02/03/17, 2:13:40 PM: +91 81257 81234: ఉసిరికాయ - ద్వాదశి
ఇటివలే సేలంలోని ‘పెరియవ గృహం’ రాజగోపాలన్ గారితో శ్రీ కృష్ణమూర్తి ఘనాపాటి గారు ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సంఘటనతో ద్వాదశి రోజు ఉసిరికాయ తినడం ఎంత ఉత్కృష్టమైనదో తెలియజేశారు. సేలంలోని పెరియవ గృహంలో ఈ ఉసురికాయల గురించి మహాస్వామివారు మరొక్క లీలను చూపారు. అక్కడ ఆరోజు పరమాచార్య స్వామివారి మొదటి ఆరాధనా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
శాస్త్ర ప్రకారం చెయ్యవలసిన అన్ని క్రతువులకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు, అన్నదానానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటున్నారు. అన్నదానంలో ఉసిరికాయ ఊరగాయ, ఉసిరికాయ పచ్చడి తప్పకుండా వడ్డించాలని నిర్ణయించుకున్నారు. కాని, మొత్తం సేలం అంతా వెతికినా నిర్వాహకులకి ఉసిరికాయలు ఎక్కడా లభించలేదు. మొదటి రోజు, ఆరాధన రోజు ఈ రెండు పదార్థాలు లేకుండానే అన్నదానం చేశారు. ఇవి లేకుండా చేసిన అన్నదానం సరి కాదని రాజగోపాలన్ గారు చాలా బాధపడుతున్నారు. కాని పరిస్థితిని అర్థంచేసుకొని అందరూ ఊరకున్నారు.
ఆరాధన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యి, అన్ని జరగాల్సిన ప్రకారంగా జరుగుతున్నాయి. హాలు మొత్తం భక్తులతో నిండిపోయింది. అదే సమయంలో పెరియవ గృహం ముందర ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. అతని చేతిలో ఒక సంచి ఉంది. ఆయన రాజగోపాలన్ని కలవాలని ప్రయత్నిస్తున్నాడు. పూజలు చేయిస్తున్న అర్చకులకి రాజగోపాలన్ సహాయంగా ఉన్నాడని, కనుక బయటకు రావడం కుదరదని అతనికి చెప్పారు.
అతను కొద్దిగా ఆలోచించి అతని చేతిలోని సంచిని రాజగోపాలన్ కి అందించవలసిందిగా చెప్పాడు. అతని గురించి విచారించగా, అతని పేరు శంకర అని త్వరత్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అతను ఇచ్చిన సంచిలో నిండుగా ఉసిరికాయలు ఉన్నాయి. వాటిని చూసి నిర్వాహకులు అమితాశ్చర్యాలకు లోనయ్యారు. కాని ఇక్కడ విషయం ఏంటి అంటే ఈనాటికి ఆ శంకరం ఎవరో రాజగోపాలన్ కి తెలియదు.
పరమాచార్య స్వామివారు తనను నమ్ముకున్న భక్తుల బాధలను తీర్చి వారి ఆశయాలను నేరవేరుస్తారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి ఉంది?
--- శ్రీ గణేశ శర్మ, ‘శ్రీ మహాపెరియవ సప్తాహం’
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:
Post a Comment