Sunday, October 8, 2017
Saturday, October 7, 2017
07/10/17, 7:38:56 AM: +91 79811 59026: *అహింసా ప్రధమం పుష్పం, పుష్యమింద్రియ నిగ్రహం* |
*సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః* ||
*శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పంతధైవచ*| *సత్య మష్ట విధం పుష్పమేతైస్తుష్యతి శంకరః*||
అహింస, ఇంద్రియ నిగ్రహము, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అనునవి ఎనిమిదియు శంకరునకు ప్రీతికరమైన పుష్పములు.
Friday, October 6, 2017
29/09/17, 2:07:59 PM: +91 98660 49721: దశరా నవరాత్రులలో తొమ్మిదవరోజుసిద్ధిదాత్రీ దేవి అవతారవిశేషాలు.
(9) సిద్ధిధాత్రీ దేవి
సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ||
మార్కండేయ
పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ,
సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి,
కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని
అష్టసిద్ధులు చెప్పబడ్డాయి. ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా
అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని.
కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ
మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు
నెరవేరతాయి.
తొమ్మిదవరోజు నైవేద్యంపాయసం.
29/09/17, 11:41:16 PM: Yes Pk: 🎉🎊దశహర అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ "దశహర" పండుగ
🎆కామ (Lust)
🎆క్రోధ (Anger)
🎆మోహ (Attachment)
🎆లోభ (Greed)
🎆మద (Over Pride)
🎆మాత్సర్య (Jealousy)
🎆స్వార్థ (Selfishness)
🎆అన్యాయ (Injustice)
🎆అమానవత్వ (Cruelty)
🎆అహంకార (Ego)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟 ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని "విజయదశమి" అనికూడా అంటారు.
అందరూ
ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో
సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, అందరికి ముందస్తు విజయదశమి
శుభాకాంక్షలు 🙏🙏🙏
30/09/17, 9:22:16 PM: Seetha Prasanna: అందరికీ సంతోషంగా విజయ దశమి
విజయదశిమి
అనగా వజయవంతమైన పదవరోజని అర్ధము. నవరాత్రుల అనంతరం అమ్మ విజయాన్ని
సాధించిన సుదినాన్ని విజయదశిమిగా మనము జరుపుకుంటాము. సాధనామార్గమున
ఎదురయ్యెడి అవరోధములనెదుర్కొనెడి శక్తి సామర్ధ్యాలను సాధకునికి అమ్మ తన
అపార క్రుపచే ప్రసాదించును . అమ్మ ఒసగిన సాధనాబలంతో , సాధకుడు
ఆధ్యాత్మమార్గాన పురోభివ్రుధ్ధి చెందటమే అమ్మయొక్క విజయము.
కాళిదాసు రచించిన దండకమును పునరావ్రుత్తి చేసుకోవడాన్ని మించిన ప్రార్ధన మరొకటి లేదనడంలో అతిశయములేదు.
"
ఓ దేవి ! సకల తీర్ధజలములలో, తంత్రాలలో , మంత్రాలలో , చక్రాలలో(సంకేతాలలో),
నాదాలలో , యోగాలలో, వాక్కులో, వేదాలలో , సకల జగత్తులలో - వాటి సారముగా
యన్నది నీవు మాత్రమే ! ఓ జనని! సకల చరాచర స్రుష్టియందున్న ఆదిపరాశక్తియైన
నీకు సభక్తికంగా నేను సమర్పించే సాష్టాంగప్రణామములివే !
01/10/17, 9:04:50 AM: +91 79811 59026: *ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్!*
*నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా!!*
*క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి"!*
*క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్!!*
*వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్!*
*నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి!!*
*య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి!*
*యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే!!*
(సుందరకాండ)
మహాత్ములైన
ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో
చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా
ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును.
కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు
సజ్జనులను సైతము నిందించును.
కోపమునకు
లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని
పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన
ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు
Subscribe to:
Posts (Atom)