Wednesday, June 5, 2019

*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –47*
🕉🌞🌎🌙🌟🚩

  *గంధ సింధూర విశేషం*

.శ్రీరామ పాద సేవా దురంధరుడు , రామభక్తి సామ్రాజ్యాధి పతి అయిన
 శ్రీ హనుమంతుడు అయోధ్య లో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు
  రామప్రభువు సీతామాతను ప్రేమించి నంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు .
 రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు.

 తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది ?ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉచుకోవటానికి కారణ మేమిటో, ఆ ఆజన్మ  బ్రహ్మ చారికి ఏమీ తెలియక  తల్లడిల్లుతున్నాడు .జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్ర బొట్టుకు రాముడు ఆకర్షితు డయాడేమోనని అనుమానం వచ్చింది.

 ఆ సిoధూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతా దేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు .
 శ్రీరామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయాడు .దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే ,వెళ్లి చేతులు జోడించి ”రామయ తండ్రీ !మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిటలో సింధూరం ఉంది .దానికి కారణం ఏమిటో వివరించండి ”అని ప్రార్ధించాడు .
శ్రీ రామ ప్రభువు చిరునవ్వు నవ్వి ,భక్త హనుమాన్ను సమీపానికి రమ్మని, ”భక్తా ఆంజనేయా ! సీతదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి
 కారణం ఉంది .
 శివ ధనుర్భంగం చేసి ,జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సిoధూరాన్ని నేను ఉంచాను .అప్పటి నుండి ఆమె సిoధూరాన్ని, పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల, నేను
సీతకు వశుడను అయ్యాను.
 మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సిoధూరమే కారణం ”అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు .ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి, గంధ సిన్దూరాన్ని తీసుకొని, నువ్వుల నూనె తో కలిపి, తన ఒళ్లంతా పూసేసు కొన్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల, తన రాముడు, మళ్ళీ తనవశం అవుతాడని భావించాడు.

 వెంటనే హుటాహుటిన
శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ”ప్రభూ!
 సీతారామా !చిటికెడు
సిoధూరానికే సీతా మాతకు వశమై పోయావు.
మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను.
 మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా ?”అని అమాయకంగా అయినా, మనసు లోని మాటను, ధైర్యం గానే చెప్పాడు .సీతా రాముడు నవ్వి ఆనందంతో ‘హనుమా !ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని, శరీరం అంతా సిoధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం, భక్తీ తో గంధ సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు, అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరం గా గ్రహించు .” అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు.
 అప్పటి నుండి శ్రీహనుమంతునికి,
 మంగళవారం నాడు, గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి, నుదుట బొట్టుపెట్టుకొనే ఆచారం, లోకంలో
ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపినా లేపనాన్ని, శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత, ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు, అత్యంత ప్రీతి  కరం. అందులోను మంగళ వారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.
సింధూరం గురించి ఇంకో కధ కూడా ప్రచారంలో ఉంది.

ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలో మొదటిది విజయుని చరిత్రకు సంబంధించినది. ఆ విజయుడే పాండవ మధ్యముడయిన,
 అర్జునుడు. ధర్మ రాజు చేసిన రాజసూయ యాగంలో దక్షిణ దేశాలను జయించటానికి, అర్జునుడు సైన్యంతో బయల్దేరాడు. దక్షిణ సముద్రాన్ని చేరి, అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి, పరిహాసంగా నవ్వాడు. అక్కడే ఉన్న హనుమకు కోపం వచ్చింది. ఇద్దరికీ వాగ్వాదం పెరిగింది. ప్రతిజ్ఞలు చేసుకొన్నారు. పంతాలకు పోయి. అప్పుడు శ్రీ కృష్ణుడు, అక్కడికి వచ్చాడు.
 కిరీటి బాణాలతో, సేతువును నిర్మించాడు. దాని కింద, ఎవ్వరికీ తెలీకుండా, కృష్ణుడు, తాబేలు  రూపంలో ఉండి, సేతువు విరిగి పోకుండా, కాపాడుతున్నాడు. హనుమ ఒక్కసారి సేతువు పైకెక్కి, కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కుతున్నాడు. సేతువు యే మాత్రం వంగకుండా శిధిలం కాకుండా నిలబడి ఉంది. హనుమ అంతటి బలాధ్యుని పాద ఘట్టనానికి తట్టుకొని నిల బడింది. ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు.
 అర్జునుడు విజయగర్వంతో విర్రవీగాడు.కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు.

 ఒళ్లంతా రక్తం కారుతోంది.
 పార్ధునితో సహా, అందరు భయపడ్డారు. అప్పుడు పరమాత్మ, ”అర్జునా ! ఈ జయం నీది కాదు .
ఆoజనేయుడిది. నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే అది హనుమ ఒక్క లంఘనానికే, విరిగి ముక్కలయ్యేది .నీ పరువు కాపాడటానికి నెత్తురువోడే టట్లు, శ్రమించాను. బాధ భరించాను. హనుమకు నేను రాముడిగా, కృష్ణుడిగాo ఉంటున్నానని తెలియదు పాపం..”అన్నాడు. అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపపడి హనుమను ఆశ్రయించాడు.

 హనుమ
శ్రీకృష్ణుని, శ్రీ రామునిగా గ్రహించి, ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటిని, తన శరీరానికి పట్టించు కొన్నాడు.
 క్షమాపణ కోరాడు .అప్పటి నుండి, ఆంజనేయునికి, సింధూర పూజ వ్యాప్తిలో ఉందని తెలుస్తోంది. అర్జునుని రధం మీద, జెండాపై హనుమ ఉండి, మహా భారతయుద్ధంలో    ఆతని విజయానికి కారకుడ వుతానని అనుగ్రహించాడు.
  దాన్నే ”కపి ధ్వజం ”అంటారు.
By MVMRAO
🕉🌞🌎🌙🌟🚩
_*శ్రీరమణీయం* *-(189)*_
🕉🌞🌎🌙🌟🚩By MVMRAO

_*"కొందరు దైవాన్ని పేర్లు, రూపాలతో విడగొట్టి ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఆధ్యాత్మికత అనవచ్చా ?"*_

_*మన విశ్వాసం కోసం దైవాన్ని రకరకాల పేర్లతో పిలుచుకోవచ్చు. అయితే పేర్లు, రూపాలతో విడదీసి వైషమ్యాలు పెంచటం ఆధ్యాత్మికత కానేకాదు. నాస్తికునిలో కూడా దైవం ఉంది. ఆ విశ్వాసం ఉన్నవాడే ఆస్తికుడు. ఈ లోకాన్ని పోషించే దైవం ఫలానా రూపంలోనే ఉంటుందని కొందరు అంటూంటారు. అది సంకుచితత్వం మాత్రమే. నీకు నచ్చిన రూపంలో దైవాన్ని కొలుచుకోవచ్చు. కానీ ఆ రూపం మాత్రమే దేవుడి రూపమని చెప్పటం అజ్ఞానం. మేము పూజించే దేవుడు మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తాడని చెప్పేవారిని సూటిగా ఒకప్రశ్న అడగాలి. రెండు నిముషాలు వారు ముక్కు మూసుకొని కూర్చుంటే వారు చెప్పే దేవుడు వచ్చి రక్షిస్తాడేమో అడగాలి. దైవం అంటే ఏమిటో మనకు తెలియకముందే శ్వాసించే గాలిగా, దాహం తీర్చే నీటిగా, ఆకలితీర్చే ఆహారంగా, మన జీవనానికి అవసరమైన అన్నిటిగా సిద్ధంగా ఉంది. సమస్త ప్రాణికోటిని పోషించటంలో దైవానికి ఏ బేధాలు లేవు !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'హృదయ స్పందనే తొలి దైవానుగ్రహం !'*-

🕉🌞🌎🌙🌟🚩
గాయత్రీ మహావిద్య”

” న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా ”
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.

ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు చేకూరుతాయి

ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.

ఇరవైనాలుగు అక్షరములు – దేవతలు

1. తత్ – గణేశ్వరుడు
2. స – నృసింహ భగవానుడు
3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు
5. వ – కృష్ణ భగవానుడు
6. దే – రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి
8. భ – అగ్నిదేవుడు
9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి
11. వ – దుర్గాదేవి
12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి
14. మ – సూర్యదేవుడు
15. హి – శ్రీరాముడు
16. ధి – సీతామాత
17. యో – చంద్రదేవుడు
18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు
20. ప్ర – వరుణదేవుడు
21. చో – నారాయణుడు
22. ద – హయగ్రీవ భగవానుడు
23. యా – హంసదేవత
24. త్ – తులసీదేవి
ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది.

బ్రహ్మ పదమును పొందదలచినవారు “కాలనియమమును విధిగా పాటించవలయును. ప్రాతః(సూర్యోదయమునకు ముందు), మధ్యాహ్నికము, సాయంసంధ్యా(సూర్యుడు అస్తమించక ముందు)

ఈ త్రికాలములందు అశ్రద్ధ వహించక గురువు చెప్పిన ప్రకారం “త్రిసంథ్యా”యందు సంధ్యా వందనము, గాయత్రీ మంత్ర జపం చేసిన మనుజుడు బ్రహ్మపదమును సులభముగా పొందగలడు.

ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
భావం ‘మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము’ అని అర్థం

 ఈ గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనది ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని ఋగ్వేదములో చెప్పబడింది. ఒకప్పుడు కొన్ని వర్ణాల వారు మరియు వేదం పాఠశాలలో మాత్రమే దీన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్దతిలో జపించడం చేసేవారు. కాని మారుతున్న కాలంతో పాటు అందరికి అందుతున్న విజ్ఞాన ఫలాల వల్ల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు మరియు అందరూ వింటున్నారు. ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుంది అనేది సత్యం ఈ జపం వల్ల 0మన శరీరం మనకు తెలీకుండానే ప్రకృతిలోని ఎన్నో శక్తి తరంగాలను శరీరం, మెదడు ఆకర్షిస్తుంది.. మనసుకు ఆ అనుభూతి అద్భుతమైన అనిర్వచమైన ఆనందాన్ని పొందుతుంది..

గాయత్రీ మంత్రం గురించి వేదాల ప్రకారం  చెప్పాలంటే, ‘సవిత’ గాయత్రీ మంత్రమునకు అధిష్టాన దేవత. అగ్ని ముఖము, విశ్వామిత్రుడు ఋషి. గాయత్రీ ఛందము. ప్రణవ రూపమైన ఓం కారమునకు నేను వందనం చేస్తున్నాను. విశ్వాన్ని ప్రకాశింప చేస్తున్న సూర్య తేజమైన సవితాను నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రీకి ఉన్న వివిధ అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలోనింపుతుంది.by MVMRAO 
*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –46*
🕉🌞🌎🌙🌟🚩

*కుoభినీ పాలుని కధ*

శ్రీరామ చంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో
ధర్మారన్యం, అంటే ఈ నాటి కర్నాటకలో, రాక్షసుల చేత ధ్వంసం చెయ్యబడ్డ గ్రామా లను, రాముడు పునర్నిర్మించి, వాస యోగ్యం చేయించాడు .ఆ గ్రామాలకు, ”మండల నగరం" అనే దాన్ని, ప్రధాన కేంద్రంగా చేశాడు .అక్కడ వేద వేద్యులు, సత్కర్మా చారణులు, పండితులు, జ్ఞాన నిష్టులు, అనేక మంది ఉండేవారు. దానికి ధర్మకర్తగా, ఆంజనేయుడిని, నియమించాడు. శ్రీ రాముని తరఫున, హనుమ, వారిని చక్కగా కాపాడుతున్నాడు.

 ప్రజలకందరికి మంచి రక్షణ కల్పించాడు. కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు. గొప్ప ధర్మ వ్యవస్థనేర్పరచి. దాని దిన దినాభి వృద్ధికి కృషి చేశాడు.
కలికాలం ప్రవేశించగానే, దాని పరి పాలనాన్ని అక్కడి వారికే వదిలి, గంధ మాదన పర్వతం చేరి శ్రీ రామునిపై ధ్యానం చేస్తూ, గడుపుతున్నాడు .
కలియుగంలో ”కన్యా కుబ్జం" అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని, ”ఆ మందుడు ”అనే రాజు పాలిస్తున్నాడు .అతనికి ”మాయ”అనే భార్య ఉంది.
 వారికి ”రత్న గంగ ”అనే కూతురు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ, సర్వ విద్యా విశారదను చేశారు. ఆమెకు పెండ్లీడు వచ్చింది. వరాన్వేషణ చేస్తున్నారు.

వీరి పురోహితుడు ”ధర్మ సఖుడు ”.ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ, రాజుకు చాలా సంతోషం కల్గిస్తున్నాడు.
 ఒకరోజు ఆయనతో, ”మహాత్మా !కలి ప్రవేశించింది.
 కల్మషం అంతటా వ్యాపించి పోయింది .”అన్నాడు. రాజు "కలి కల్మషమంటే ఏమిటి?"అని అడిగాడు. ఆయన దానికి, అర్ధం అసత్య ప్రచారం అని చెప్పి, ”కలి కాలంలో అబద్ధం చెప్పేవారు, వేదాన్ని దూషించే వారు, హింసను పెంచే వారు, ధర్మాన్ని వదిలేసి, అర్ధ, కామాలను మాత్రమే, ఆశ్ర యించేవారు, ఎక్కువైపోతారు.
 విశ్వాస హీనులు ,కామ పరాయణులు, దైవ చింతన లేనివారు, డాoబికులు ,వేష దారులు,పాషoడులు,
ప్రజావంచకులు, అసూయా పరులు, మూర్ఖులు పెరిగి పోతారు. వీటివల్ల, ఆ అధర్మాలన్ని, రాజుకు
సంక్రమిస్తాయి. మీరు ధర్మ పరులు కనుక, భారాన్ని దేవుడి మీద వేయండి.మన చిరంజీవికి   మంచి వరునితో త్వర లోనే వివాహం అవుతుంది ”అని చెప్పాడు. కొంత కాలానికి బ్రహ్మా వర్తాన్ని పాలించే, కుoభినీ పాలుడు అనే రాజుకు,
రత్నగంగ నిచ్చి, వివాహం చేశాడు. కుoభినీపాలుడు,
 భార్యతో కలిసి, ధర్మారణ్యానికి వెళ్లి, అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు.
కుoభినీ పాలకుడు, క్రమంగా, వేద మార్గానికి దూరమై, జైన మతాన్ని అవలంబించాడు.
 అప్పటి దాకా బ్రాహ్మణులు, వేద విద్యా వ్యాప్తికి, సత్కర్మా చరణకు, యజ్న యాగాలకు, ఇవ్వబడిన అగ్రహారాలనన్నిటినీ,
 లాగేసుకొన్నాడు. జైనులను అక్కడ అధికారులనుగా
నియమించాడు.

 వాళ్ళు యజ్ఞ యాగాలు చేసే వారిని హింసించి, శిక్షించేవారు.
జైనుల వేధింపు విపరీతమై, వారికేమీ దిక్కు తోచలేదు.
 దుష్టులకు రాజబలం తోడైంది. ఇక భరించలేక, అందరు కలిసి, కన్యాకుబ్జరాజు అయిన, ”ఆమందుడు రాజు ”కు, తమ గోడు విన్నవించుకొన్నారు.
 తాము అతి ప్రాఛీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని,
త్రేతాయుగంలో శ్రీ రాముడు ”మహోదరం ”తో పాటు, మరి కొన్ని అగ్రహారాలను, తమకు ఇచ్చాడని, తమ అల్లుడు కుoభినీపాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకొని ,
హింసిస్తున్నాడని దేవతారాదన,
 యజ్ఞ యాగాదులను, నిషేధించాడని, పూర్వ జీవితం కొనసాగించటం దుర్భరంగా ఉందని, మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు, తమ వృత్తులను కొనసాగించుకోవటానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించారు.
 రాజు వారంతా చెప్పింది సావధానంగా ఆలకించాడు. అల్లుడు కుంభీపాలుడికి కబురుచేసి లాక్కున్న భూములనన్నిటిని బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని, వేదవిద్యకు ఆటంకం కలిగించవద్దని, హితవు చెప్పి, రాజ పత్రం ఇచ్చి, వారిని పంపాడు . వారందరూ, కుoభినీపాలుడికి, రాజపత్రం ఇచ్చారు. ఇది అల్లుడికి కోపం తెప్పించింది.
 మొండిగా, ”మీకు యే రాముడు భూముల్ని ఇచ్చాడో, ఆ రాముడినే  రమ్మనండి.

 ఆయనతో బాటు ”తోకాయన్ను" కూడా తీసుకొని రండి. అప్పుడు ఆయన చెప్పింది విని, తగినట్లు చేస్తా" అని భీష్మించాడు. పాపం కొంత మంది బ్రాహ్మణులు, రాజుకు ఎదురు తిరగలేక, జైన మతాన్ని తీసుకొని, రాజుకు లోబడి జీవిస్తున్నారు.మిగిలిన వారు, తమను రక్షించగలిగేది, వాయుసుతుడైన హనుమ ఒక్కడే నని గ్రహించి, శరణు కోరుతూ, ధ్యానించ సాగారు. భక్త సులభుడైన మారుతి, వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కల్గించాడు. వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు.
 తమ బాధను
వెళ్ళబోసుకొన్నారు.
వారిని రక్షించాలనే ఉద్దేశ్యంతో మనసు కరిగి, తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను, కుడిచేతినుండి ఇంకో రోమాన్నితీసి, ఒక భూర్జర పత్రంలో భద్రంగా ఉంచి, దాన్ని బ్రాహ్మణుల కిచ్చి, రాజు దగ్గరకు వెళ్లి, తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి, పంపించాడు. ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే, ఒక రోమాన్ని, సింహ ద్వారం మీద ఉంచండి.
అప్పుడు భయంకరమైన అగ్ని జ్వాలలు ఏర్పడి, రాజసౌధాన్ని,పట్టణాన్ని,
 కాల్చేస్తాయి. మీ గ్రామాలను మీకిచ్చేసి, రక్షించమని, రాజు ప్రార్ధిస్తే, కుడి చేతి రోమాన్ని విసరండి.అప్పుడు అంతా యదాస్తితిలోకి వస్తుంది, అని చెప్పి పంపాడు. అక్కడ మూడు రోజులుoడమని ,
ఆకలి దప్పులతో బాధ పడుతున్నారు కనుక, తానిచ్చే ఫలాలను ఆరగించమని చెప్పి,
 అదృశ్య మైనాడు.

బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి, ప్రసాదం తీసుకొని స్వస్థత చెందారు. మారుతి, వారికోసం, విశ్రాంతి గృహం నిర్మించాడు. మూడు రోజులు అందులో ఉండి, నాలుగవ రోజున వారి అగ్రహారాలకు, శిలాగ్రుం చేర్చింది . మర్నాడు వారంతా రాజు దగ్గరకు వెళ్లి, హనుమ చెప్పినట్లు అడిగారు. దానిని మన్నిoచకుండా, అవమానించాడు. హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు. పట్టణం అంతా అంటుకొని భస్మీ భూతమైంది. . ఆర్త నాదాలు పట్నం అoతా, వ్యాపించాయి. జైనులందరూ పారిపోయారు.

బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి, రాజు భయపడి వారి అగ్రహారాలను, వారికిచ్చివేశాడు .వారు కుడి చేతి రోమాన్ని విసరేశారు.
 దానితో పట్నం మామూలు అయింది. రాజు కూడా బుద్ధి తెచ్చుకొని, శ్రీరాముని భక్తుడు గా మారి, వేదానుసారంగా ప్రవర్తించాడు. ధర్మసంస్తాపకుడై ,
విష్ణుధ్యానరతుడై, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు.
ధర్మారణ్యాన్ని నిజమైన
ధర్మారణ్యంగా పాలిoచాడు.
త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన హనుమను, అందరు భక్తీ శ్రద్ధలతో పూజిస్తూ, సుఖాలను పొంది, చివరకు కైవల్యం చేరారు.

🕉🌞🌎🌙🌟🚩 By MVMRAO 

*'అష్టావక్రగీత' 13, 14 ప్రకరణల నుండి (316)*_
🕉🌞🌎🌙🌟🚩
By MVMRAO
_*వినయం మనలో సంస్కారాన్ని పెంచి అహంకారం తగ్గిస్తుంది !!*_

_*మహానుభావులు సమత్వం పాటిస్తారు. అంటే  ఎప్పుడు, దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇస్తారు. వారు దేన్నుండి ఏమి ఆశించారు. కనుకనే వారి మనసు, ప్రవర్తన అంతా పవిత్రంగా ఉంటాయి. వారి బంధరహిత స్థితే ఆ పవిత్రతకు కారణం. మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మనం మన అవసరాన్ని బట్టి ఎదుటివారి విలువలను అంచనావేస్తాం. ఒక డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తాం. అదే మనకి సామాన్యంగా కనిపించే వారికి కనీసం ప్రతినమస్కారం చేయడానికి కూడా అహంకారం అడ్డువస్తుంది. అందుకే భక్తుడు అనుకునేవారు ఎదుటి వ్యక్తి హోదాను చూసి కాకుండా వారిని ఒక తోటి మనిషిగా మనస్ఫూర్తిగా గౌరవించడం, వినయంగా నమస్కరించడం అలవాటు చేసుకోవాలి. వినయం మనలోని సంస్కారాన్ని పెంచి అహంకారాన్ని తగ్గిస్తుంది. కంచి మహాస్వామి వారు సాధారణ దర్శన సమయంలో అత్యంత సామాన్యులను కూడా ప్రేమతో అనుగ్రహించే వారు. వారి సాధన సమయంలో  కోటీశ్వరులు వచ్చినా కూడా చలించే వారు కాదు. దర్శనం ఇచ్చేవారు కాదు !*_

🕉🌞🌎🌙🌟🚩
*జ్ఞానం అంటే ఏమిటి ?*

జ్ఞానం అంటే చాల మందికి గుర్తు వచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. దీనినే చాల మంది వేరే వారిని అవహేలనగా కూడ, తమాషాగా కూడ మాట్లాడుకుంటారు.అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం?
మన సనాతన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన BB.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.  
సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.
జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చుడండి.

1. ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.

2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.

3. అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధతత్వము జూపును.

4. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.

5. అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి.

6. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది . Forwarded by Mallayya