24 PM: +91 98496 66587: 🙏 ప్రదోషము 🙏
ప్రదోషమంటే అది ఒక కాల విశేషము . ప్రదోషమంటే పాప నిర్మూలన అని
అర్థము . ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది
ప్రదోషము . అనగా , చంద్రుడి గతి వలన , ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము
అయితే , అప్పుడు ప్రదోషము అంటారు . కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు
తిథి మారితే , అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది . అయితే అన్నిరోజులలో
కలిగే ప్రదోషాలపైకి , మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది . అవి , చతుర్థి ,
సప్తమి , త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు . వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే
ప్రదోషాన్ని ’ మహా ప్రదోషం ’ అంటారు .
ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును .
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి
తిథి వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా
సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదహైదు ఘడియల లోపల సప్తమి తిథి
వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా సూర్యాస్తమయము
తర్వాత సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి
వచ్చునో , ఆ దినము ప్రదోషము కలుగును . అటులే , ఏ దినమైనా సూర్యాస్తమయము
తర్వాత త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము .
ఈ త్రయోదశీ ప్రదోషము అవధిని ఇలాగ లెక్క కట్టెదరు . సాయంత్రం
నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే . కొందరు
సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ , తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు
. ( ఒక ఘడియ = 24 నిమిషాలు )
ఈ ప్రదోష దినము అనధ్యయనము . సర్వ విద్యలకూ గర్హితమైనది .
సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది . ఆ సమయములో ప్రదోషమైనచో ,
కొన్ని అనుష్ఠానములు చేయ వలెను . మామూలుగా చతుర్థి , సప్తములలో ధ్యానము ,
గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు ,
కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అనునది కొందరి మతము . మామూలుగా ప్రతి
పక్షములోనూ ప్రదోషము వచ్చును . కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాస
శివరాత్రి వచ్చును . దాని వెనుకటి రోజు త్రయోదశి లో మహా ప్రదోష కాల
శివపూజ విధించబడినది . శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత గలదు .
ఆరోజు కూడా శివ పూజనే చేయవలెను .
ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం . మనము రోజూ ఎన్నో పాప
కర్మలు చేస్తుంటాము . వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను
తెచ్చుకుని , మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము .
మన పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే , దానికి తగ్గ పుణ్య కర్మలు చేయవలెను
. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము . పరమ శివుడు తన ప్రమథ
గణాలతో కొలువై మన పూజలు అందుకొనుటకు సిద్ధంగా ఉండు సమయమది . మన పాప కర్మల
ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి , మనకు సాత్త్విక గుణమును
కలిగించి మన కష్టములను తగ్గించును .
ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి యనీ ,
సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు . ఇవి కాక , గురువారము నాడు
వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము గలది . అన్ని త్రయోదశులలోనూ శివపూజ
తప్పనిసరి అయినా , ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి .
శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకము లోని శని ప్రభావము
కూడా తొలగింపబడును . శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు .
మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడితడు . అట్టి శని
ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును .
సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి
కలుగును . సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది . ఆరోజు చేసిన శివపూజ సర్వ
పాప హరము , సర్వ పుణ్యదము .
ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే , ఆనాడు చేసిన పూజ వలన
గురు అనుగ్రహము కలిగి , విద్యాబుద్ధులు , సంపదలు కలుగుతాయి . గురువు
వాక్పతి , బుద్ధిని ప్రేరేపించువాడు , మరియు ధన కారకుడు . జాతకములో గురు
దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే .
ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు , మహాన్యాస
పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో , ఏకవార రుద్రాభిషేకమో , లఘున్యాస నమక చమక
పఠనమో , ఉత్త పాలతో అభిషేకమో , మారేడు దళములతో అర్చననో , ఏదో ఒకటి చేసి
అనంత ఫలము పొందండి . భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు ,
పొంగిపోతాడు , భోళా శంకరుడు .
స్సర్వేజనా సుఖినోభవంతు -----------------------------------------
(
" మహాద్రష్ట " గ్రంధము ఆధారంగా ) సేకరణ:-- జంపని శ్రీనివాసమూర్తి.
M.com., M.A., B.Ed., (P.hd), విశ్వతేజ ఎస్టేట్స్, చీఫ్ జనరల్ మేనేజర్,
శ్రీరాజయోగా పూజామేటీరియల్స్ & బిగ్విన్, getapujari.com
No comments:
Post a Comment