Today at 17:39Today at 14:49Today at 14:45Today at 14:41సుగంధద్రవ్యాలు ఇవన్నీ మనకు మోక్షం ఇస్తాయా? అజ్ఞానులైన మనుష్యులు ఈ
పైవానన్నింటినీ కోరుకొంటూ రాజద్వారముల వద్ద పడిగాపులు పడి రోజులు
వ్యర్ధముగా గడుపుచున్నారు. నీ ఆరాధన చేసి శాశ్వత మోక్షానందమును
పొందవచ్చునని గ్రహింపలేకున్నారు.
=======≠===========ఈశ్వరా! నా మనసు చంచలము. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు. పుత్రులు, మిత్రులు, సంపదలు వీని మీది భ్రమను పూర్తిగా విడువదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ఇష్టంగా సేవ చేయటానికి కూడా సహకరించదు. అలాని పూర్తిగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనసుకు స్థిరత్వమును ప్రసాదించు.
===================
ఈశ్వరా! ఎన్నాళ్లు బ్రతుకుతాను? చూడవలసినవన్నీ చూశాను. ఇంకేం చూడాలి? ఇంతకాలం, భార్యాపుత్రులను పోషించాను. ఇంకెంతకాలం పోషించగలను. నిన్నే నమ్మి సేవించే నాకు తురీయావస్థలోని (జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుంటాయి. ఆ మూడింటినీ మించి నాలుగవ అవస్థ కూడా ఉంటుంది. దానిని తురీయమందురు. ఆ తురీయావస్థకు (అనగా ధ్యానసమాధికి) చేరుకొన్న యోగసిద్ధులు ఆత్మసాక్షాత్కారం పొంది ఆనందిస్తారు.) ఆ ఆనందము నాకెప్పుడు కలుగును. ఎంతకాలం ఈ నిరీక్షణలో గడిపినా ప్రయోజనం ఏం ఉన్నది? నన్ను నిరాశపరచక దయచూపి రక్షించు.
============≠======
తన శ్రాద్ధం తాను చేసుకున్న సన్యాసికూడా, తనకు రోజులు దగ్గర పడుతున్నాయని, మరణం తప్పదని తెలిసికూడా బ్రతుకుమీద ఆశను చంపుకోలేక, వచ్చిన రోగంను ఏ వైద్యుడు తగ్గిస్తాడూ, ఏ మందు పనిచేస్తుందో, ఏ దేవతలు రక్షిస్తారో ఆలోచిస్తూ, ఉన్న కొద్ది సమయంను వ్యర్ధం చేస్తాడు కానీ, నిన్ను ఒక్క క్షణమైనా ధ్యానించడు.
===================
శంకరా! సువర్ణముఖీ నదీతీరం దగ్గరి మామిడితోటలోని రాతిఅరుగు మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న నిన్ను, ప్రతిరోజూ మనసులో చూడగలిగితే, అదే ఆనందం, అదే సౌఖ్యంగానీ చంచలస్వభావం గల లక్ష్మీదేవి చూపు నటనలు (ఒకసారి అనుగ్రహించుట, ఒకసారి తిరస్కరించుట అను భిన్న భావములు) సౌఖ్యం కలిగించునా?
===================
09/01/17, 7:45:02 AM: +91 99499 26268: తప్పకుండ చదవండి... మీ మనస్సుకు నచ్చే స్టోరీ...!!!
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజు తన పని చేసుకుంటూ ఉండగా..,
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా
కనిపించింది.అతను ఆ రాయినిఇంటికి తీసుకుని వెళ్లి
భార్యకు ఇచ్చాడు.
ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల
తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి
దాన్ని ఉపయోగించుకుంది!
ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ
రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.
కొద్ది సేపటికి
అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి
చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాయి
చేతిలో పట్టుకుని
వెళ్ళాడు.
ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను
బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక లడ్డూ ఇస్తాను అన్నాడు. పిల్లాడు
సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని
స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే
అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని
ఒక లడ్డూ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ
స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.
అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి
చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి
వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి
అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి భలే ఉంది! నాకు ఇచ్చేయ్
అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు
తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది
కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా
వాడసాగాడు.
కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి
వచ్చి ఆ రాయిని చూసి, అతనికి మరి కొంత ఇచ్చి ఆ
రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి
తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు
విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
నీతి :-
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు
కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ
ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక లడ్డూ
కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.
ఒకళ్ళు దాన్ని
పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని
గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ
రాబట్టుకున్నాడు.
అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో
అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి
అన్నది వారి వారి బుద్ధి మీద ఆధార పడి ఉంటుంది! మానవ జీవిత పరమార్థం
తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ
జీవన్ముక్తి పొంద గలుగుతారు.
లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
అసలు..,
మానవ జన్మ ఎత్తిన ఈ,
మనుషులందరూ వజ్రాలే!
తమలోని మంచి,మానవత్వం,ప్రేమ అనే ధగ ధగలను దాచుకుని రాళ్ళలా జీవిస్తున్నారు

09/01/17, 6:52:56 AM: Peddabbai: బ్రాహ్మణులంటే ఎవరు ?
వనం జ్వాలా నరసింహారావు గారి రచన
ఆంధ్రభూమి దినపత్రిక
06.12.2015
నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన కలుగజేయాలి. హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం.
"బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" - అంటే "యజ్ఞం” అనే పదం నుంచి వచ్చింది. యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.
అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్లో "బహున్" లుగా, మయన్మార్లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణకమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.
వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.
వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు. వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.
వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?
చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!
కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.
ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం !

09/01/17, 9:24:04 AM: +91 80088 84529: అందుకు ఒకరు వస్తారు
1945 ఫెబ్రవరిలో పరమాచార్య స్వామివారు రాణీపెట్టైలో మకాం చేస్తున్నారు. అక్కడ నివసించేవారు దాదాపుగా హైందవేతరులే అయినా కులమతాలకతీతంగా మహాస్వామివారి దర్శనానికి వచ్చేవారు. రాణీపెట్టై సమీపంలోని నావల్పూర్ ప్రజలు “కరుమారుయమ్మన్ దేవి” ఆలయం కట్టడానికి లక్షలలో నిధులు కావాలని గ్రహించి కాస్త కలత చెందారు. పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వారు స్వామివారి దర్శనానికి వచ్చారు.
“మేము ఒక మంచి కార్యక్రమం చెయ్యలనుకున్నాము. దానికి కావాల్సిన నిధులు మావద్ద సమృద్ధిగా లేవు.
పరమాచార్య స్వామివారు మమ్మల్ని అనుగ్రహించాలి“ అని వేడుకున్నారు. స్వామివారు కొద్దిసేపు మౌనం వహించి, “కోవెల అమ్మవారికి. కదా? ఆమెయే చూసుకుంటుంది” అని చెప్పారు.
“మాకు ఆ నమ్మకం ఉంది కాని కావాల్సిన ధనంలో పాతికవంతు కూడా సేకరించలేకపోయాము. . . ”.
అందుకు మహాస్వామివారు “నేలపై నాలుగడుగుల ఎత్తున నిర్మాణం చెయ్యండి” అని చెప్పారు.
”మరి గోపురం, విగ్రహాలు, కుంబాభిషేకం మొదలగువాటికి ఎలా?” అని అడిగారు వారు.
”వాటన్నిటి కోసం ఒక వ్యక్తి వస్తాడులే” అన్నారు.
వారికి ఒక దేవరహస్యం అవగతమైంది. కాని “ఎప్పుడు వస్తాడు? ఎలా గుర్తుపట్టాలి?” అని పలు సందేహాలతో సంతోషంతో ప్రసాదం స్వీకరించి, అనుమానంతో, కలతతో వెళ్ళిపోయారు.
ఈ సంఘటన జరిగినది ఫెబ్రవరి 14, 1945న. మరి ఆ వ్యక్తి ఆరోజు ఎక్కడున్నాడు?
1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు కొనసాగింది. అలీన సేనలు బర్మాలోని ఐరావతి నది వద్ద జపాన్ తో తలపడుతున్నాయి. జపాన్ సైన్యం తూర్పు ఒడ్డున, అలీన సేనలు పశ్చిమ ఒడ్డున పోరాడుతున్నాయి. అలీన సేనలకు ఆ ప్రాంతము, ఆ వాతావరణము అంతగా అలవాటు లేదు. నదీజలాల దగ్గర యుద్ధం చేయగల నైపుణ్యం కలిగిన వారిని ఇక్కడకు పంపవలసిందిగా అలీన సేనలకు నాయకత్వం వహిస్తున్న మేజర్ లండనుకు అత్యవసర సమాచారం పంపారు. అటువంటి యుద్ధనైపుణ్యం కలిగిన బెటాలియన్ మడగకార్.
ఆ సైనిక దళాన్ని వెంటనే ఐరావతికి పంపారు. భారత సైనికులను ఒడ్డుకు పంపి వారు నదిలోకి దిగారు. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని జపాన్ సేనలు రాక్షసులుగా మారి ఒడ్డున ఉన్నవారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఆ ఊతకోచలో కేవలం ఒక్కరే బ్రతికి బయటపడ్డారు.
”నేను ఒక్కడినే ఎందుకు బ్రతికాను దేవుడా?”
1945 మేలో జెర్మనీ ఓటమితో యుద్ధం ముగిసింది.
ఐరావతి యుద్ధంలో బ్రతికి బయటపడ్డ మేజర్ నారాయణస్వామి, సైన్యం నుండి విరమణ పొందిన తరువాత భార్య చంద్రికతో కలిసి రాణిపెట్టైలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఒకరోజు సాయింత్రం వారు నడుడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా అసంపూర్తిగా ఉన్న మందిరాన్ని ఆరుబయట అలా ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న అమ్మవారిని చూశారు. “చూడు! నన్ను ఎలా వదిలేశారు. నేను అంతటి భయంకర యుద్ధం నుండి నిన్ను కాపాడితే, నాకు ఒక నీడ కల్పించవా” అని అమ్మవారు అడిగినట్టు అనిపించింది.
మహాస్వామివారి దర్శనానికి వచ్చిన ఆ భక్తులందరి ఆనందభాష్పాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. ”ఈయన మిలటరి మేజర్ నారాయణస్వామి, ఆవిడ ఈయన భార్య. ఆలయ నిర్మాణాన్ని వారు పూర్తిచేసి, కుంబాభిషేకం కూడా చెయ్యడానికి ముందుకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం అచ్చం స్వామివారు చెప్పినట్టుగానే”
పరమాచార్య స్వామివారి ‘కరుణాకటాక్షం’ ఆ దంపతులపై ప్రసరించి వారిని పునీతులను చేసింది.
--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 7
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

09/01/17, 5:01:15 PM: +91 92904 53473: http://sharechat.co/post/93BDaN
నేర్చుకుందాం !
ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి . రంజాన్ పండుగ వచ్చింది . మసీదు ముస్తాబు అవుతున్నది . బూజు ,దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడినుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి
గుడి అంతర్భాగం లో మకాం పెట్టాయి . ఇంతలో దసరా పండుగ వచ్చింది . ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చి లో కుదురుకున్నాయి .aక్రిస్టమస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకి మారాయి .ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి . అప్పుడే ఎదుగుతున్న చిన్ని పావురం తల్లిని అడిగింది
‘ఎవరు ఆ తన్నుకునేది ‘ అని .తల్లి పావురం చెప్పింది
‘ వాళ్ళు మనుషులు ‘ అని.
‘ ఎందుకు తన్నుకుంటున్నారు ?’
‘ మసీదుకి వెళ్ళేవాళ్ళు ముస్లింలు .
గుళ్ళకు వెళ్లేవాళ్లు హిందువులు .
చర్చికి వెళ్లేవాళ్లు క్రైస్తవులు .
ఇది హిందూ ముస్లిం ఘర్షణ ‘
చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది
‘మనం కూడా మసీదుకి , గుడికి , చర్చికి తిరిగాం కదా ! మనం ఎక్కడైనా పావురాలమే .
మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా ?’
తల్లి పావురం నవ్వింది .
“మనం వారికంటే ఎత్తు లో ఉన్నాం . విశాల విశ్వం మనది.స్వేఛ్ఛా ప్రపంచం మనది.
అన్ని జీవుల కంటె మేధావి అయిన మానవుడు కుల, ,మత,జాతి,లింగ,వర్గ గోడలు నిర్మించుకొన్నాడు.అవి పోగొట్టుకొంటేనే వారు మన ‘ఎత్తు’ కు ఎదుగుతారు.ఈ ఘర్షణలు అంతరిస్తాయి”అంటూ తూర్పు వైపుగా విహంగయానం చేస్తున్న మరో గుంపు ను తదేకంగా చూస్తూ ఉండిపోయింది.
( వాట్సాప్ లో ఎక్కువగా షేర్ అవుతున్న మెసేజ్..దీనిని రాసిన వారెవరో తెలియదు. కానీ రాసిన వారికి అభినందనలు)
By harshavardhan

No comments:
Post a Comment