14/01/17,
9:20:50 AM: +91 99499 26268: శంకరా! ఓ చిన్ని పాపడ పాలును అన్నమును
బెట్టదము తినారా బాబు! యనగా వాడు, నాకు అరటిపండు తెచ్చి పెట్టినచో
తిందుననును. అపుడు తల్లితండ్రులు ఆ అరటిపండు కూడా తెచ్చి ఆ పాపనికి
ఆదరవచనములతో ఆప్యాయతతో తినిపింపరా? అనగా, నీవు నాకు తండ్రివి. నేను
అజ్ఞానినైన పసిబాలుడను. నీవు నాకిచ్చిన ఇహాభోగములకు తృప్తి పడక, పరమమోక్షము
నిమ్మని పేచీ పెట్టుచున్నానుగదా! తండ్రివి నీవు నీవు వాత్సల్యముతో నా
ముద్దు చెల్లించి మోక్షపదమును నాకిచ్చివేయరాదా యని భావము.
==================
శంకరా! ఈ ప్రాణులవి అసలే అర్ధనిమేషముండు బ్రతుకులు. వానిలో కలల నియు, శకునాలనుచు, దుష్ట గ్రహాకూటములనియు, అరచేతిలో జోస్యములనియు, రోగాలనుచు,కీడులనుచు భూతప్రేతాలనుచు ఎన్ని కష్టాలు కలిగించనావయ్యా! అల్పజీవనములు మావి. అందులో ఇన్ని కష్ట ములెందుకు చోప్పించితివి? మాకు సుఖపడు యోగ మీ బ్రతుకులో లేదుగనుక మోక్షమిచ్చి దానిలోనైన మాకు మాకు సౌఖ్యమిమ్మని భావము.
==================
శంకరా! ఏ మనుషుడు తన శిరస్సుమీద నీ నిర్మాల్యయమైన పూలను, నుదుటి మీద విభూతిని, మెడలో రుద్రాక్ష మాలికయు, ముక్కుచివర నీ యభిషేక జలము సుగంధమును, కడుపులో నీకు నీవెదించిన అన్నమును బెట్టుకొని యుండునో, అతడు, నీకు ప్రాణ స్నేహితుడై వెండికొండపై ఎల్లప్పుడును నీతో విహరించు చుండును గదా! ఇవన్ని దరించుచున్న నాకు కూడా ఆ భాగ్యమును ప్రసాదింపుము.
===================
ఈశ్వరా నీవు సర్వజ్ఞుడవు కావున ఎవరికెప్పుడేట్టి మర్యాదలియ్యవలెనో గ్రహించి వారికట్లు ఇచ్చెదవు. అట్లు చేయుటచే నీ భార్యయైన ఆది పరాంబికాయు, నీ కొడుకులైన గణపతికుమారుస్వాములును, నీ మిత్రులైన కుబేరాదు లును, నీ యాప్తులు ఐనా కేశ వాదులును నీ కన్ని సౌకర్యములను ఐశ్వర్యములను సమకూర్చుచుందురు. వానినన్నిటిని నీవు సుముఖంగా ననుభవించుచు కూర్చుందువు. మరి నీ భక్తులమాట యేమి? వారు నీ వేదో ఎరగబెట్టుదువని ఎదురు చూచుచుందురు. అట్లు వారికి కూడానియ్యక నీ సంపదలను ( మహాత్మ్యములను) ఎవరికోసమని దాచబెట్టదలచినావో చెప్పుము.

No comments:
Post a Comment