Monday, November 4, 2019

 ఆదివారం శివాభిషేకం రుగ్మతల నుంచి బయటపెడుతుంది. అనారోగ్య సమస్యలు పోతాయి.
సోమవారం –మానసిక సమస్యలు తీరి సంపదలు రావడం జరుగుతుంది.
వారముల ప్రశస్తి తెలుసుకొని కార్తీకమాసంలో ఆరాధన చేసినట్లయితే చాలా విశేషము.

పౌర్ణమి కుమార దర్శనం అని చెప్పబడుతుంది. ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషం.

కార్తిక శుద్ధ సప్తమి –సూర్యారాధన చేసినట్లయితే ఆరోగ్యవంతుడౌతాడు.

కార్తిక మాసంలో ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు అత్యంత ముఖ్యమైనవి.
భీష్మపంచకం అంటే పట్టుదలతో చేయవలసిన వ్రతములు.
ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి పారణ చేయడం మంచిది.
ఈ అయిదు రోజులూ శ్రద్ధగా చేసినట్లయితే కార్తికమాసం అంతా ఆరాధన చేసిన ఫలం లభిస్తుంది.

కార్తిక మాసం బృందావన మాసంగా చెప్పబడుతుంది. కృష్ణారాధనకు అత్యంత ప్రధానమైనది.
బృందావనం వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కోటనే బృందావనంగా భావించి కృష్ణారాధన చేయాలి.

బృందావనంలో భక్తి శుద్ధ యమునా నదిలా నేటికీ ప్రవహిస్తూనే ఉన్నది.
గోశాలయందు చేసే పూజలు కూడా ఈ మాసమునందు విశేషంగా చెప్పబడతాయి.

No comments:

Post a Comment