05/07/17,
12:45:33 PM: KK: *తంత్ర మార్గం - చక్ర విజ్ఞానం - మూలాధార చక్రం 4 :
జంతువులలో మూలాధార చక్రం ఉన్నత మైనదిగా పరిగణించ బడుతోంది. మానవులలో
మూలాధారం అధః స్థానం గానూ, సహస్రారం అత్యున్నతమైనది గానూ పరిగణించబడుతోంది.
జంతు ప్రవృత్తి అత్యున్నత స్థానంలోకి వచ్చినప్పుడే మూలాధారం మొదలవుతోంది.
మూలాధార చక్రాన్ని సంతుల పరచడానికి వివిధ పద్ధతులున్నాయి. ఈ చక్ర స్థానంలో
ఏకాగ్రతను, ఎరుకను ఉంచి "లం" అనే బీజ మంత్రాన్ని ఉచ్ఛరించడం వలన ఈ ప్రదేశం
ఉత్తేజితం అవుతుంది. మూలాధారాన్ని balance చెయ్యడానికి అశ్విని, వజ్రోలి
ముద్రలను వాడుకోవాలి. పవన ముక్తాసనాలు వేసుకోవాలి. ఇవి సాధన చేసేటప్పుడు
నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి క్రమంగా జాగృతమవుతుంది. కాళ్ళకు చెప్పులు
లేకుండా నడవడం, చెట్లను కౌగలించుకోవడం...వాటి పట్ల ప్రేమాభి మానాలు వ్యక్తం
చేయడం, నాట్యం చేయడం, మట్టి వాసన చూడడం...ఆ వాసన అనుభూతి పొందడం, కొన్ని
కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేయడం, సూర్యాస్తమయ దృశ్యాలతో తాధాత్మ్యతను
పొందడం, భస్త్రిక, కపాలభాతి ప్రాణాయామాలు చేసుకోవడం...ఇలాంటి వన్నీ
మూలాధారాన్ని ఉత్తేజపరచి, balance చేయడానికి ఉపకరిస్తాయి. ఈ చక్ర
స్థానాన్ని ఉత్తేజ పరచినపుడు క్రమేణా వ్యామోహాలు తగ్గిపోయి ...వైరాగ్యం
పెరుగుతుంది.మూలాధారం ఉత్తేజితమైన సందర్భాలలో ఆ ప్రాంతంలో దురద, చిన్న
వైబ్రేషన్ లాంటి సంవేదన కలుగవచ్చు. ఇది సాక్షీ భావనతో గమనించి ముందుకు
పోవాలి.*
*ఈ చక్రము పరిపూర్ణముగా జాగృతమైనపుడు అంతర దృష్టికి అది కొన్ని సార్లు నారింజ ఎరుపు జ్వాలగా కనిపిస్తుంది.*
No comments:
Post a Comment