10/07/17,
8:18:02 PM: Yes Pk: శివ పరివారమంతా ఒకే మూర్తిలో నెలకొన్న శ్రీ
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము పంపనూరు, అనంతపురం జిల్లాలో ఉన్నది.
🌴🌴 *$PK* 🌴🌴
స్వామి
విగ్రహము సర్ప రూపంలో వుంటుంది. పీఠం నుండి సింహతలం వరకు స్వామి ఐదు
రూపాలలో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీ చక్రము వున్నది. ఇది అమ్మవారి శక్తి
స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీ చక్ర స్వరూపంలో వున్న అమ్మవారు రాహుగ్రహము
యొక్క అధిష్టాన దేవత. సర్పం చివరభాగము శ్రీచక్రానికి 3 1/2 సార్లు
చుట్టుకోవటం మానవ శరీరంలోని వెన్నెముక చివరిభాగం మూలాధారంలో కుండలిని శక్తి
రూపంతో సర్పాకారంతో మూడున్నర చుట్లు కలిగి వుండటాన్ని సూచిస్తోంది
అన్నారు. సర్ప రూపంలో క్రింద భాగము వక్రతుండ ఆకారంలో సుబ్రహ్మణ్యస్వామికి
అన్నగారైన శ్రీ మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ గణపతి స్వరూపం కేతుగ్రహ
అధిష్టాన దేవత, మూలాధార చక్ర అధిదేవత. మూల విరాట్ లోని మధ్యభాగం శివలింగం
ఆకారంతో దర్శనమిస్తుంది. ఈశ్వర స్వరూపం కాలస్వరూపుడు. కాలసర్ప
అధిష్టానదేవత. ఆయన ఆయుష్యు, ఆరోగ్య ప్రదాత. ఇంక పైన, ఏడు పడగలు విప్పిన
నాగేంద్రుని రూపాన్ని దర్శించవచ్చు. విగ్రహం చివరి భాగంలో వున్న సింహధ్వజము
నరసింహ స్వరూపంగా విష్ణు తత్వాన్ని సూచిస్తుంది. స్వామికి ఇరువైపుల నెమలి
పింఛాలతో కూడివున్న చక్రాలు స్వామివారి వాహనం మయూరాన్ని సూచిస్తుంది.
No comments:
Post a Comment