10/03/17, 9:12:58 AM: +91 80088 84529: 250 రూపాయలు చాలు
“నీవు చోళపురం వెళ్ళావా?” మహాస్వామి వారిని దర్శించడానికి సేలం నుండి వచ్చిన ఒక భక్తుణ్ణి స్వామి వారు అడిగారు. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మహాస్వామి వారు చరిత్ర పుట నుండి ఒక విషయం బయటపెట్టారు.
”అవ్వయ్యార్ తెలుసు కదా నీకు, పారి మహారాజు కుమార్తెలు అయిన అంగవై సంగవై ల పెళ్ళికి తను చాలా కష్టపడింది. మహారాజు మూవేందార్ (చేర, చోళ, పాండ్య రాజులు) లను పిలిచి వారు సహాయం చెయ్యకపోవడం వల్ల వారి సమక్షంలోనే ఇక్కడే ఉత్తమ చోళపురంలో పెళ్ళి జరిపించాడు. తరువాత ఈ ప్రాంతాన్నంతా చోళ రాజు ఆధీనంలో ఉంచాడు. సేలం అనే ఒక పెద్ద గ్రామాన్ని చేర రాజుకు, వీరపాండి అనే మరొక గ్రామం పాండ్య రాజుకు బహుమానంగా ఇచ్చాడు. పారి మహారాజు మూవేందార్ లకు ఇచ్చినవే ఇప్పుడు ఉత్తమచోళపురం, వీరపాండి మరియు సేలం”. ఎంతో మందికి తెలియని విషయాన్ని స్వామి వారు చెప్పారు.
సేలం చుట్టుపక్కల ఉన్న చాలా శివస్థానాల గురించి కూడా చెప్పారు. సేలంలోని శుకవనేశ్వరర్ గొప్పతనం గురించి చెప్తూ, అరుణగిరినాథర్ ఆ దేవస్థానం లోని సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధి ముందు పాడినట్టు చరిత్ర చెప్తోందని అన్నారు.
ఈ భక్తుడు కూడా సేలంవాసి. అతనికి చాలా కాలంగా ఒక కారు కొనాలని ఆశ. కొద్దికొద్దిగా ధనం పొదుపు చేసి, చెన్నై వచ్చి ఒక పాత కారును కొన్నాడు. కొన్న తరువాత కారులో సేలం రావాలని అతని కోరిక. అతను మహాస్వామి వారికి పరమ భక్తుడు కావడం వల్ల సేలం వెళ్తూ, కంచిలోని శ్రీమఠానికి వచ్చాడు. పరమాచార్య స్వామివారి దర్శనానికి ఉన్న వరుసలో నిలబడ్డాడు.
ఆ సమయంలో ఒక వృద్ధుడు వచ్చి తన మనవరాలి పెళ్ళికి సహాయం చెయ్యవలసిందిగా స్వామిని వేడుకున్నాడు. ఇటువంటి విషయాలలో సహాయం చెయ్యడం శ్రీమఠం ఆనవాయితి. పరమాచార్య స్వామి వారు వారిని పక్కన కూర్చుందమని చెప్పి, శిష్యులతో ఒక వెదురు పళ్ళాన్ని తెప్పించి, తమ దర్శనానికి వచ్చిన భక్తులకు వారికి తోచినంత సహాయం చెయ్యమని చెప్పారు.
ఆ వచ్చిన డబ్బు లెక్క కోసం, ఒక శ్రీమఠం సహాయకుణ్ణి పిలిచి ఒక పుస్తకంలో ఇచ్చిన వారి పేరు, చిరునామా, ఇచ్చిన మొత్తం వ్రాయమని చెప్పారు.
మహాస్వామివారే ఈ విషయంపై శ్రద్ధ చూపించడంవల్ల, వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించి వెళ్ళిపోతూ వారికి తోచినంత వెయ్యడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామి వారు రాసిన వివరాలను గట్టిగా చదవమని చెప్పారు. పేర్లు వారి ఇచ్చిన ధనం చదువుతూ, ఈ సేలం భక్తుని వివరములు కూడా చదివారు. ఆ భక్తుడు తిరుగు ప్రయాణానికి కావలసినంత ధనం ఉంచుకొని మొత్తం అంతా ఇచ్చేసాడు. అతను ఇచ్చిన మొత్తం 500 రూపాయలు. అది చదవగానే మహాస్వామి వారు అతని వంక ఒకసారి చూసి, “రెండువందల యాభై రూపాయలు చాలు. మిగిలినది అతనికి ఇచ్చెయ్” అన్నారు.
ఆ భక్తుడు ఖంగుతిన్నాడు. తను ఇచ్చిన మొత్తంలో ఎందుకు కొంత తిరిగిస్తున్నారో అర్థం కాక తన వల్ల ఏదో అపచారం జరిగిందని చాలా బాధ పడ్డాడు. ఖిన్న మనస్కుడై తన కారు దగ్గరికి వచ్చాడు. తన ముక్కు పుటాలకి ఘాటైన వాసన వస్తోంది. అది పెట్రోల్ వాసన. కొద్దిగా పరిశీలించి చూడగా తన కారు పెట్రోల్ ట్యాంక్ కు చిన్న కన్నం ఉండడం వల్ల దాని నుండి పెట్రోల్ బయటకు వస్తోంది. దాన్ని బాగుచేయించకుండా తను ఊరికి తిరిగి వెళ్ళలేడు. పరమాచార్య స్వామి వారు తిరిగిచ్చిన డబ్బులు దీనికి ఉపయోగపడ్డాయి. స్వామి వారు తిరిగివ్వక పోయుంటే అతని దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి కారు బాగుచేయించ వలసి వచ్చేది. అయినా ఈ ఊళ్ళో తనకు సహాయం చేసేవారు ఎవరు? పరమాచార్య స్వామి వారు తప్ప
--- రా. వెంకటస్వామి, శక్తి వికటన్ ప్రచురణ
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment