Sunday, November 3, 2019

ధర్మ సందేహాలు

*ఆకాశ దీప ప్రాముఖ్యం,  వాటి పరమార్థం వివరణ*

         ధర్మసింధు ప్రకారము కార్తీకమాసములో ఆకాశదీప ప్రజ్వలనము, దానము
చెయ్యాలి. సూర్యాస్తసమయములో  ఇంటి సమీపములో మేడి కర్రను చెయ్యెత్తు పొడవుగల దానిని పాతి, దానిపైన అష్టాగళాకారములో దీప యంత్రాన్ని నిర్మించాలి. దాని మధ్యలో ప్రధాన దీపమును, దాని చుట్టూ ఎనిమిది దీపాలను
వెలిగించి, భక్తితో ఈ మంత్రాన్ని పఠంచాలి:

*దామోదరాయ నభసి తులాయాందోళయా సహ*
*ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే!*

           అనంతుడు సృష్టికర్త అగు శ్రీవిష్ణువునకు అంతరరిక్షములో ఉయ్యలూగే దీపమిచ్చితిని అని దీని అర్థము. ఇలా కార్తీకమాసములో చేస్తే అన్ని రోజులు ఆకాశదీపమిస్తే మహా సంపద కలుగుతుంది‌.

*ఏకత సర్వ దానాని దీపదానం తథైకతః*
*కార్తీక దీప దానస్య కలాం నార్హంతి షోడశీం*

       అంటే ~ *అన్ని దానములు కలసి దీపదానానికి సమానము కావు.* *కార్తీక మాసములో దీప దానానికి దీటైన దానము లేదు.  ఈ మాసములో శివాలయాలలోనూ, విష్ణ్వాలయాలలోనూ ఆకాశదీపాలనెత్తడము ఆచారము. దీపాన్ని పెడితే జ్యీతి స్వరూపుడైన దైవాన్ని కొలిచినట్లే! అది* *పరమార్థము. కనుక కార్తీకమాసంలో కార్తీక దీపాలను వెలిగించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులవుదాము!*

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~

No comments:

Post a Comment