Saturday, August 26, 2017

/17, 7:19:48 AM: ‪+91 92468 72305‬: అష్టాదశ పురాణాలు లో ఓకటైన పద్మపురాణం లోని కొన్ని అధ్యాయాలలో ఈ వృత్తాంతం కనిపిస్తుందిని ప్రస్తావించారు. ఆ కధ చాలా విస్తారమైనది కావున ఇక్కడ క్లుప్తంగా వివరింపడం జరిగింది.

ఓకరోజు శివపార్వతులు గణ పరివార సహితం వినోద విహారార్థం స్వర్గంలోని ముల్లోకాలలోఅతి సుందరమైన నందనవనానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న కల్పవృక్షాన్ని చూసి పార్వతీదేవి కుతూహల పడింది. ఆ కల్పవృక్ష వశిష్టతను శివుడు పార్వతీదేవికి వివరిస్తూ , ఈ చెట్టు దగ్గర నిలబడి ఏది సంకల్పిస్తే అది సాకారమై నిలుస్తుంది అని వివరించాడు. శివుడు గణ పరివారము రాక్షస సంహారానికై కైలాసానికి కేగగా, పార్వతి వారు చెంతలేని ఆ నందనవనం లో ఒంటరితనానికి గురైయ్యి, కల్పవృక్షం వద్ద నిలబడి తన హృదయంలో శివవదనం వలె అద్భుతసౌందర్యాన్ని భావించింది. ఆ భావన ఒక రూపం ధరించి సాక్షాత్కరించింది. శివుని ధ్యానించిన శక్తితో భావించి రూపం కనుక శివ పార్వతులు పుత్రికగా చెప్పబడుతుంది. గౌరీ మానసపుత్రికగా ఉద్భవించిన ఆ దేవి పేరు “అశోకసుందరి”, అంటే పార్వతీ సుతులు చెంతలేని శోకాన్ని పోగొట్టి శివుడి వదనం వలె అద్భుతసౌందర్యం కలిగిన దేవి అని చెప్పబడింది.

అశోకసుందరి కల్పవనంలో దేవకాంతలతో దివ్యభోగాలతో నివసింపసాగింది. శివుడు అశోకసుందరితో చంద్రవంశానికి చెందిన ‘నహుషుడు’ తన భర్త అవుతాడని, అతడు మహాపురుషుడిని లోకకళ్యాణార్థం ‘హుందాసురుడు’ అనే రాక్షసుడిని సంహరిస్తాడని చెప్పి దీవించి పార్వతితో కైలాసానికి చేరుకున్నారు. ఆ దేవి శివుడు చెప్పిన వాక్యాన్ని విని నహుషుడు పొందుటకు తపస్సు చేయసాగింది. హుందాసురుడు అశోకసుందరి అందచందాలకు మోహితుడై తనను వివాహమని కోరగా, ఆమె నహూషుడు కి కాబోయే పత్నినని తపశ్శక్తి తో ఆ రాక్షషుడిని తిరస్కరించి “అతడు చేతిలోనే నువ్వు మరణించబోతున్నావు” అని శపించి అక్కడినుండి గంగాతీర ప్రాంతానికి తపస్సుకై చేరుకుంటుంది.

ఆయువు అనే చక్రవర్తికి అతని భార్యయందు దత్తాత్రేయుని అనుగ్రహం వలన విష్ణ్వంశతో ఉధ్భవించాడు నహుషుడు. క్రమంగా రాక్షసుడైన హుందాసురుడుని నారాయణాంసుడైన నహుషుడు సంహరించి లోకక్షేమం చేకూరుస్తాడు. హుందుడి మరణం తరువాత అశోకసుందరి గురించి తెలిసిన నహుషుడు పెద్దల దీవెనలతో ఆమెను చేపడతాడు. శివశక్తుల తత్వమైన ఆనందసౌందర్యాల ఓక కల్పనరూపం ఈమెది. ఈ అశోకసుందరి ధర్మరక్షణార్థం ఓక మహాపురుషుడిని చేపట్టడం కోసం జన్మించిన కారణజన్మురాలు. శివ గౌరి మానసతనయ గా ఆమె పూజ్యురాలు, తపశ్శక్తి దివ్యత్వం కలిగిన దేవి ఆ తల్లి అశోకసుందరి!.....ఇది ☝☝ ఫోటో యొక్క కధ.

No comments:

Post a Comment