25/08/17, 12:45:26 PM: +91 98490 65431: ।। శ్రీః ।।
।। శ్రీగణేశపంచరత్నం।।
ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కలాధరావతంసకం విలాసిలోకరక్షకం।
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకం।।1।।
భావము
: సంతోషముతో (మోదముతో) మోదకములను రెండు చేతులా గ్రహించి, సదా విముక్తిని
(మోక్షమును) కలుగజేసెడి, అందుకు గుర్తుగా చంద్రవంకను ధరించెడి,
విలాసించుచు లోకములను రక్షించెడి శ్రీ వినాయకునకు నమస్కారము. నాయకులు
లేని వారలకు నాయకుడైనట్టి (దిక్కులేని వారికిఅన్ని దిక్కులు
తానైనట్టి), గజాసుర వధకు కారణమైనట్టి, భక్తుల పాలిట అశుభములను హేలగా
తృంచునట్టి, తనకన్న వేరొకటి లేనట్టి శ్రీ వినాయకునికి నమస్కారము.
నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం।।2।।
భావము
: నయితి అన్న భావనను వదిలి అహంకరించు వారికి భీకర స్వరూపుడై విఘ్నములను
కలిగించెడి, అప్పుడే ఉదయించిన బాల సూర్యునివలె ప్రకాశించునట్టియు,
ఆశ్రయించిన వారిని ఆపదలనుండి ఉధ్ధరించునటువంటి, దేవులకు దేవుడు, సమస్త
నిధులను కృపచేయగలిగినట్టి ఈశ్వర స్వరూపుడు, గణములకు ఈశ్వరుడు, తానే
మహేశ్వరుడైనట్టి (ఆత్మావై పుత్రనామసి) ఆ పరాత్పరుడైన (అన్ని తత్వములకన్న
అధికమైనట్టి మాయ కన్నా అధికుడైన), బ్రహ్మమే అగు శ్రీ వినాయకునికి
నమస్కారము.
సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం।।౩।।
భావము
: అన్ని లోకములకు శుభములను చేకూర్చెడివాదును, గొప్ప గొప్ప రక్కసులను
తొలగించినవాడును, తక్కువకాని బొజ్జ కలిగి మహోత్తముడై ఉత్తమమైన గజవదనము
కలవాడు, గొప్ప దయ, కృప, క్షమ, ఓర్పు కలవాడు, ఎల్లప్పుడు సంతోషములను
చేకూర్చెడివాడు, గొప్ప కీర్తి కలిగించెడివాడు, నమస్కరించువారలకు మంచి
మనస్సునిచ్చువాడు, గొప్ప కాంతి కలవాడునగు శ్రీ వినాయకునకు నమస్కారము.
అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం।
ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణం।।4।।
భావము
: దరిద్రుల దారిద్ర్యబాధల పోగొట్టునదియు, వేదములచే ప్రతిపాదితమైనదియు,
త్రిపురహరుని జ్యేష్ఠ పుత్రునివలె వెలుగొందునట్టియు, దేవతలయొక్క శత్రువుల
గర్వమును భంజించునట్టియు (నమిలివేయునట్టియు), ప్రపంచ నాశకాలమున
(మహాప్రళయమందు) భయంకరమైనట్టియు, అగ్ని మొదలగు దేవతలకు శిరోభూషణమైనట్టియు,
తన చెక్కిళ్ళయందు మదజలముతో ఉండెడి పురాతనమైనట్టియు (మొదలు తెలియనట్టియు)
ఐన గజ ముఖముతో విలసిల్లెడి శ్రీ వినాయకునికి నమస్కారము.
నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనం।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం।।5।।
భావము
: ఎంతో గొప్పనైన, మనోహరమైన దంతపు కాంతి కలిగినవాడు, యమునిని అంతము
నొందించిన శివునకు కొడుకై తనకెప్పుడూ అంతములేక విఘ్నములను తీసివేయుచు,
ఆలోచింపశక్యముకాని స్వరూపముతో మహాత్ముల, యోగిపుంగవుల హృదయమున ఎల్లప్పుడు
నివసించెడివాడును, సర్వలోక ప్రసిద్ధుడైన, ఆ ఏకదంతుని ఎల్లప్పుడు
మనసున ధ్యానించుచుండెదను.
మహాగణేశపంచరత్నమాదరేణ యోఽన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం।
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్।।6।।
భావము
: మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ
వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి
వారికి వెంటనే ఆరోగ్యము, దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును,
చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి
మంగళమౌలను పొందెదరు.
।। శ్రీ గణేశపంచరత్నం సంపూర్ణ
No comments:
Post a Comment