01/02/17, 10:56:39 PM: +91 92462 16355: అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును. ఈ పర్వతము సమస్త భోగములకు నిలయము. దీనిపై ఎన్నో గ్రుహలు యున్నవి. వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు. ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా
కైలాసము - శివుని నివాసము
అరుణాచలము - సాక్షాత్తు శివుడు
ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని కృతార్ధులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా నియమములూ లేవు. ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము.
"యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే" అని స్కాందపురాణము వర్ణించినది అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును. స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది. గిరి ప్రదక్షిణ చేసిన వారికి కోటి అశ్వమేధ యాగములు, కోటి వాజపేయ యాగములు, సమస్త తీర్థముల యందు స్నానములు చేసిన ఫలితము అనుగ్రహింపబడును. మొదటి అడుగుతో భూలోకము, రెండవ అడుగుతో అంతరిక్షము, మూడవ అడుగుతో స్వర్గలోకము అనుగ్రహింపబడును. అంతేగాదు, మొదటి అడుగుతో మానసిక పాపములు, రెండవ అడుగుతో శారీరిక పాపములు, మూడవ అడుగుతో వాచక పాపములు నశించును. ధ్యానము నందు కుదరని ఏకాగ్రత గిరి ప్రదక్షిణ వలన సంభవమగును.
సకల దేవతలు, నవగ్రహములు, బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువు గూడా సర్వకాలముల యందు గిరి ప్రదక్షిణ చేస్తూ యుండెదరు. ఉత్తరాయణ పుణ్యకాల సమయమందు (కనుమ పండుగ నాడు) మరియు కార్తీక మాస కృత్తికా దీపోత్సవ మూడవ దినమున సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే, పార్వతీ మాత మరియు తన భూతగణ సహితముగా, గిరి ప్రదక్షిణ చేస్తాడనిన ఈ ప్రదక్షిణ వైభవము వర్ణించుట ఎవరి తరము. దిక్పాలకులు మరియు నవగ్రహములు గిరి ప్రదక్షిణ చేసిన కారణముననే వారు వారివారి స్థానములు పొందిరి. పార్వతీ మాత గూడా గిరి ప్రదక్షిణ
చేసిన కారణముననే పరమేశ్వరుని వామార్ధభాగమును పొంది పార్వతీపరమేశ్వరులు "అర్ధనారీశ్వరులు" అయినారు. గిరి ప్రదక్షిణ చేయువారి పాదములు మోయుటకు దేవతల రధములు పోటీ పడును. ప్రదక్షిణ చేయు సమయమున ఎవరికైననూ గాయమై రక్తము శ్రవించినచొ దేవేంద్రుడు ధరించు మందార పుష్పముల చేత ఆ రక్తము తుడవబడును. మార్గమున రాళ్ళు తగిలి శరీరమునకు క్లేశము కలిగినచో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ మాత కుంకుమ లేపనము అలది వారి క్లేశమును తొలగించును.
భానువారము ప్రదక్షిణ చేయువారు సూర్య మండలమును బేధన చేసి శివసన్నిధి పొందెదరు. సోమవార ప్రదక్షిణము అజరామరత్వమును కలిగించును. మంగళవార ప్రదక్షిణము సార్వభౌమత్వమును ఒసగును. బుధవార ప్రదక్షిణము మహాపాండిత్యమును ప్రసాదించును. గురువార ప్రదక్షిణము సర్వులు నమస్కరించెడి
లోకగురుత్వమును కటాక్షించును. శుక్రువార ప్రదక్షిణ చేయువారికి సకల సంపదలూ కలిగి, విష్ణుపధమును
పొందదరు. శనివార ప్రదక్షిణము వలన సమస్త గ్రహ పీడలూ తొలగిపోవును. అదృశ్య రూపమున ప్రదక్షిణ చేయు
దేవతలు, గిరి ప్రదక్షిణ చేయువారి భక్తిశ్రద్ధలకు సంతసించి అడగకనే వరములు అనుగ్రహించెదరు. పౌర్ణమి, అమావాస్య మరియు ఇతర పర్వదినముల యందు చేయు గిరి ప్రదక్షిణ విశేష ఫలితములను అనుగ్రహించును.
"చిత్రం వటతరోర్మూలే వృద్ద శిష్యః గురుర్యువాః
గురోస్తూ మౌనం వ్యాఖ్యానం, శిష్యోస్తు ఛిన్న సంశయః"
వట వృక్షము నీడన ఆసీనుడై, చిన్ముద్ర పట్టి, మౌనమే వ్యాఖ్యానముగా యున్న యువకుడైన గురువు, తన వద్దకు చేరిన వృద్ధ శిష్యుల సంశయములు తీర్చుచుండెను. ఆ స్వరూపమే "శ్రీ గురుదక్షిణామూర్తి". పరమశివుని
జ్ఞానరూపమైనట్టి శ్రీ దక్షిణామూర్తిని వేదములు బహుదా ప్రస్తుతించినవి. అటువంటి దివ్య స్వరూపమైన దక్షిణామూర్తి
యే వటవృక్షము నీడన ఆసీనులై యున్నారో, ఆ వృక్షము అరుణాచలము పైనే యున్నది. ఈ గిరికి ఉత్తర దిక్కుగా యున్న ఉన్నత శిఖరముపై ఈ స్వామి ఆసీనుడై యున్నాడని పురాణవచనము. ఈ స్వామినే "అరుణగిరి యోగి" అని పేర కొలిచెదరు. గిరి ప్రదక్షిణము చేసెడి వారు, వారికి తెలియకుండానే ఈ స్వామికి కూడా ప్రదక్షిణ చేసెదరు. అందువలననే అరుణాచల గిరి ప్రదక్షిణము మహత్తరమైన జ్ఞానమును కూడా అనుగ్రహించును.
అరుణగిరి ప్రదక్షిణమునకు ప్రత్యేక సమయమంటూ లేదు. ఎప్పుడైనా ప్రదక్షిణ చేయ్యవచ్చు. స్నానము చేసి, శుభ్రమైన వస్త్రములు ధరించి, భస్మధారణ గావించి, శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయవలెను. ప్రదక్షిణ చేయు సమయమున త్వరపడి నడవక నిండు గర్భిణి వలె నెమ్మదిగా అడుగులు వేయవలెను. దేవ, ఋషి, సిద్ధ, గంధర్వ, కిన్నెర, కింపురుష, నవగ్రహ, దిక్పాలక గణములన్నియూ ప్రదక్షిణ మార్గము యొక్క కుడి వైపు ప్రదక్షిణ చేయును. కనుక వారి త్రోవకు అడ్డము రాని రీతిలో మార్గాముకు ఎడమ వైపుగా ప్రదక్షిణ చేయవలెను. అరుణగిరి యొక్క అష్టదిక్కుల యందు అష్టదిక్పాలకులు ప్రతిష్ట చేసి పూజించిన లింగములు యున్నవి. ఇవేగాక సూర్యచంద్రులు ప్రతిష్ట
చేసిన లింగములు యున్నవి. అంతేగాక ఎన్నో వందల తీర్థములు, దేవతా స్థానములు యున్నవి. గిరి ప్రదక్షిణ ఎక్కడ నుండి అయినా మొదలు పెట్టవచ్చు. కానీ ప్రదక్షిణము చేసి మొదలుపెట్టిన స్థానమునకు తిరిగి రావలెను. పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చేయవలెను. సర్వ కాలముల యందూ గిరి మనకు కుడి వైపు మాత్రమే యుండేటట్లుగా ప్రదక్షిణ చేయవలెను.
అరుణాచల గిరి ప్రదక్షిణము సాధారణముగా "శ్రీ అరుణాచలేశ్వర స్వామి" ఆలయము వద్ద నుండి ప్రారంభించుట సాంప్రదాయము. ఆలయము యొక్క తూర్పు రాజగోపురము ఎదురుగా యున్న ప్రధాన రహదారి వద్ద నుండి ప్రారంభించవచ్చును. తొలుత అరుణగిరికి సాష్టాంగ నమస్కారములు ఒసగి ప్రదక్షిణ ప్రారంభించేదము. ఆలయము వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ తొలుత దక్షిణ దిక్కుగా సాగును. ఆలయ పరిశర ప్రాంతమంతా వ్యాపార కేంద్రము గావున బహు రద్దీగా యుండును. కొంత ముందుకు సాగిన అనంతరం మార్గము కుడి ప్రక్కకు తిరుగును. ఆ మలుపు వద్ద ఎడమ ప్రక్క "ఇంద్ర లింగము" యున్నది. తూర్పు దిక్కుకు అధిపతియైన ఇంద్రుడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును పూజించిన వారికి రాజభోగములు కలుగునని ప్రతీతి. ఇంద్ర లింగమును దర్శించిన అనంతరం ప్రదక్షిణ మార్గము కుడి ప్రక్కకు తిరుగును. తిరిగిన అనంతరము గిరికి అభిముఖముగా వచ్చెదము. ఆ మార్గము నందు ముందుకు సాగగా "చెంగం రోడ్" కలియును. ఈ రహదారి ఆలయము యొక్క వెనుక భాగము నుండి వచ్చును. ఈ రహదారికి చేరిన అనంతరము ఎడమ ప్రక్కకు తిరిగి ప్రదక్షిణ కొనసాగించవలెను. అలా ముందుకు సాగగా కుడి ప్రక్కకు "అగ్ని పుష్కరిణి" దర్శనమిచ్చును. ఈ తీర్థము బహు పెద్దది మరియు విశేషమైనది. ఈ తీర్థము దాటిన అనంతరము కుడి ప్రక్కగా "అగ్ని లింగము" యున్నది. ఈ లింగమును దర్శనము చేయుటకు ప్రదక్షిణ మార్గము నుండి విడివడి కొంత లోనికి వెళ్ళవలెను. అష్ట లింగములలో ప్రదక్షిణ మార్గమునకు కుడి ప్రక్క యుండెడి లింగము ఇదియొక్కటియే. ఆగ్నేయ దిక్కునకు అధిపతి అయిన అగ్ని దేవునిచే ప్రతిష్ట చేయబడిన ఈ లింగమును పూజించిన వారికి తేజోవృద్ధి
కలుగును.
అగ్ని లింగము దాటిన అనంతరము గిరి యొక్క దక్షిణ పార్శ్వమునకు చెరుకొనెదము. కొంత ముందుకు సాగగా కుడి ప్రక్కగా "శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమము" గలదు. ఈ ఆశ్రమము దాటిన అనంతరము "శ్రీ దక్షిణామూర్తి ఆలయము" యున్నది. దక్షిణాభి ముఖుడై యుండు ఈ స్వామి దర్శనం పరమమంగళప్రదము. ఈ ఆలయము దాటిన అనంతరము కుడి ప్రక్క "శ్రీ రమణ మహర్షి ఆశ్రమము" గలదు. (శ్రీ రమణాశ్రమమును మరియు శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమమును అనంతరము విస్తారముగా వర్ణించుకొనేదము). శ్రీ దక్షిణామూర్తి ఆలయమునకు ఎదురుగా "శ్రీ మహాకాళి" అమ్మవారి ఆలయము గలదు. శ్రీ రమణాశ్రమము దాటిన అనంతరము ఎడమ ప్రక్కగా ఒక చిన్న వినాయకుని మందిరము గలదు. "మానాకుల గణపతి" గా ప్రసిద్ధుడైన ఈ స్వామి మహా మహిమాన్వితుడు. ఈ స్వామిని దర్శించి ప్రదక్షిణ మార్గము నందు ముందుకు సాగగా కుడి ప్రక్క చిన్న పిల్లల ఆటలకు నిర్మించిన యొక ఉద్యానవనము యున్నది. ఈ ఉద్యానవనమునకు ఆనుకొని యున్న రహదారిపై గిరి పాదము వద్ద "ద్రౌపదమ్మ గుడి" అను శివాలయము గలదు. వనవాస సమయమున పంచపాండవుల సహితముగా ద్రౌపదీ దేవి ఇక్కడే శివారాధన చేసెనని ప్రతీతి. ఉద్యానవనము దాటిన అనంతరము కొంత దూరమున
కుడి ప్రక్కగా "సింహ తీర్థము" దర్శనమిచ్చును.
సింహ తీర్థము దాటి కొంత దూరము ప్రదక్షిణ చేసిన అనంతరము "యమ లింగము" దర్శనమిచ్చును. శ్రీ సూర్యనారాయణ స్వామి పుత్రుడు, దక్షిణ దిక్కునకు అధిపతి అయిన యముడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును పూజించిన వారికి అపమృత్యు దోషము నివారణ జరుగను. మృత్యు భయము గూడా ఈ స్వామి ఆరాధన వలన తొలగిపోవును. ఇక్కడ యున్న యమ తీర్థము బహు సుందరముగా యుండును. యమ లింగము దాటిన అనంతరము ప్రదక్షిణ మార్గము ఒక కూడలి వద్ద మరల కుడి ప్రక్కకు తిరుగును. ఇక్కడ కొంత పరాకు వహించుట అవసరము. ఈ కూడలి వద్ద ఎడమ వైపు గల రహదారి చెంగం పట్టణమునకు వెళ్ళును. గిరి ప్రదక్షిణ కొరకు కుడి ప్రక్కకు తిరుగు మార్గము నందు సాగవలెను. ఈ కూడలి వద్ద ప్రదక్షిణ మార్గమున మరియొక వినాయకుని ఆలయము యున్నది. "వాలమూరి గణపతి" గా ప్రసిద్ధుడైన ఈ స్వామి యొక్క ఆరాధన మోక్ష ప్రదాయకమని ప్రతీతి.
"వాలమూరి గణపతి" మందిరము నుండి ప్రదక్షిణ మార్గమున చాలా దూరము వరకు పాదచారుల బాట యున్నది. ఇక్కడ నుండి పరిసరములు బహు ప్రశాంతముగా యుండును. కొంత దూరము ప్రదక్షిణ మార్గమున సాగిన అనంతరము కుడి ప్రక్కగా సోమ తీర్థము, ఈ తీర్థము ప్రక్కగా తెల్లటి నందీశ్వరుడు గల "జ్యోతి వినాయకుని" ఆలయము దర్శనమిచ్చును. ఈ ఆలయము దాటి కొంత దూరము వెళ్ళిన అనంతరము మార్గము కుడి వైపునకు తిరుగును. ఈ మలుపు వద్ద ఎడమ ప్రక్క కాస్త లోపలగా "నైరుతి లింగము" గలదు. నైరుతి దిక్కునకు అధిపతి అయిన నిరుత్తుడు అను అసురుడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును పూజించిన వారికి అద్భుతమైన మనఃప్రశాంతత కలుగును. అంతే గాక ఈ స్థానము ధ్యాన, తపస్సులకు బహు విశేషము. నైరుతి లింగము దాటి కొంత దూరము వెళ్ళగా "నంది ముఖ దర్శన" స్థానమున్నది. ఈ స్థానము నుండి దర్శించితే అరుణగిరి యొక్క కుడి భాగము వాలుగా "నంది ముఖము" దర్శనమిచ్చును. ఈ స్థానము దాటిన అనంతరము కొంత దూరమున "శ్రీ అణ్ణామలైయ్యర్ - శ్రీ ఉణ్ణామలైఅమ్మన్" ఆలయములు దర్శనమిచ్చును. ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనముగా జరుగును. ఈ ఆలయములు సమూహము దాటిన అనంతరము కొంత దూరమున శ్రీ
ఆంజనేయస్వామి ఆలయము, శ్రీ పళని సుబ్రహ్మణ్యుని ఆలయము మరియు శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయములు దర్శనమిచ్చును. శ్రీ పళని సుబ్రహ్మణ్యుని ఆలయము ఎదురుగా "ప్రతిధ్వని మండపము" యున్నది. ఈ మండపము వద్ద నుండి ఎలుగెత్తి "అరుణాచల శివా" అని పిలిచినచో "ఆ.." అని సమాధానము వచ్చును. ఇలా అరుణాచలేశ్వరుడే సమాధానమిచ్చు సమయమున వళ్ళు గగుర్పొడుచును. ఆ స్వామి గిరి రూపముననే ఉన్నారని అనుటకు ఇది ప్రత్యక్ష నిదర్శనము.
మరికొంత దూరము ప్రదక్షిణ చేసిన అనంతరము ఎడమ ప్రక్క "శ్రీ గౌతమ మహర్షి" ఆశ్రమము మరియు శ్రీ గౌతముల వారి మందిరము కనిపించును. మనము ఇంతటి మహోన్నత క్షేత్ర వైభవమును అనుభవించి తరించుటకు కారణమైన శ్రీ గౌతమ మహర్షికి ఇచ్చట నమస్కరించుట మన కనీస ధర్మము. శ్రీ గౌతమ మహర్షి ఆశ్రమము దాటిన అనంతరము "సూర్య లింగము" యున్నది. అరుణాద్రి పైనుండి ప్రయాణించిన కారణమున తేజస్సు కోల్పోయిన సూర్య భగవానుడు, అరుణాచల క్షేత్రమున శివారాధన చేసి, గిరి ప్రదక్షిణ గావించి, లింగ ప్రతిష్ట చేసి మరల తేజస్సును పొంది గగనమున హద్దు లేకుండా విహరించు శక్తిని అరుణాచల శివుని వరముగా పొందెను. సూర్య లింగము దాటిన అనంతరము "వరుణ లింగము" గలదు. పశ్చిమ దిక్కునకు అధిపతి అయిన వరుణుడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును పూజించిన వారికి సంపూర్ణ శరీరారొగ్యము కలుగును. వరుణ లింగము దాటిన అనంతరము "ఆది అణ్ణామలై" గ్రామము వచ్చును. ఈ గ్రామము నందే అత్యంత పావనమైన మరియు ప్రసిద్ధమైన "శ్రీ ఆది అరుణాచలేశ్వరుని" ఆలయము గలదు. (ఈ ఆలయము గూర్చి విస్తారముగా అనంతరము తెలుసుకొనెదము). ప్రదక్షిణ మార్గమున "శ్రీ మాణిక్యవాచకుల" మందిరము గలదు. సాక్షాత్తు "శ్రీ చిదంబర నటరాజ" స్వామి ఎవరి కీర్తనలను ఒక రాత్రంతా కూర్చొని "తిరువాచకం" గా వ్రాసారో ఆ మహానుభావుడే శ్రీ మాణిక్యవాచకులు. శ్రీ మాణిక్యవాచకులు ఈ మందిరము వద్దనే నివాసముండి శ్రీ అరుణాచలేశ్వరుని యుద్దేశించి "తిరువెంబావై" గానము చేసిరి.
ప్రదక్షిణ మార్గమున ఆది అణ్ణామలై గ్రామము దాటిన అనంతరము కొంత దూరమున "వాయు లింగము" యున్నది. వాయువ్య దిక్కునకు అధిపతి అయిన వాయుదేవుడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును పూజించిన వారికి చిత్తశుద్ధి మరియు వంశవృద్ధి కలుగును. వాయులింగము దాటిన అనంతరము ప్రదక్షిణ మార్గము కంజి పట్టణము
నుండి వచ్చు రహదారితో కలియును. ఈ కూడలి వద్ద కుడి ప్రక్కకు తిరుగవలెను. ఈ మలుపు వద్దనే ఒకప్పుడు చంద్ర లింగము యుండెడిది. కానీ ప్రస్తుతము చంద్ర స్థానము లుప్తమైనది. కొంత కాలము క్రితము నిర్మించిన ఒక శివాలయము "చంద్ర లింగము" గా చలామణి అవుతున్నది. ఈ స్థానము నుండి కొంత ముందుకు సాగగా శ్రీ అగస్త్య మహర్షి ఆశ్రమము మరియు శ్రీ సప్త మాతృకల ఆలయము దర్శనమిచ్చును. ఇవి దాటి కొంత దూరము ప్రదక్షిణ చేసిన అనంతరము ఎడమ ప్రక్కగా "కుబేర లింగము" దర్శనమిచ్చును. ఉత్తర దిక్కునకు అధిపతి అయిన కుబేరుడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును పూజించిన వారికి సకల ఐశ్వర్యములు కటాక్షింపబడును. కుబేర లింగము దాటిన అనంతరము కుడి ప్రక్కగా "పంచ ముఖ దర్శన" స్థానమున్నది. "పంచాశ్యుడు" అయిన పరమశివునకు అయిదు ముఖములని వేదవచనము. అవే - తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ మరియు ఈశాన. ఈ అయిదు ముఖములు అయిదు శిఖరములుగా కనిపించు స్థానమే "పంచ ముఖ దర్శనము". దీనికి ప్రతీకగా ఇక్కడ అయిదు లింగములు ప్రతిష్ట చేయబడి యున్నవి. పంచ ముఖ దర్శనము దాటిన కొంత దూరము తరువాత అరుణాచల పట్టణమునందు ప్రవేశించెదము.
పట్టణ ప్రవేశము చేసిన అనంతరము ప్రదక్షిణ మార్గము వెల్లూరు నుండి వచ్చు రహదారితో కలియును. ఈ కూడలి వద్ద బహు పరాకుగా యుండవలెను. ఈ కూడలి వద్ద కుడి ప్రక్క ఒక చిన్న రహదారి గిరి వైపునకు వెళ్ళును. ఈ రహదారి యందు వెళ్ళగా "శ్రీ పచ్చైయమ్మన్" ఆలయము దర్శించవచ్చును. కూడలి దాటిన అనంతరము ఎడమ ప్రక్కగా ఒక చిన్న రహదారి యున్నది. ప్రదక్షిణము ఈ రహదారి గుండా సాగించవలెను. అలా కొంత దూరము ప్రదక్షిణ చేసిన తరువాత "ఈశాన్య లింగము" దర్శనమిచ్చును. ఈశాన్య దిక్కునకు అధిపతి అయిన ఈశానుడు ప్రతిష్ట చేసిన ఈ లింగమును నిష్టతో పూజించిన వారికి మోక్షము కలుగును. ఈ ఆలయము నందు నందీశ్వరుడు శివుని వైపు చూడక ప్రక్కకు చూచుచుండును. అష్ట లింగములలొ అత్యంత మహిమాన్వితమైన స్థానము ఇదియే.
ఈశాన్య లింగమునకు ఎదురుగా "శ్రీ జ్ఞానదేసికరుల" స్థానమున్నది. పరమ శివభక్తులైన శ్రీ జ్ఞానదేసికార్లు తపము చేయు సమయమున శివపార్వతులు పెద్దపులులై వారికి కావలి కాసెడివారని ప్రతీతి. ఇక్కడే శ్రీ దేసికర్ల జీవ సమాధి యున్నది. ఈ స్థానము దాటి మరింత ముందుకు సాగగా ఎడమ ప్రక్క "బస్టాండ్" కనిపించును. బస్టాండ్ దాటిన అనంతరము ఒక పెద్ద కూడలి వచ్చును. ఈ కూడలి వద్ద కుడి ప్రక్కకు ఉన్న రహదారి యందు ప్రదక్షిణ సాగించవలెను. ఈ కూడలి దాటిన అనంతరము కొంత దూరమున కుడి ప్రక్కగా "శ్రీ దుర్గాదేవి" ఆలయము దర్శనమిచ్చును. ఈ ఆలయము నందే అత్యంత మహిమాన్వితమైన "ఖడ్గ తీర్థము" యున్నది. ఈ ఆలయము దాటి ముందుకు సాగగా మరల "శ్రీ అరుణాచలేశ్వరుని" ఆలయము వద్దకు చేరుకోని ప్రదక్షిణ పూర్తి చేసెదము.
"అప్పుడే అయిపోయినదా" అని అనిపించగా ప్రదక్షిణ భాగ్యమును యొసగి, పాపములు కడిగివేసిన శ్రీ అరుణాచల శివునికి భక్తితో నమస్కరించెదము. భారతదేశ పవిత్ర భూమిపై పుట్టినందుకు, అనాది యైన వేద ధర్మమును ఆచరిస్తున్నందుకు ప్రతీయోక్కరూ చేయవలసిన కార్యము "అరుణాచల గిరి ప్రదక్షిణము".
"అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా"

No comments:
Post a Comment