07/07/17,
8:43:41 AM: KK: *భైరవ తత్వం - విజ్ఞాన భైరవ తంత్రం:--* *కాలభైరవుడు
వారణాసికి క్షేత్రపాలకుడుగా కీర్తించబడ్డాడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం
సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తూ శివుడే కాలభైరవుడై
సంచరించాడని శాస్త్రాలు చెపుతున్నాయి. అనేక దేవాలయాల్లో కాలభైరవ విగ్రహం
వుంటుంది, ఆయన క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర
వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా మనకి తెలుసు.*
*కల్పాంత దహనోపమ! భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి.*
*ప్రళయకాలపు
అగ్నివలే జ్వలించు భైరవుడా నీకు నమస్కారం. నాకు అనుజ్ఞను ప్రసాదించు అని
అర్ధం. హోమ కార్యాల్లో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం
చేస్తారు. 'భైరవ సాధన ' అనే గ్రంధంలో ఓ మహాయోగి ఆంధ్రదేశంలో ద్రాక్షారామంలో
కాలభైరవుడిని శ్రీనాధుడు వర్ణించిన విశేషాలని విశదీకరించారు.* *సాధనా
పద్ధతులు వర్ణించారు.*
*ఇక సాక్షాత్తూ ఆదిశంకరాచార్యులవారు కాలభైరవాష్టకాన్ని రచించారు, ఇది జగత్ప్రసిద్దమైనది.*
*దేవరాజ సేవ్యమాన* *పావనాంఘ్రి పంకజం*
*వ్యాళ యజ్ఞ* *సూత్రమిందు శేఖరం కృపాకరం*
*నారదాది యోగిబృంద వందితందిగంబరం*
*కాశికా పురాధినాధ* *కాలభైరవం భజే!*
*భైరవుని
వాహనం శునకం. వాహనం, ఆయా దేవతల మూల తత్వాన్ని సూచిస్తుంది. దుర్గ వాహనం
సిం హం. అంటే ఆవిడ సిం హం మీద ప్రయాణిస్తుందని కాదు. సింహం ప్రకృతిలో
రాజసిక శక్తికి చిహ్నం. దాన్ని జయించడమే ఆమె తత్వం. భౌతిక ప్రపంచము
కీలకాలని అన్వేషించి వాటిపై అధికారాన్ని సంపాదించే పెద్ద తత్వం
వినాయకుడైతే, ఆ భూమిలోకి కలుగులు చేసుకుంటూ వెళ్ళే ఎలుక ఆయన వాహనం. ఇది
మూలాధార చక్రం కధ. అలాగే విశ్వాసాన్ని ప్రతిబింబించే కుక్క కాలభైరవుని
వాహనం. అంటే భక్తానుగ్రహాన్ని, అతీంద్రియమైన శక్తులని ప్రసాదిస్తాడని
అర్ధం. దేవాలయాల్లో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి, బెల్లం నైవేద్యం
పెడతారు.(ఇంకా ఉంది)*
07/07/17,
8:43:58 AM: KK: *కాలమే జగన్మూలం. ఆ కాలరూపుడే కాలభైరవుడు.* *కాలాన్ని
జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.* *గ్రహబలాలని
అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం.
కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అనేక
సంవత్సరాలు కాలభైరవాలయంలో సాధనచేసినట్లు ఆ పీఠంలో ఆ సమయంలో వున్న సాధకులు
తెలిపారు.*
*కాలభైరవుడ్ని
నేపాల్ ప్రాంతాల్లో, హిమాలయాల్లో ఎంతగానో పూజిస్తారు. ఖాట్మండు నగర
మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి చాలా దశాబ్దాలు నేపాల్ సుప్రీం కోర్టుగా
పరిగణించబడేది. ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండలేరని
నమ్మకం. ఇటువంటిదే కానీపాకంలో వినాయకుని గురించి కూడా మనం వినవచ్చును.
ఆధునికయుగంలోనూ కొన్ని కొన్ని విశేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.(ఇంకా ఉంది)*07/07/17,
8:44:15 AM: KK: *ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా చెప్పవలసిన ఒక
భైరవ రూపం వుంది. అదే స్వర్ణాకర్షణ భైరవుడు. ఆయన పేరుకి తగ్గట్టు ధన
సమృద్ధిని, ఋణ విముక్తిని ఇస్తాడు.* *అన్నిటికన్న ముఖ్యం జ్ఞాన వైరాగ్యాలకి
ఆయనే అత్యంత సన్నిహితుడు, కారకుడు.*
*స్వర్ణవర్ణం చతుర్బాహుం త్రినేత్రం* *పీతవాససం*
*స్వర్ణ పాత్రధరం వందే స్వర్ణాకర్షణ భైరవం*
*ఉగ్రరూపిగా
వున్న నేపాల్ లోని భైరవుడు 'వ్యాఖ్యాన ముద్ర ' తో వుంటాడు. సృష్టిని
వ్యాఖ్యానించ శక్తి భైరవుడికి కాక ఎవరికి వుంది అనిపిస్తుంది. భైరవుడిని
హిందూఇజం లోనే కాక బౌద్ధులు కూడా సాధన చేస్తారు. ఆయన అనేక మంత్రాలు
బుద్దిజంలో పాళీ భాషలో వుంటాయి.కాళి, తార ఉపాసనల్లో భైరవోపాసన రక్షాకరం,
శీఘ్ర సిద్ధి ప్రదం.ఆయన సాధనతో అనేక మంత్రాలు సిద్దిస్తాయని అంటారు.*
*పూర్ణ
భైరవ తత్వాన్ని ఆధ్యాత్మిక రూపాన్ని అవగాహన చేసుకోవాలంటే 'విజ్ఞాన భైరవ '
తంత్రం చదవాలి. ఇందులో అనేక రహస్యాలూ శూన్యానికి, ప్రణవానికి, యోగానికి
వున్న సంబంధాలూ వున్నాయి. ఇందులో భైరవుడు యోగిగా, పరబ్రహ్మ తత్వంతో
కనిపిస్తాడు. పతంజలి యోగసూత్రాలవంటి యోగ రహస్యాలని విశదీకరిస్తాడు. ఈ
విజ్ఞాన భైరవ తంత్రాన్ని సరళ వ్యాఖ్యానంతో సభ ముందు పెడతామని
తెలియజేస్తున్నాము.ఇందులోని దోషాలేవైనా ఉంటే నావి. గొప్పతనమంతా ఆ శివ
పార్వతులది...దానిని అందించిన ఋషులది.🙏*
No comments:
Post a Comment