Sunday, November 17, 2019

*ధర్మ సందేహాలు ~ 33*

*నవ విధ భక్తి మార్గాలు*

*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం*
*అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం*

*నవవిధ భక్తి మార్గాలలో  మొదటిది ~ శ్రవణం*

         *దీనికి ఉదాహరణ కు  పరిక్షిత్తు మహారాజు ను చెప్పుకోవాలి.*
 *తను మునికుమారుని శాపం వలన ఎలాగైన మరణిస్తానని తెలిసి* *భాగవతపారాయణ శ్రవణం వలన  ముక్తి ని పొందారు.*

*రెండవది  ~ కీర్తనం*:

       *నిత్యం స్వామిని కీర్తిస్తూ శ్రీమత్ భాగవతాన్ని భోద చేసి, ముక్తిని పొందినవారు శుక బ్రహ్మ*

*మూడవది  ~ స్మరణం*

           *రాక్షస కులం లో పుట్టినా, నారద మహర్షి ఉపదేశం వలన మహావిష్ణువు గొప్పతనం తెలుసుకొని నిరంతరం స్మరిస్తూ ముక్తిని పొందాడు ప్రహ్లాదుడు*

*నాలుగవది ~ *పాదసేవనం*

          *పాలకడలిని మధించినప్పుడు స్వామి కోసమే జన్మించిన*
 *శ్రీ మహాలక్ష్మి నిరంతరం,స్వామి పాదల వద్దే తన స్థానం అని తెలుసుకొని స్వామి హృదయం లో కొలువైంది.*

*ఐదవది ~ అర్చనం*

           *పృధుచక్రవర్తి నిత్యం త్రికాలాలు స్వామి అర్చించి స్వామిలో ఐక్యం చెందారు*

*ఆరవది  ~ నమస్కారం*

            *అకౄరుడు నిత్యం స్వామిని అర్చిస్తూ నిరంతరం తన నమస్కారముద్ర  వలన ముక్తిని పొందాడు.*

*ఏడవది ~ దాస్యం*

         *నిరంతరం తనమనసులో శ్రీ రామ నామం తప్ప మరియొకటి ఎరగని హనుమంతుడు దాస్యంచేస్తూ "చిరంజీవి" గా మిగిలిపోయాడు.*

*ఎనిమిదవది ~ ఆత్మనివేదన*

             *వచ్చినది, అసురాంతకుడని, తనకు మరణం తప్పదని, మూడడుగుల నేలకోసం వచ్చిన వామనుడుకి తన సర్వవస్వం దానం క్రింద ధారపోసిన బలిచక్రవర్తి ఆత్మనివేదనగా తనకు తాను సమర్పించుకున్నాడు. ఆ తర్వాత భవిష్యత్తు తరాలకు ఇంద్రపదవి చేపట్టానికి సిధ్ధంగా వున్నాడు.*

*తొమిదవది ~ సఖ్యత*

          *అర్జునుడు నిరంతరం శ్రీకృష్ణునితో సఖ్యతకలిగి వుండటంతో* *మహాభారతయుధ్ధంలో విజయం సాధించటం తెలిసినదే.*

          *ఈ నవవిధభక్తి మార్గాలను మనం ఆచరిద్దాం ~ ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం.*

(Forwarded as received)

No comments:

Post a Comment