ఆత్మ.....
''అది (ఆత్మ) కదులుతుంది (కాని) కదలదు.. అది దూరస్థం కాని మన దగ్గరే, లోపలే, ఉంటుంది.''...
ఈశావాస్య ఉపనిషత్తు అలా అంటుంది...
'తదేజతి తన్నైజతి తద్దూరే తద్వన్తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||
ఇక్కడ దేశమూ, కాలమూ కలిగించే మానసికావస్థల గురించే కాక వాటి ప్రభావం నుండి విముక్తులం కావాలన్న ఆసక్తినీ కలిగిస్తుంది. ఈ ఉపనిషత్తులోనే దీని తర్వాత వచ్చే మంత్రాలలో, దేశకాలాలు ఆత్మస్థితాలే అని గమనించమని యుంటుంది. ఇది గ్రాహ్యమైతే, ఇక కోపం లేదు. మోహం లేదు, దుఃఖం లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే, మానసిక సంక్షోభం లేదు.
ఆ తరువాత ఇంకొక మంత్రం.. ఆత్మ విశ్వవ్యాప్తమవటం వల్ల దూరాన్ని అధిగమించిందనీ, ఆ పిదప ఆత్మ కాలాతీతమనీ కూడా చెప్తుంది.
మొత్తం మీద ఉపనిషత్తులు.. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రతిపాదించే దృశ్యమాన జగత్తు దేశ కాల సంయోగ జన్యమనే సత్యాన్ని ఎప్పుడో చెప్పింది. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం విషయంలో ఇది ఒక సిద్ధాంతము మాత్రమే. ఉపనిషత్తులు ఇది స్వానుభవంలో అనుభవించ వలసిన అనుభూతి అని అంటాయి. వేదాలకు శిరోభూషణాలైన ఉపనిషత్తుల సందేశమిదే...
Forwarded by Surendra pss
No comments:
Post a Comment