11/08/17, 12:13:29 PM: +91 94411 78068: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸
🌻 తనకేమున్నదో ఆ మొత్తమును, తన ప్రాణమును హరికి సమర్పణముగా జీవించువాడు, దైవభక్తులను అంతర్యామి రూపములుగా సేవించువాడు, పుణ్యములైన వ్రతములే తన జీవితముగా జీవించువాడు, దేవుని కథలు వినుటయే తన కథగా బ్రతుకువాడనుభవించు కైవల్యము ఇతరులకు అనుభవమునకు రాదు. అతడు అనుభవించు నిర్వాణము కేవలము శమదమాదులు, సత్యశౌచములు, యమనియమాదులు అభ్యాసము చేయువారికి రాదు. కైవల్యము, నిర్వాణము అను పదములకు వారందరు చెప్పుకొను అర్థములు వేరు. భక్తుని అనుభవము వేరు. అనుభవమనగా సత్యము. మిగిలినవి శబ్దార్థములు గనుక ఎవరి అర్థములు వారికి ఉండును. ఉదాహరణమునకు మోక్షమను పదమునకు అద్వైతి అర్థము వేరు. ద్వైతి అర్థము వేరు, విశిష్టాద్వైతి అర్థము వేరు. అవి కేవలము శబ్దార్దములు గనుక పరమార్థములు కావు. ఎవరి మోక్షమును వారు సాధికొనుచుందురు. ఆత్మ సమర్పణము చేసిన భక్తునకు " నా మోక్ష మెట్లుండును " ? అను ప్రశ్న యుండదు కనుక శబ్దార్దముగాక అనుభూతి యతనికి ఉండను.........✍ *మాస్టర్ ఇ.కె*
No comments:
Post a Comment