14/07/17,
6:58:20 PM: +1 (732) 692‑3270: SVSN శర్మ గారు ఇదివరకు మనకు ఇచ్చిన
తిథిని అనుసరించి గణపతి ఆరాధనా వివరాలు ఈ క్రింద మన అందరికోసం.
తిథిననుసరించి గణపతులు
తిథిననుసరించి
గణపతులకు నమస్కరించుకోవడమనే విధానం ఉంది. ఉదాహరణకు పాడ్యమి నాడు బాలగణపతి.
ఈ రోజునుండి ప్రతిరోజూ తిథి గణపతులను నమస్కరించుకుందాం.
• పాడ్యమి తిథికి అధిపతి బాలగణపతి. "శ్రీ బాలగణపతయే నమః"
• విదియ తిథికి అధిపతి తరుణగణపతి. "శ్రీ తరుణగణపతయే నమః"
• తదియ తిథికి అధిపతి భక్తిగణపతి. "శ్రీ భక్తిగణపతయే నమః"
•
చతుర్థి తిథికి అధిపతి వీరగణపతి. "శ్రీ వీరగణపతయే నమః". బుధవారం నాడు
చతుర్థి వస్తే అంగారక చతుర్థి అని అంటారు. అంగారక (భౌమ) చతుర్థిగా చాలా
విశేషమైనది. గణేశ అనుగ్రహాన్ని పొందడానికి ఇది ఒక మహదవకాశం.
• పంచమి తిథికి అధిపతి శక్తిగణపతి. "శ్రీ శక్తిగణపతయే నమః"
• షష్ఠీ తిథికి అధిపతి ద్విజగణపతి. "శ్రీ ద్విజగణపతయే నమః"
• సప్తమి తిథికి అధిపతి సిద్ధిగణపతి. "శ్రీ సిద్ధిగణపతయే నమః"
• అష్టమి తిథికి అధిపతి ఉచ్ఛిష్టగణపతి. "శ్రీ ఉచ్ఛిష్ట గణపతయే నమః"
• నవమి తిథికి అధిపతి విఘ్నగణపతి. "శ్రీ విఘ్న గణపతయే నమః"
• దశమి తిథికి అధిపతి క్షిప్రగణపతి. "శ్రీ క్షిప్రగణపతయే నమః"
• ఏకాదశి తిథికి అధిపతి హేరంబ గణపతి. ”శ్రీ హేరంబగణపతయే నమః.”
• ద్వాదశి తిథికి అధిపతి లక్ష్మీ గణపతి. “శ్రీ లక్ష్మీ గణపతయే నమః”
• త్రయోదశి తిథికి అధిపతి మహాగణపతి - శ్రీ మహాగణపతయే నమః. ఇదే మన వల్లభ గణపతి
• చతుర్దశి తిథికి అధిపతి విజయగణపతి.” శ్రీ విజయ గణపతయే నమః”
• పూర్ణిమ, అమావాస్య తిథులకి అధిపతి నృత్య గణపతి. కొన్నిటిలో నిరుత్త గణపతి అని కూడా ఉంది. "శ్రీ నృత్యగణపతయే నమః"
No comments:
Post a Comment