| |||
01/02/17, 8:45:53 AM: +91 98484 03424: శ్రీ పంచమి శుభాకాంక్షలు 01-02-2017
సరస్వతీదేవికి సంబంధించిన మేధాసూక్త అర్థ తాత్పర్య విశేషాలు
01. మేధాసూక్తము
(జ్ఞాపక శక్తి పెరుగుటకు, మతి మరుపు ఉండేవారికి , కొత్త కొత్త ఆలోచనలు రావటానికి బాగా ఉపయోగ పడే సూక్తము)1
ఓం మేధాదేవీ జుషమాణా న ఆగాత్
విశ్వాచీ భద్రా సుమనస్య మానా |
త్వయా జుష్టా జుషమానాదురుక్తాన్
బృహద్వదేమ విదథేసువీరాః|
తాత్పర్యము
ఓమ్... ధారణాశక్తిగల బుద్ధిని ప్రసాదించు ఓ సరస్వతీ దేవీ! సమస్త
ప్రపంచములోనూ వ్యాపించియుండుదానా !సమస్త శుభములు
కలుగచేయుదానా! నువ్వు మా వద్దనుంచి ఎప్పుడూ వెళ్ళిపోకు.
నువ్వు మా దగ్గర లేనప్పుడు తప్పుగా ఉ చ్చరించే పదాలలో ఆనందం పొందేవాళ్లం.
కాని నీ దయవలన బుద్ధి సంపన్నులమై , స్పష్టమైన ఉచ్చారణ తో,
అంతిమ ఫలితాన్ని తెలుసుకొని పదాలను పలుకుతున్నాం
2
త్వయా జుష్టఋషిర్భవతి దేవి
త్వయాబ్రహ్మాஉஉగతశ్రీరుత త్వయా
త్వయా జుష్టశ్చిత్రం విన్దతే వసు
సా నో జుషస్వ ద్రవిణో న మేధే ||
తాత్పర్యము
ఓ మేధాదేవీ ! నీదయవలన ఒకడు ముని కాగలడు.
నీ కరుణ ఉంటే బ్రహ్మ జ్ఞాని కాగలడు. శ్రీమంతుడు కాగలడు.
నీ దయతో పరిశుద్ధుడై వివిధ సంపదలు పొందగలడు. (షోడశ
సంపదలు 1. కీర్తి, 2. విద్య, 3. బలము, 4. జయము, 5. పుత్రులు, 6.
స్వర్ణము, 7. ధాన్యము, 8. సత్కాలక్షేపము, 9. సద్భోజనము, 10.
జ్ఞానము, 11. సౌందర్యము, 12. క్షమ, 13. బాల్యము, 14. ధైర్యము, 15.
రోగములు లేకుండుట, 16. దీర్ఘాయుష్యము.)
ఓ మేధా దేవీ ! మాకు వాటిని అనుగ్రహించు.
3
మేధాం మ ఇన్ద్రో దదాతు
మేధాం దేవీ సరస్వతీ
మేధాం మే అశ్వినావుభావాధత్తామ్
పుష్కర స్రజా
తాత్పర్యము
ఇంద్రుడు ( పరిశుద్ధమైన అంతరాత్మ) నాకు ధారణాశక్తి కలిగిన బుద్ధిని ఇచ్చుగాక !
సరస్వతీదేవి నాకు ధారణాశక్తి కలిగిన బుద్ధిని ఇచ్చుగాక !
దేవ వైద్యులైన అశ్వినీ కుమారులు చక్కటి ఆరోగ్యముతో నా మేధస్సును బలపరిచెదరుగాక !
విశేషాలు
ఇంద్ర శబ్దానికి వేదాలలో ఉన్న ప్రాముఖ్యత వేరు.
ఇంధుడు ఆదిత్య మండలాంతర్గత పురుషుడు. ఆధ్యాత్మికంగా ఇతడు కుడికంటిలో వ్యక్తం అవుతుంటాడని అంటారు. ఇతడినే ఇంద్రుడనీ అన్నారు. ఎడమ కంటిలో ప్రకాశించే ఆదిత్య పురుష కాంతి ‘ఇంద్రాణి’. ఇంద్రుడు, ఇంద్రాణి హృదయ స్థానంలో కలసినప్పుడు ఉభయుల కూటమి మిథునం. జాగ్రదవస్థలో ఈ మిథునం వైశ్వానరంగా, స్వాప్నిక స్థితిలో తైజస నామంతో ఉంటారు. సుషుప్తిలో ఉండగా ఈ జంట ప్రాజ్ఞ అనిపించు కొంటారు. సుషుప్తి నుంచి జాగరిత స్థితికి ఈ జంట ఊర్ధ్వ ముఖంగా ప్రసరించేటప్పటి నాడిని ‘సంచరణీ’ నాడి అంటారు. (బృహ దారణ్యకోపనిషత్తుకు శంకర భాష్యం )
4
అప్సరాసుచ యా మేధా
గంధర్వేషు చ యన్మనః
దైవీం మేధా సరస్వతీ
సా మాంమేధాసురభిర్జుషతాం స్వాహా
తాత్పర్యము
అప్సరసలలో ఉండే వివేకము సరస్వతీదేవి నాకు అనుగ్రహించుగాక !
గంధర్వులలోని సృజనాత్మక శక్తిని సరస్వతీదేవి నాకు అనుగ్రహించుగాక !
కోరినది అనుగ్రహించు కామధేనువు అయిన సరస్వతి
ఇంద్రియాతీతముగా చూడగలుగు బుద్ధి విశేషములను నాకు
అనుగ్రహించుగాక !
స్వాహావిశేషాలు
యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి ‘స్వాహా’ తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. ఐతే, సంధ్యావందనంలో కేశవ నామాలు చెప్పేటప్పుడు ‘‘త్రిరాచమ్య’’ అంటూ ముమ్మారు స్వాహాకారంతో ఆచమనం చేయడం పద్ధతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. ఐనప్పటికీ అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది సార్థకమైన వాఙ్నామం కూడా. చక్కగా హుతమగుగాక అనే అర్థాన్ని కొందరు భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని కొందరు విద్వాంసుల భావన. వేద మంత్రాలు లేకుండానే స్వాహా మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో ‘‘స్వాహా’’ సాక్షాత్కరించడం ప్రారంభ మవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా ‘‘స్వాహా’’ ప్రసిద్ధమైంది.
05
ఆమాం మేధా సురభిర్విశ్వరూపా
హిరణ్యవర్ణా జగతీ జగమ్యా
ఊర్జస్వతీ పయసా పిన్వమానా
సా మాం మేధా సుప్రతీకా జుషన్తామ్
తాత్పర్యము
బంగారు రంగు కలిగినది (శాశ్వతమైన), చిత్ర విచిత్రములుగా
చేయబడిన సమస్త జీవుల అవతారములు ధరించి విశ్వము తన
రూపముగా కలది, భూరూపంలో స్పష్టంగా కనబడుతున్నదయిన
సరస్వతీదేవి నన్ను చేరుగాక ! పాలరంగువలె శుద్ధ సాత్విక జ్ఞానము
కలిగినది, మిగుల బలముకలది,మిగుల ఉత్సాహము కలది, ప్రేమైక
స్వరూపిణి అయిన మేధాదేవి నన్ను కరుణించుగాక !
06
మయి మేధాం మయిప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు
మయిమేధాం మయిప్రజాం మయీన్ద్ర
ఇంద్రియం దధాతు మయి మేధాం
మయిప్రజాం మయి సూర్యో భ్రాజోదధాతు ||
మేధాదేవి నాకు వివేకము అనుగ్రహించుగాక !సంతానము కలిగించు
శక్తిని (సంతానమును) అనుగ్రహించుగాక !అగ్ని కాంతులను
అనుగ్రహించుగాక !సూర్య కాంతిని అనుగ్రహించుగాక !( బుద్ధిలో
కాంతులను – అనగా సునిశిత నైపుణ్యాలను అనుగ్రహించాలని ప్రార్థన.)
ఓం శాంతిస్ శాంతిస్ శాంతిః

No comments:
Post a Comment