06/02/17, 7:50:29 PM: +91 81257 81234: ప్రతినెలా ఏకాదశిని వ్రతదినంగా భావించడం మన సంప్రదాయం. అందులో ’మాఘ ఏకాదశి’ అత్యంత పవిత్రం. అయితే ఈ ఏకాదశిని ’భీష్మ ఏకాదశి’ అనడంలో ఒక విశేషం ఉంది.
'మహాభాగవత శిఖామణి’ అయిన భీష్మాచార్యుడు ముక్తినొందిన రోజు మాఘశుద్ధ అష్టమి, అటుతరువాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించడం సంప్రదాయమయ్యింది.
భీష్మ చరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం. అరి భయంకరుడైన భీష్ముడు - భీషణత్వానికి ప్రతీక. ఈ భీషణత్వం ఇంద్రియ నిగ్రహంలోను, అంతశ్శత్రువులను జయించడంలోను ప్రదర్శించి పరిశుద్ధతను సాధించాడు. దేవవ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు, పితృభక్తిపరుడుగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు. ’భీష్మప్రతిజ్ఞ’ జగత్ ప్రసిద్ధం. సత్యనిష్ఠకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాలలో ధర్మాధర్మ నిర్ణయంలో తటస్థంగా ఉన్నా వాటి వెనుక దైవ సంకల్ప జ్ఞానం, ధర్మసూక్ష్మాలు హేతువులుగా ఉన్నాయి. ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా ’అంపశయ్య’లో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు, భీష్ముడు.
ఇంద్రియ నిగ్రహానికీ, సత్య నిష్ఠకీ మారుపేరుగా నిలిచిన ఈ పవిత్ర చరిత్రుడు అర్జునునితో సాగించిన యుద్ధంలో తగిలిన బాణాలతో అలాగే నేలకొరిగాడు. ఆ బాణాలే శయ్యగా కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో మహర్షులంతా ఆయనను పరివేష్ఠించి ఉన్నారు.
లోకరక్షణకు విష్ణు సంకల్ప ప్రణాళికలో భాగంగా భూమికి దిగిన ఈ వసుస్వరూపుడు సర్వ ధర్మాలనిధి, త్రికాలజ్ఞుడు, ఈ ’త్రికాలజ్ఞ’ లక్షణంతోనే దైవ సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించారు.
ఈయన అంపశయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ యోగంలో ఉన్నారు. ఒక ధర్మవేత్త లోకాన్ని వదిలివెళుతున్న వేళ ఆయన నుంచి తరవాతి తరాలకు విజ్ఞాన సంపద అందాల్ని నిర్ణయించుకున్న కృష్ణుడు, ధర్మ రాజాదులతో శరతల్పగతుడైన భీష్ముని చేరుకున్నాడు. ఒక మహాకాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం, శాస్త్రాలను ఆపోశనపట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదని కృష్ణ సంకల్పం.
పాలించే బాధ్యతను చేపట్టిన యుధిష్ఠిరునకు ఆయన ఆ ధర్మ సంపదనంతా అందించాలని ఆదేశించాడు పరమాత్మ. యుద్ధంతో అలసి, క్షతగాత్రుడై ఉన్న తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తిలేని వాడనని, కనుక ఆధర్మాలను శ్రీకృష్ణునే వివరించమని వేడుకుంటాడు భీష్ముడు.
కానీ ముకుందుడు, "తాతా! నీకు అమోఘమైన శారీరక, బుద్ధిశక్తులను అనుగ్రహిస్తున్నాను. వాటితో నీవు నీ అనుభవసారాన్ని ధర్మ సూక్ష్మాలను నీ మనుమనికి అందించి" అని బోధించాడు.
ఒక తరం తన తరువాతి తరానికి అందించవలసినది ధర్మాన్నీ, జ్ఞానాన్నీ, అనుభవసారాన్నీ, అంతేగానీ ఆస్తిపాస్తులను మాత్రమే కాదు. ఈ సందేశమే భీష్ముని ద్వారా ధర్మజునికిక్ ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థం.
అప్పుడు భీష్ముడు ఉపదేశించిన సూక్షధర్మాలు, మోక్ష ధర్మాలు మహాభారతంలో శాంతి, అనుశాసనిక పర్వాలుగా అతివిస్తారంగా విరాజిల్లాయి. మహాభారతం వేదాల సారమైతే, ఈ రెండు పర్వాలు భారతానికి సారం.
ఇందులో పాలనా ధర్మాలు, రాజధర్మాలు, వ్యక్తి ధర్మాలు, లోకరీతులు, ఉపాసనా రహస్యాలు, తత్త్వచింతన...అన్నీ కలబోసుకుని కనపడతాయి. అంటే, భీష్ముడు ఒక సమగ్ర మానవుడిగా ఈ బోధ ద్వారా మరోమారు నిరూపించుకున్నాడు.
తాత్త్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియనిగ్రహం - ఇన్ని సులక్షణాలు రాశిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. ఆచరించి, ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది. ఆ పర్వంలోనిదే భగవద్గీత.
యావద్భారత జాతీ సంస్మరించదగిన భీష్మాచార్యునికి వందనం!

No comments:
Post a Comment