13/01/17,
11:17:49 PM: +91 93964 44500: ఆప్తవాక్యం: ’లేడికి కాళ్లు లేక
చిక్కలేదు...కానీ కాలం రాక చిక్కింది’ అని సామెత. లేడి చాలా వేగంగా
పరిగెత్తగలదు. కానీ కురంగన్యాయం అని ఒక న్యాయాన్ని చెబుతారు. దానిని
పట్టుకోవడానికి వేటగాడు ఒక ప్రత్యేకమైన వాద్యాన్ని వాడతాడు. ఆ ధ్వనికి ఆ
సంగీతానికి ఆకర్షింపపడ్డ లేడి ఆ వేటగాడి వద్దకు వెళ్లి వింటూ వింటూ
నిలబడిపోతుంది. అదనుచూసుకుని ఆ వేటగాడి దాన్ని కట్టేస్తాడు.. మనలోనూ ఈ
లేడివంటి స్వభావం ఉంటుంది.. నమో వంచతే పరివంచతే - వంచకులు ఆషాడభూతులు మనలను
మనం కష్టపడి నిర్మించుకున్న జీవితాన్ని వేటాడి మనలను బందీలను చేయడంకోసం
మనవద్దకు చేరి మంచిమాటల వాద్యాలను మోగిస్తారు. మనం నమ్మి ఆ విధంగా
మంచిమాటలభ్రమ అనే వల పన్నిన వేటగాని మోసగాని చేతిలో పడి మన జీవితాన్ని
పోగొట్టుకుంటాము. ఈ విధంగా మోసపోయిన మనుషులు కోకొల్లలు!
అయితే ఇందులో మన పాఠం ఏమిటి? వ్యక్తులను నమ్మచ్చా నమ్మగూడదా?! అని మీరు నన్ను అడిగితే నమ్మమనే చెబుతాను.. అవును నమ్మండి... ఎందుకంటే నమ్మడం మీ తప్పుగాదు... మీ నమ్మకంలోనే మీ కర్మ పరిపక్వత. సంత్ కబీర్ అంటాడు ’కబీర్ ఆప్ ఠగియే ఔర్ న ఠగియె కోయి ఆప్ ఠగెతో సుఖ్ ఉప్ జె ఔర్ ఠగె తొ దుఃఖ్ హోయి’... కబీర్ నీవు మోసపో కానీ ఇంకొకడిని మోసం చెయ్యకు. నీవు మోసపోతే సుఖం ఉంటుంది ఎదుటివాడిని మోసం చేస్తే దుఃఖం కలుగుతుంది. ఎందుకని? ఆలోచించండి... మనం నమ్మాము అంటే మనలో ఇంకా ’విశ్వాసం’ అనే గొప్ప దైవీ సంపత్తి ఉన్నది.. దైవీ సంపత్తి మోక్షాన్ని చేర్చుతుంది... మనం ఒక ఊరినుండి ఇంకో ఊరు ప్రయాణిస్తున్నప్పుడు మనం సరైన దారిలో వెళుతున్నామో లేదో మనకు ఎలా తెలుస్తుంది?! మైలురాయి మీద రాసుంటుంది.. ఫలానా ఊరుకి ఇంకా ఇంత దూరం అని.. అదేవిధంగా మోక్షమార్గంలో శ్రద్ధ, విశ్వాసం, సహనం, తితిక్ష, సమాధానం వంటివి మైలురాళ్లు... మీలో ఎదుటి మనిషిపట్ల విశ్వాసం ఉన్నది అంటే మీరు మోక్షపుదారిలో ప్రయాణిస్తున్నారన్నమాట! అదే మీలో కుట్ర కుతంత్రం మోసపూరిత దృక్పధం, కామం, క్రోధం, లోభం వంటి ఆలోచనలు ఉంటే మీరు నరకపుదారిలో ప్రయాణిస్తున్నారన్నమాట! మోక్షపధం సుఖాన్నిస్తుంది, నరకపధం దుఃఖాన్నిస్తుంది... ఇదీ కబీర్ అంతరంగం.
కాబట్టి మీరు ఎదుటివ్యక్తిని నమ్మండి... ఆ నడవడిలో మీరు మోసపోతే ’లేడికి కాళ్లులేక గాదు చిక్కింది కాలం రాక చిక్కింది’ అని అనుకోండి... మోసగాళ్లు రాజ్యంలో తిరుగుతున్నారంటే అది రాజు అసమర్ధత! అటువంటి మోసగాళ్లు ఉన్న రాజ్యాన్ని ఏలుతున్న రాజుదే ఆ పాపం అంతా... కాబట్టి ఎవర్నీ నమ్మగూడదు అని అనుకుంటూ మీ ఆత్మశాంతికి మీరు దూరం కాకండి...
మీవలె మంచివ్యక్తులు నిష్కల్మషంగా నిలిచి నడిచే వ్యక్తులు ఉంటారు... అటువంటివారిని వెదికి వారి సాంగత్యానికి దగ్గరగా జరగండి. అదే సత్సంగము.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలబుద్ధిః నిశ్చలబుద్దే జీవన్ముక్తిః
భజ గోవిందం... భజ గోవిందం...
ప్రేమతో కాంతితో, మీ శ్రేయోభిలాషి ధర్మప్రియ మాధవ తురుమెళ్ల

No comments:
Post a Comment