11/07/17, 4:50:15 PM: KK: *వేదాలను ఎందుకు అపార్థం చేసుకున్నారు?*
*వేదంలో
చాలా భాగం జ్ఞానులకు, యోగులకు అర్థమయ్యే మార్మిక భాషలో ఉంటుంది. అది
సాధనాలోతులు ఎరిగిన మర్మజ్ఞులకే అర్థమవుతుంది. అందుకే వ్యాకరణమూ ,
ప్రతిపదార్థము మాత్రమే తెలిసిన పండితులు వేదం యొక్క హృదయాన్ని గ్రహించలేరు.
వేదం సూచిస్తున్న అసలైన అర్థం గ్రహించలేకపోతే, అంతరిక సాధన గురించి
తెలియకపోతే మంత్రార్ధాలు తప్పుగా భాసిస్తాయి.*
*చాలా మంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు లేదా సనాతన ధర్మ వ్యతిరేకులు ...అపార్థం
చేసుకోబడ్డ అర్థాలను స్వీకరించారు. ఎవరి స్థాయిని బట్టి వారికి విషయం
అర్థం అవుతుంది. వేద మంత్రాలకు కువ్యాఖ్యానం చేసేవారు ...తాము రోజూ చేసే
పనులనే వేదమంత్రాలలో చూసారు. అలా సనాతన ధర్మాన్ని వారు అపార్థం
చేసుకున్నారు. అనుక్షణం ఇంద్రియ నిగ్రహం గురించి , తపస్సు గురించి చెప్పే
వేదం , ఇలాంటి అపార్థం చేసుకోబడ్డ పనులను ఎందుకు ప్రోత్సహిస్తుంది? ...అన్న
ఆలోచన కువిమర్శకులకు రాలేదు.*
*ఈ మధ్య
వేదాలకు భాష్యం చెపుదామని ప్రయత్నం చేసిన కొందరు ఇదే తప్పు చేసారు. వేద
మంత్రాలకు నిగూఢమైన అర్థం ఉంటుంది. భాషాజ్ఞానం ఒక్కటే ఉపయోగించి పైపైన ఆ
వేదజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే తేలికగా దారితప్పే
ప్రమాదమున్నది. మంత్రార్థం తెలియాలంటే మంత్ర చైతన్యంతో అనుసంధానమయ్యే
సామర్థ్యం ఉండాలి. వేదంలో ఉన్నవి మంత్రములు. ఉత్త శ్లోకములు కావు. వాటికి
వ్యాకరణ పూర్వక వ్యాఖ్యానం మాత్రమే సరిపోదు.*
No comments:
Post a Comment