*ఈషణ త్రయం అంటే ఏమిటి?*
*దారేషణ ~ పుత్రేషణ ~ విత్తేషణ* ~~ ఈ మూడూ కలిపి ఈషణత్రయమని అంటారు.
*దారేషణ* ~~ తనకు అన్ని విధాలా నచ్చి, తాను చెప్పినట్లు నడుచుకునే భార్య కావాలనుకోవడము దారేషణ. ఇదే విధంగా తనకు రాబోయే భార్య కూడా ఆశిస్తుందనే ఇంగితము మగవాళ్ళకు కూడా ఉండాలి. మంచి భర్త/భార్య దొరికితే జీవితములో 50% విజయాన్ని సాధించినట్లే!
*పుత్రేషణ* ~~ వివాహమైన తరువాత వంశం, పేరు నిలబెట్టే పుత్రుడు కలగాలనే తపన; పున్నామ నరకము నుండీ తప్పించే వాడే కదా పుత్రుడంటే!
*విత్తేషణ*~~ ఇది అన్నింటికన్నా ప్రధానమైనది. *ధనమూలం ఇదం జగత్*
ధనాన్ని సంపాదిస్తే కదా అధికారము, పదవి, హొదా, కీర్తికాంత ~ అన్నీ కరతలామలకం అవుతాయి.
~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~
No comments:
Post a Comment