*Spiritual Seekers 🙏*
*రెండు వాక్యాల వేదాంతం.....*
త్రిపుటిలో నుండి, ద్విపుటిలో నుండి, బ్రహ్మ నిష్ఠ నుండి పరబ్రహ్మ నిర్ణయానికి మేల్కొల్పుతారు. అక్కడ చేయడానికి సాధన ఏమీ లేదు. కేవలం మేల్కొల్పు ద్వారా నీకా నిర్ణయాన్ని తెలియచేస్తారు. తురీయాతీతంలోకి మేలుకోగానే తురీయం లేనిదైపోయింది.
ఈ రకంగా 'స్వస్వామి సంబంధతః' ఎందుకు పుట్టిందయ్యా.. అంటే...
'శిష్యాచార్యతయాతథైవ పితృపుత్రాద్యాత్మ్రనాభేదత'. 'అభేదతః' గురుశిష్యుల ఐక్యతా సిద్ధి జరిగింది...
పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగానే ఏ స్వామినైతే ఆశ్రయించావో ఆ స్వామితో నీకు అభేదం వచ్చింది. అట్టి ఐక్యతాసిద్ధి చేత మాత్రమే పొందదగినటువంటి, గొప్పదైనటువంటి, శాశ్వతమైనటువంటి, మార్పు లేనటువంటిది ఆ పరబ్రహ్మ నిర్ణయం.
అట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని అలాగే పొందాలి.. 'ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు' ఇక. సాధనలన్నీ బ్రహ్మనిష్ఠ కంటే క్రిందే. 'సాధనలందు మరిగితే రాకు' అనే కందార్థం ఒకటుంది.
ఏ సాధనైనా నీకు చెయ్యాలని తోస్తే అయ్యో ఈ సాధన నేను చెయ్యలేదని తోస్తే ఎక్కడికి పోతావు.. మరల బ్రహ్మ నిష్ఠలోకి, మరల ఆత్మ నిష్ఠలోకి, మరలా జీవుడిగా వ్యవహరిస్తావు. మరల త్రిపుటిలో వ్యవహరిస్తావు. లేక ద్విపుటి అనేటటు వంటి పులినోట పడతావు.
కాబట్టి ఆ ఎరుక అనేటటు వంటి పులినోట పడమాక. "శిష్యాచార్య తయా తథైవ పితృ పుత్రా ద్యాత్మనాభేదతః". నాకూ మహానుభావు డైనటువంటి దేశికేంద్రుడికీ ఎట్టి భేదమూ లేదు.
'అభేదతః' కాలాతీతులైన దేశికేంద్రులయందు, నాకు ఐక్యతా సిద్ధి ప్రసాదించినటువంటి మహనీయుడి యందు నేను లేకుండా పోయాను. నేను లేనివాడను అని తనకు తాను ఎరిగి, తనని తాను తెలుసుకున్నవాడై తనను తాను పోగొట్టుకున్నాడు.
ఇంతేనయా... వేదాంతం అంతా రెండు వాక్యాలు.
"విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః"
"శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మ నా భేదతః"...
ఈ అభేద స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరావో, నీవు లేకుండా వున్నటువంటి స్థితికి ఎప్పుడైతే చేరావో, సర్వకాల సర్వత్రా, సర్వే సర్వత్రా ఉన్నది ఒక్క గురువు మాత్రమే. ఉన్నది పరబ్రహ్మమే, నేను లేనివాడను.
ఈ స్థితికి ఎప్పుడైతే చేరావో ఇప్పుడేముందటా.. మూడవ పాదంలో ఏం చెప్పాడు..
"స్వప్నే జాగృతి వాయ ఏష పురుషః"...
స్వప్నంలో వాడు ఎలా మాట్లాడుతున్నాడు.. సత్యమేనా వాడు మాట్లాడేది.. ఎప్పుడైనా కలలో మాట్లాడావా.. చిన్న పిల్లలు కలవరిస్తారా లేదా.. మనం కూడా కలవరిస్తాం. ఎప్పుడు.. ఆ బలమైన జ్ఞాపకం చేత ప్రేరేపించబడినప్పుడు...
By Surendra pss

No comments:
Post a Comment