T
20/02/17, 11:03:32 AM: MVMRAO: "ఓ సీత కథ "చెప్పినా ,
"శుభలేఖ " పంచీ ,
"శుభ సంకల్ప" మని జెప్పి ,
"సూత్రధారు"లచే ,
"సప్త పదు" లేయించి ,
"స్వాతి ముత్యా"లనిచ్చీ ,
"స్వాతి కిరణాల " నింపగ,
"చెల్లెలి కాపురాన" ,
"జీవన జ్యోతి" వెలిగించినా ,
"సిరివెన్నెల" కురిపించినా ,
"సిరిసిరి మువ్వలు" , ఘల్లనిపించినా !
సినీ కళామ తల్లి " శారద " కు ,
" ఉండమ్మా బొట్టుపెడతా "నని ఒప్పించి , మెప్పించి ,
" నిండు హృదయాల " ,
" ఆత్మ గౌరవం" బు నినుమడింప జేసిన ,
" ఆప్త బాంధవుడ" వీవుగా !
"శంకరాభరణ" రాగరంజిత ,
" శ్రుతిలయ పూరిత" ,
"స్వరాభిషేకాల" పరవశింప జేసిన ,
" స్వయం కృషీ "వలా ,
నీరాక తెలుగు చిత్రసీమకు
" శుభ ప్రదం " !
నీ సినీ "జీవిత నౌకా" యానం
మాకు "ప్రేమ బంధం"తో
"కలిసొచ్చిన అదృష్టం" !
నీ కథనం , దార్శనీకం ,
గంగా "సాగర సంగమ" సంకేతం !
"కాలం మారింది" ...!
కళామ తల్లి హృదయ క్షోభకు
"నేరము శిక్ష" ... లేనే లేవు !
మా సినీ "సీతా మాలక్ష్మి" కి ,
నీవే దిక్కు !
నీవే రక్ష !
"అమ్మ మనసు" తో ,
నాన్నవై కాయరా !
నూరేళ్ళు చల్లగా కావరా !
మా " చిన్ననాటి కలల" ను ,
కళాత్మకంగా మార్చ .. రారా !
విశ్వ నాథా ,
నిగర్వీ ,
ఓ కళా తపస్వీ ,
పాహిమాం ..పాహి పాహి !
'కళాతపస్వి' " శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ " గారి పుట్టినరోజు సందర్భం లో వారికి వందన శతాల నర్పిస్తూ ఆ దేవదేవుడు శ్రీ సత్యదేవుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలనిచ్చి కాపాడమని కోరుకుంటూ .......
............................. డా . పొన్నాడ కృష్ణ సుబ్బారావు .
"శుభలేఖ " పంచీ ,
"శుభ సంకల్ప" మని జెప్పి ,
"సూత్రధారు"లచే ,
"సప్త పదు" లేయించి ,
"స్వాతి ముత్యా"లనిచ్చీ ,
"స్వాతి కిరణాల " నింపగ,
"చెల్లెలి కాపురాన" ,
"జీవన జ్యోతి" వెలిగించినా ,
"సిరివెన్నెల" కురిపించినా ,
"సిరిసిరి మువ్వలు" , ఘల్లనిపించినా !
సినీ కళామ తల్లి " శారద " కు ,
" ఉండమ్మా బొట్టుపెడతా "నని ఒప్పించి , మెప్పించి ,
" నిండు హృదయాల " ,
" ఆత్మ గౌరవం" బు నినుమడింప జేసిన ,
" ఆప్త బాంధవుడ" వీవుగా !
"శంకరాభరణ" రాగరంజిత ,
" శ్రుతిలయ పూరిత" ,
"స్వరాభిషేకాల" పరవశింప జేసిన ,
" స్వయం కృషీ "వలా ,
నీరాక తెలుగు చిత్రసీమకు
" శుభ ప్రదం " !
నీ సినీ "జీవిత నౌకా" యానం
మాకు "ప్రేమ బంధం"తో
"కలిసొచ్చిన అదృష్టం" !
నీ కథనం , దార్శనీకం ,
గంగా "సాగర సంగమ" సంకేతం !
"కాలం మారింది" ...!
కళామ తల్లి హృదయ క్షోభకు
"నేరము శిక్ష" ... లేనే లేవు !
మా సినీ "సీతా మాలక్ష్మి" కి ,
నీవే దిక్కు !
నీవే రక్ష !
"అమ్మ మనసు" తో ,
నాన్నవై కాయరా !
నూరేళ్ళు చల్లగా కావరా !
మా " చిన్ననాటి కలల" ను ,
కళాత్మకంగా మార్చ .. రారా !
విశ్వ నాథా ,
నిగర్వీ ,
ఓ కళా తపస్వీ ,
పాహిమాం ..పాహి పాహి !
'కళాతపస్వి' " శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ " గారి పుట్టినరోజు సందర్భం లో వారికి వందన శతాల నర్పిస్తూ ఆ దేవదేవుడు శ్రీ సత్యదేవుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలనిచ్చి కాపాడమని కోరుకుంటూ .......
............................. డా . పొన్నాడ కృష్ణ సుబ్బారావు .
No comments:
Post a Comment