Sunday, April 5, 2020

As on 5.04.2020

ఆరాధ్య బంధువులకి శుభోదయం మరియు నమస్కారములు. మన పీఠం తరఫున చేపట్టిన ఈ అన్నదాన వితరణ కి నా స్నేహితుడు శ్రీ సూర్యనారాయణ మిశ్రా  తన వంతుగా $100 ఇచ్చారు. ఈ రోజు మారకం 76.42 ఉంది. 8000 రూపాయలు పంపించాను. ICICI లో పీఠం ఎక్కవుంట్ add చెయ్యటంలో చిన్న ప్రాబ్లెం ఉంది మరియు ICICI సహాయానికి ఎవరు లేరు (until this epidemic is over). శశిభూషణ్ గారి account కి పంపించాను.శశిభూషణ్ గారు  పైకం రాగానే అందచేయగలరు. మీకు కలిగిస్తున్న ఇబ్బందికి క్షమాపణలు. సేవా భాగ్యం కలిగించిన పెద్దలు అందరికీ నమస్కారములు.Sri Sivalenka Ayyaaru garu....
ధన్యవాదములు..శంకరారాధ్యుల వారి ఆశీస్సులు మీ మిత్రులైన శ్రీ సూర్యనారాయణ మిశ్రా గారికి కలగాలని ప్రార్థించు చున్నాము..🙏🙏
ములుగు పవన్ కుమార్🙏🙏***ఆరాధ్య బంధువులకు నమస్కారములు...🙏🙏

ఈరోజు  అనగా 05.04.2020 శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది...
శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యుల బృందం అందరూ  కలసి సుమారు 600 ప్యాకెట్స్** వెజిటబుల్ రైస్**  తయారు చేయించినారు.

 మ౹౹ 12.30 ని!!లకు   200 ఆహార ప్యాకెట్స్ సికింద్రాబాద్ లో ఉన్న  అంధులకు  అందచేయడం అయినది.
150 ఆహార ప్యాకెట్స్ పోలీస్ శాఖవారి సహకారంతో ముషీరాబాద్, పద్మారావునగర్ పరిసర ప్రాంతాలలో పేదలకు పంపిణీ చేయడమైనది.
 100 ఆహారా ప్యాకెట్స్ శ్రీ ఇవటూరి కృష్ణ  కైలాష్ గారు మలకపేట లో పేదలకు వితరణ చేయగా, మరికొన్ని మొండామార్కెట్, సికింద్రాబాద్  గాంధి హస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పేదలకు పంపిణి చేయడమైనది.
తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం


















No comments:

Post a Comment