Wednesday, November 6, 2019

హైందవ కుటుంబ ఆచారాలు

ఆదర్శ హిందూ కుటుంబం కొన్ని నియామాలు తప్పక పాటించాలి. అవి..
1. ఇంటి పైన భగవధ్వజమైన కాషాయధ్వజాన్ని ఎగరవేయడం.

2. ఇంట్లో తులసి మొక్కను బృదావనంలో నాటి పూజించడం.

3. ఇంటి ముఖభాగంపై ఓంకారం, స్వస్తికము, శంకు చక్రాలాంటి చిహ్నాలను పెట్టడం.

4. ఇంటిలోని సభ్యులందరు కలిసి కూర్చొని భోజనం చేయడం.

5. ప్రతిరోజు ఉదయం సూర్యోపాసన, ఇష్టదైవ ప్రార్థన చేయడం.

6. పశుపక్ష్యాదులకు గింజలు తినిపించడం. వృక్షాలు నాటి వాటికి నీరుపోయడం.

7. కుటుంబ సభ్యులంతా ఇంట్లో మాతృభాషను మాట్లాడటం.

8. వీలు చేసుకుని కుటుంభ సభ్యులు అందరూ కలిసి వారనికి ఒక్కసారైనా దేవాలయం సందర్శించడం.

9. దేవాలయంలో, పండుగ, పర్వదినాలల్లో, శుభాకార్యాల్లో సంప్రదాయ దుస్తులను ధరించడం.

10. పంచయజ్ణాలైన బ్రహ్మయజ్ణం, పితృయజ్ణం, దేవయజ్ణం, భూతయజ్ణం, మనుష్యయజ్ణాలను ఆచరణ చేయడం.

11. తమవిదిగా చేయల్సినవి..
గో పోషణ,గోసంరక్షణ, సమాజ సేవ, ధర్మప్రచారం, సాధుజన సత్సంగం, సంస్కృతి, సభ్యత, సంస్కారం, దేశ రక్షణ, స్త్రీ రక్షణ.

ధర్మో రక్షతి రక్షితః

సర్వేజనా సుఖినోభవంతుForwarded by PRASAD 

No comments:

Post a Comment