Friday, April 12, 2019

*మన సమస్యలకు గీత పరిష్కారాలు ~ 84*

*సమస్య*
                    లోకములో  అందరికీ ఒకే రకమైన అర్హతలు, లక్షణాలు ఉండవు కదా! వారందరూ భగవంతుణ్ణి చేరాలంటే వారికి తగినట్లు ఏవైనా మార్గాలున్నాయా? ఎలా భక్తులు భగవంతుణ్ణి చేరాలి?

*ఈ ప్రశ్నకు భగవానుడు ఏమని చెప్పినాడో గీతలో 12/8-9-10-11 శ్లోకాలను చూద్దామా!*

*మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్దిం  నివేశయ*
*నివసిష్యసి మయ్యేవ అతి ఊర్ధ్వం న సంశయః*

*మయి మనః ఆధత్స్వ* ~ నాయందే నీ మనస్సును లగ్నము  చెయ్యి;
*మయి ఏవ బుద్దిమ్ నివేశయ* ~ నాయందే బుద్దిని నిమగ్నము‌ చెయ్యి;
*అతః ఊర్ధ్వమ్ మయి ఏవ నివసిష్యసి* ~ ఆ పిమ్మట నాయందే నివసిస్తావు
*సంశయః న* ~ ఇందు ఏ మాత్రమూ సంశయము లేదు.

*అథ చిత్తం సమాధాతుం  న శక్నోషి మయి స్థిరమ్*
*అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుమ్ ధనంజయ*

*అథ చ్జిత్తమ్ మయి స్థిరమ్ సమాధాతుమ్* ~ ఒకవేళ ‌చిత్తమును నాయందు నిలుపుటకు;
*న శక్నేషి తతః ధనంజయ!* ~ సమర్థుడవు కానిచో అట్టి స్థితిలో అర్జునా!
*అభ్యాస యోగేన మామ్ ఆప్తుమ్ ఇచ్చ* ~ అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము;

*అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ*
*మదర్థమపి కర్మాణి  కుర్వన్ సిద్దిమవాప్స్యసి*

*అభ్యాసే అపి అసమర్థః అసి* ~అభ్యాసమునందును అసమర్థుడవైనచో;
*మత్క ర్మపరమః భవ* ~ మత్పరాయణుడవై కర్మలను ఆచరించుము;
*మదర్థమ్ కర్మాణి కుర్వన్ అపి* ~ నాకొరకై కర్మలను చేయుచునూ;
*సిద్దిమ్ అవాప్స్యసి* ~  నా ప్రాప్తి రూప సిద్దిని పొందుతావు.

*వ్యాఖ్య*

             ఏ పనికైనా ఆయా వ్యక్తుల అధికారాలను(అర్హతలు) బట్టి మర్గముంటుంది. అందరికీ ఒకే మార్గమని ఏమీ ఉండదు. వారి అర్హతలను బట్టి మార్గాలుంటాయి. *ఒకటి* ~ ఎప్పుడూ మనస్సును భగవంతునిపై వుంచడము, అన్ని పనులనూ   భగవత్పరముగా చెయ్యడము. *రెండవది* ~ మనస్సును నిలకడగా పెట్టుకోలేకపోతే అభ్యాసము చెయ్యి. *మూడవది* ~ మనస్సు చంచ లమైతే ప్రతిపనినీ ఆయనకే అంకితము చెయ్యి. *నాలుగవది* ~ నీవు నిత్యమూ చేసే కర్మల ఫలాన్ని ఆయనకు త్యాగము చెయ్యి.  *చివరిది* ~ అందరూ వారి వారి పనులు వారు చేసుకోవచ్చు;  ఫలాన్ని‌ ఆయనకే వదిలెయ్యి. ఈ ఐదింటిలో దేన్ని అశ్రయించినా మోక్షము వస్తుంది.

~~~~(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)~~~~

Thursday, April 11, 2019

First Hindu Temple in Abu Dhabi ... to be inaugurated by Narendra Modi on 20th April, 2019.

*మన సమస్యలకు గీత పరిష్కారాలు ~ 83*

*సమస్య*

           *అనన్య భక్తితో భగవంతుణ్ణి నమ్మి  సేవించేవారిని ఈ సంసార బంధాల  నుండీ ఆయన ఉద్దరిస్తాడా?*

*ఈ ప్రశ్నకు భగవంతుడు ఏమని సమాధానమిచ్చాడో గీతలోని‌ 12/7 వ శ్లోకాన్ని ఒకసారి చూద్దామా?*

*తేషామహం  సముద్దర్తా  మృత్యు  సంసార  సాగరాత్*
*భవామి  నచిరాత్  పార్థ  మయ్యావేశిత  చేతసామ్*

*ప్రతిపదార్థాలు:*

*పార్థా! తేషామ్ మయి ఆవేశిత చేతసామ్* ~ ఓ అర్జునా! అట్టి నాయందే లగ్నమైన చిత్తము కలవారికి;
*అహమ్ నచిరాత్* ~ నేను శీఘ్రముగా;
*మృత్యు సంసార సాగరాత్* ~ మృత్యు రూప సంసార సాగరమునుండీ;
*సముద్దర్తా భవామి*~ ఉద్దరించు వాడను.

*వ్యాఖ్య*

              *అటువంటి పరమ భక్తులను నాశ భూయిష్టమైన సంసార సముద్రము నుండీ భగవంతుడు తప్పకుండా సముద్దరిస్తాడు. అయితే వారు సర్వకర్మలను భగవంతుని పాదపద్మాలలో సమర్పించి, ఎల్లప్పుడూ భగవంతుని పైన ఆసక్తి  కలిగిన మనస్సుతో ఆయననే ధ్యానించాలి.*
*తాను ఏ పనిచేస్తున్నా, ఏ మాట మట్లాడుతున్నా, ఏ ఆలోచన చేస్తున్నా,* *దాన్ని దైవకృతముగా భావిస్తూ మూడు రకాల కర్మలలోనూ భగవంతుణ్ణి* *స్మరిస్తూ,మనస్సునుఆయనలోనేఆవేశింపజేస్తే,  ,అటువంటి ,భక్తాగ్రేసరులను భగవంతుడు తనవారిగా భావించి తప్పక కాపాడుతాడు. సంసార* *యాతనలు  అతనికి‌ అంటవు.  సంసార ధుఃఖాంభుధి నుండీ అలాంటి భక్తులను‌ భగవంతుడే ఉద్దరిిస్తాడు తప్పకుండా!*

~~~~(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)~~~~
🕉🌞🌎🌙🌟🚩

*మహర్షికి గోచీ ఎందుకు?*

      శ్రీ అరుణాచల రమణ మహర్షుల వారిని ఒకాయన  అయ్యా! మీరు వంటి మీద ఎక్కడా గుడ్డ కట్టుకోకుండా ఉన్నారు.మరి గోచీ మాత్రం పెట్టుకున్నా రంటే, మీకింకా సిగ్గూ, అభిమానంపూర్తి గా వదలనట్లున్నదే', అని అడిగాడట.  

         
         మహర్షుల వారు చిరునవ్వు నవ్వుతూ "నీవంటున్నవన్నీ నన్నెప్పుడో వదిలేసాయి, కానీ మీలాంటి వాళ్లు వచ్చి ఇలాంటివన్నీ అంటగడు తున్నారు. దానికి గుర్తుగా యీగోచీ నన్ను పట్టుకొని వదలటం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, బయట క్షీరరంద్రాలు లోపలి బ్రహ్మ రంద్రం కాక మానవులకూ జంతువులకూ తొమ్మిది చిల్లులే ఉన్నాయి. జంతువులూ,  పిచ్చి వాళ్ళు అన్ని చిల్లులూ గాలికి వదిలేస్తు న్నారు. మానవులు మాత్రం తలకాయ కున్న ఏడు తొర్రలు గాలికొదిలేసి, కింద రెండు మాత్రం గుట్టుగా గుడ్డలతో దాచుకుంటున్నారు. బైటవి  లోపలికి లాక్కునే  పై ఏడింటిని అదుపు చేసుకోలేక,  లోపలివి బయటకు వెళ్ళ గొట్టే కింద రెండిటిని దాచుకుంటు న్నారు. ...ఇది చిత్రమైన విషయమే, కానీ నాకవసరం లేదు.అందుకే తొలిరోజుల్లో ఈ వంటి మీద గుడ్డ వున్నదీ, లేనిదీ కూడా నాకు తెలియదు. అయితే ఆ తరువాత, వీడు  పిచ్చి వాడు కాదు, పశువూ కాదు,  మనిషే అని తెలియజేయడానికి ఈ గోచి నన్ను పట్టుకున్నది. కానీ నేను మాత్రం ఈ దేహం  కాదు. కాబట్టి మనిషిని కాదు. నాకీ దేహమే ఒక గుడ్డ. మళ్లీ దీనికో గుడ్డ ఎందుకనిపించి, గుడ్డ మీద గుడ్డ కట్టడం లేదు", ఆన్నారు‌‌ శ్రీ రమణ మహర్షులవారు. ( శ్రీ రమణమహర్షుల వారు బాల్యము నందే తపఃసిద్ధులు, ఆత్మసాక్షాత్కారము పొందినహాత్ములు).

🕉🌞🌎🌙🌟🚩
_*శ్రీరమణీయం* *-(135)*_
🕉🌞🌎🌙🌟🚩

_*"పూజలు, స్తోత్రాలు చివరికి ఏమవుతాయి ?"*_

_*స్తోత్రం అంటే జ్ఞప్తిలో ఉన్నదాన్ని వల్లెవేయటమే కదా ! నేను 'ఆత్మరూపాన్నే' అన్న జ్ఞాపకాన్ని నిరంతరం వల్లెవేస్తే వచ్చేది శాంతే. కాబట్టి అన్ని స్తోత్రాల్లోకి ఉత్తమ స్తోత్రం అదే అవుతుంది. ఏ పూజా విధానమైనా దేహభావన తగ్గించి శాంతినివ్వటానికే. అలా కానప్పుడు అవన్నీ నిష్ఫలం అవుతాయి. పరిశుద్ధంగా ఉన్న దైవాన్ని మనలోనే ఉంచుకొని మరెక్కడో ఉన్నట్లు వేడుకుంటాం. శాంతితో నిదానించే మనసు సహస్త్ర నామాలు పఠించినంత ఫలాన్ని పొందుతుంది ఎందుకంటే ఏ స్త్రోత్రాల ఫలమైనా కర్మలు తీర్చి శాంతిని ఇవ్వటానికే. అంతేకాకుండా పరమాత్మ ప్రతిరూపమైన ఆత్మ తెలియాలంటే మనసు నెమ్మదించాలి మరి !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'అనవసరమైన ఆలోచనలే ఆటంకం !'*-

🕉🌞🌎🌙🌟🚩