Tod13/03/17, 8:51:37 AM: +91 80088 84529: సంశయం తీరిందా?
ఒకసారి స్వాములవారు మద్రాసు వచ్చారు. అక్కడ త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరుల పూజ చేస్తున్నారు. స్వామి ఆదేశంపై శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూర్చిని ఉన్నారు. వేసిన పందిళ్ళు చాలక కిటకిటలాడుతూ మైదానమంతా నిండిపోయారు.
ఇంతలో అనుకోకుండా దట్టంగా మబ్బు పట్టింది. ఏ క్షణాన్నయినా వర్షం భారీగా కురిసేట్లుంది. గట్టిగా వర్షం పడితే వేసిన పందిళ్ళు కూడా తట్టుకోవు. పూజకు అంతరాయం కలుగుతుందేమో అని అందరికీ ఆందోళనగా ఉంది. పెద్దస్వామి ఇఅదంతా గమనిస్తున్నారు. నెమ్మదిగా లేచి బయటకు నడిచారు. వెలుపలికి వచ్చి ఆకాశం వైపు అదే పనిగా చూస్తూ నిలుచున్నారు. కాసేపటికి నెమ్మదిగా మబ్బులు పలచబడ్డాయి. క్రమంగా వాన తేలిపోయింది. తిరిగి ఎంద కస్తోంది.
స్వామివారికి కొంచం దూరంగా ఒక వ్యక్తి నిలుచొని ఇదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు.
అప్పుడు స్వామి ఆయన వేపు తిరిగి ‘మీ సందేహం నివృత్తి అయ్యిందా?’ అని అడిగారు.
’అయింది స్వామీ’ అని నమస్కరించారాయన. అనుకోకుండా స్వామి తనను పలకరించినందులకు ఆశ్చర్యం, సంభ్రమం, ఆనందం ముప్పిరిగొనగా, నిజానికి ఆయనకు స్వాముల వారలంటే గురిలేదు. వారి మహిమలంటే అసలే నమ్మకం లేదు. ఈ పెరియ స్వామికి నిజంగా అంత శక్తి ఉందా అన్నది ఆయన సందేహం.
స్వామి అలా కాసేపు తేరిపార చూడగానే వాన తేలిపోవడం ఆయన స్వయంగా చూశాడు. అది స్వామి సంకల్ప బలమా? అదే సమయానికి దనంతటదే జరిగిందా? అని ఆలోచిస్తుండగా స్వామి సంశయం తీరిందా? అనడిగారు. తనకు ఇలాంటి విషయాలంటే సందేహం ఉన్న సంగతి స్వామికెలా తెలుసు? అదీ ఆయనను ఆశ్చర్యపరచిన సంగతి.
స్వామివారు పలకరించిన సందేహరావు ఎవరో కాదు, సుప్రసిద్ధ గాంధేయవాది, కాంగ్రెస్ కార్యక్ర్త, హరిజన సేవకుడు ఊటుకూరు నరసింహారావు.
--- “శ్రీ కంచి పరమాచార్య పథం” పుస్తకం నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment