శివ వైభవమ్
కీకారణ్యం ! ఆకాశపు జాడ కనబడని, వెలుగురేఖ కూడా చొరబడలేని ప్రదేశం.
ఎత్తైన కొండల మథ్య చెట్లన్ని జడలు కట్టి కఠోర తపస్సమాథిలో ఉన్న యోగుల్లా ఉన్నాయి.
వాటి మథ్యలో శిథిలావస్థలో ఉన్న శివాలయం. గర్భగుడిలో తనకేమి పట్టని, తనని పట్టించుకోని నిర్వికారంగా “జగత్పిత లింగాకారంలో !
పానపట్టం చుట్టు చీమల పుట్టలు తాము తెచ్చుకున్న పదార్థాన్ని నైవేద్యం పెడుతున్నాయి.
పై కప్పు లేకపోవడం వల్ల వృక్షజాతుల కొమ్మలమీద నుంచి జాలువారుతున్న వర్షపు థారాపాత్ర లా అభిషేకం చేస్తున్నాయి.
చెట్లమీద దాచుకున్న తేనటీగలు మధురాభిషేకం చేస్తున్నాయి పైనుంచే.
“ ఆదిత్య కిరణం” దీపమైంది.
రేయి శశికిరణానికి పోటీగా "మిణుగురు " శివగురువుకి చిరుదీపమైంది.
అమావాస్యకి కూడా నీకు నేనున్నాను సుమా శివా! అంటూ! వాయువు మోసుకొచ్చే పుష్పజాతులు ఆయన శిరస్సుమీద స్థిరంగా
తలపక్కకి పెట్టినా చూపుమాత్రం తండ్రిమీదే కదా నందీశ్వరునికి ఆయనని ధ్యానిస్తూ !
ప్రాంగణంలో ని ఒరిగిన గంటను మ్రోగిస్తున్న శుకపికాలు. తీక్షణమైన వేడికి ఒరిపిడికి కాలిన చందనవృక్షాల సుగంథం థూపమైతే, ప్రజ్వలించిన దావానలం త్రినేత్రునికి హారతవ్వగా ఆయన ఎక్కడుంటే ఎలాఉంటే ఆయనకి జరుగుబాటుకి, వైభవానికి లోటేలా?
చాగంటి ప్రసాద్
9000206163
No comments:
Post a Comment