
కిలోమీటర్లు నడిచాము. ఒక పాత మండపం దగ్గర స్వామివారు ఆగారు. అక్కడ ఒక నీటి
కొలను ఉంది. “నువ్వు ఇక్కడ పడుకో” అని ఆజ్ఞాపించారు. ఆ మండపం నేలపై నేను
పడుకున్నాను.
ఉదయం
స్వామివారు చిన్నగా “శేఖర్ లే, మనం వెళ్ళాల్సిన సమయం అయ్యింది” అనడంతో
మెలకువ వచ్చింది. ఇలా మూడు సార్లు జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను.
స్వామివారు ఇలా ఎందుకు చేశారు? కుతూహలాన్ని ఆపుకోలేకపోతున్నాను శంకరా!
స్వామివారు
నాకు ఒక ఆదేశం ఇచ్చారు. “నువ్వు మఠానికి వచ్చినప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో
తెలుసా? చంద్రమౌళీశ్వర పూజను తిలకించి, స్వామివారికి అమ్మవారికి
నమస్కరించు. నాకు కూడా నమస్కారం చెయ్యి. అంతే తిరిగి వెళ్ళిపో. ఇక్కడ
అందరితోనూ మసలుతూ, అనవసరమైన విషయాలు పుకార్లు వినకు. నువ్వు వేరేవైపు
పయనిస్తే నీ భక్తి తగ్గిపోయి ఒకనాటికి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది”
ఈనాటికి నేను అలానే బ్రతుకుతున్నాను. స్వామివారు నాకు అలా శిక్షణనిచ్చారు.
--- చంద్రశేఖర్, పొల్లాచి జయం పాట్టి కుమారుడు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment