Thursday, September 28, 2017

28/09/17, 3:18:46 PM: ‪+91 96767 36199‬: या देवी सर्वभूतेषु जगन्मायेति शब्दिता । नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।

28/09/17, 3:28:27 PM: ‪+91 96767 36199‬: दुर्गादेवतायाः अनग्र28/09/17, 3:01:05 PM: ‪+91 96767 36199‬: सा अम्बा सकलकष्टाः दूरीकरोतु । सकलाः सम्पदाः ददातु  ानयतु इत्यहं आशिष्ये
28/09/17, 3:06:53 PM: ‪+91 96767 36199‬: सर्वेषाम् भक्तबृन्दानां दुर्गामातुः अनुग्रहः सिद्धिरस्तु । दुर्गापूजायाः शुभकामनाः ।


हसिदि्धरस्तु ।
28/09/17, 8:40:34 PM: ‪+91 80088 84529‬: పెద్ద డాక్టర్ (పార్ట్ 1)

నాకు గుర్తున్నంతవరకు అది 1957వ సంవత్సరం అనుకుంటా. కంచి పరమాచార్య స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారు చెన్నై టి. నగర్ లోని రామేశ్వరం రోడ్డులోని ఒక ఇంట్లో మకాం చేస్తున్నారు. ఆ వీధి చివర్లో ఉత్తరం వైపున నేను మా తల్లితండ్రులతో కలిసి నివసిస్తున్నాను. అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. సెకెండరి గ్రేడ్ టిచర్స్ ట్రైనింగ్ స్కూల్ లో చదువుతున్నాను.

కొన్నిసార్లు మహాస్వామివారు ఉదయంపూట గాని సాయింత్రంవేళలో కాని మా ఇంటి ముందు నుండి వెళ్ళేవారు. అప్పుడు మా అమ్మ ఇంటిముందు ముగ్గువేసి చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని నిలబడేది. స్వామివారు మాఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడల్లా స్వామికి హారతిచ్చి నేలపై పడి నమస్కరించేది. నాగరిక మనస్తత్వం, ధిక్కార ధోరణి, యువరక్తం, మంచి చెడులు తర్కించలేని పరిణతి ఉన్న నేను మా అమ్మను తిట్టేవాడిని అలా చేసినప్పుడల్లా. “ఇతను ఒక సన్యాసి. ఎందుకు అతనికి నమస్కరిస్తావు? ఇలా అనాగరికురాలిగా అతనికి నమస్కరిస్తే, ఆయన నిన్ను కాపాడతాడా? ఇకనుండి ఇటువంటి తప్పు పనులు చెయ్యవద్దు”. ఈ నా మాటలు విని మా అమ్మ “పోరా పో! ఊరికే నీపని చూసుకో” అని బదులిచ్చేది.

రెండేళ్ళ తరువాత 1959లో చెన్నై మైలాపూర్ లోని పి.యస్. హైస్కూల్ లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను. కొన్ని సంవత్సరాల తరువాత మా అమ్మకు ఆరోగ్యం చాలా పాడయ్యింది. అధిక రక్తపోటు వల్ల, మెరుగైన చికిత్స కోసం ఆమెని చెన్నైలోని తారమణిలో గల వి.హెచ్.యస్ ఆస్పత్రిలో చేర్పించాము. అప్పుడు నేను మైలాపూర్ కపాలేశ్వర దేవాలయం దగ్గర్ళోని కళ్యాణి హోటల్ (ఇప్పుడు అది లేదు) యజమాని మణి అయ్యర్ కుమారులిద్దరికి ట్యూషన్ చెప్పేవాడిని. వారి కుటుంబం పరమాచార్య స్వామికి భక్తులు. వారు తరచూ కంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు. స్వామివారి పాదసేవ కంటే మించినది ఏమి లేదు వాళ్ళ అభిప్రాయం.

మణి అయ్యర్ మైలాపూర్ దగ్గర మండవేలిలో ఉండేవారు. వాళ్ళ ఇంట్లో హాల్ ఎదురుగా ఉన్న చిన్న పూజగదిలో పరమాచార్య స్వామివారి చిత్రపటం ఉండేది. దాని ముందు ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది. నేను హాల్లో ఉన్న ఊయలలో కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. పూజగది ఎప్పుడూ తెరిచి ఉండటం వల్ల నాకు స్వామివారి చిత్రపటం కనపడగానే ఒళ్ళు జలదరించి వెంటనే వెళ్ళి పూజగది తలుపు వేసి వచ్చేవాణ్ణి. ఇలా చాలాసార్లు జరిగింది.

అప్పుడే చెప్పినట్టుగా నేను మా అమ్మ అరోగ్యం గురించి ఆందోళన చేందేవాణ్ణి. మా అమ్మ నన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోతుందేమో అనే బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఒకరోజు నేను పాఠం చెబుతుండగా అప్పుడే ఇంటికి వచ్చిన మణి అయ్యర్ నాతో, “ఏంటి సార్! చాలా ఆందోళన పడుతున్నారు. కళ్ళు కూడా ఎర్రబడ్డాయి, ఏంటి విషయం?” అని అడిగారు. కళ్ళు తుడుచుకుంటూ “ఏం లేదు మణి అయ్యర్! మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు. హైపర్ టెన్షన్. వి.హెచ్.యస్ ఆస్పత్రిలో చేర్చాను. అదే విషయమై బాధగా ఉంది” అని చెప్పాను.

మణి అయ్యర్: “మంచి డాక్టరుకు చూపించావా?”
నేను: “చెప్పాను కదా వి.హెచ్.యస్ ఆస్పత్రిలో చేర్పించాను అని”

మణి అయ్యర్: “మరి వాళ్ళు ఏమి చెప్పారు?”
నేను: “ఆరోగ్యం బావుంది భయపడాల్సినది ఏమి లేదని చెప్పారు. కాని నాకు వాళ్ళ మాటలపై విశ్వాసం లేదు”

మణి అయ్యర్: “సార్ మీ సమస్య తీరేట్టు మిమ్మల్ని ఒక పెద్ద వైద్యుని దగ్గరకు తీసుకువెళ్తాను. వారిని చూడడంతోటే మీ అమ్మగారు బాగవుతారు”
నేను: “అలాగా? ఎవరు ఆ డాక్టర్? వారికి చూపిస్తే మా అమ్మకు నయమవుతుందా? వారు ఎక్కడుంటారు? వారిని ఎప్పుడు కలవొచ్చు? ఇప్పుడే మా అమ్మను తీసుకుని రానా?”
నా సమాధానంలోని ప్రశ్నలలో ఆ అమ్మ ఆరోగ్యం బాగుపడాలనే ఆరాటం, ఆత్రుత, ఉత్సాహం ఉన్నాయి.

మణి అయ్యర్: “మీ అమ్మగారు రావాల్సిన పనిలేదు. నువ్వు ఒక్కడివి వస్తే చాలు”
నేను: “మణి అయ్యర్! అనారోగ్యం నాకు కాదు, మా అమ్మకి. నేను వస్తే మా అమ్మకి ఎలా నయమవుతుంది? ఆ పెద్ద డాక్టరు మా అమ్మను పరీక్షించడా?”

మణి అయ్యర్: “అవసరం లేదు సార్. ఆ పెద్ద డాక్టరు కేవలం మిమ్మల్ని చూసినంత మాత్రం చేత మీ అమ్మగారి ఆరోగ్యం బాగవుతుంది”
నేను: కొంచం అపనమ్మకంతో ”నన్ను చూస్తే మా అమ్మ గారి ఆరోగ్యం బాగవుతుందా? అంతటి ఘనుడా? సరే అలాగైతే నేను ఇప్పుడే వస్తాను పదండి వెళ్దాం అతని దగ్గరికి”

(సశేషం)

#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం
28/09/17, 8:40:40 PM: ‪+91 80088 84529‬: పెద్ద డాక్టర్ (పార్ట్ 2)

మణి అయ్యర్: “ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళలేము. వారు కాంచీపురంలో ఉంటారు”
నేను: “కాంచీపురంలోనా? అంత పెద్ద డాక్టరు అక్కడ ఎందుకున్నారు? ఎవరతను? యమ్.బి.బి.యస్సా లేదా యమ్.డి నా?”

మణి అయ్యర్: “వారు ఆ డిగ్రీలకన్నా అతీతులు. వారు వైద్యులందరికి వైద్యులు. (వారింటి పూజగదిలోని స్వామివారి చిత్రపటం వైపు చూపిస్తూ) ఈ డాక్టరు గురించే నేను చెప్తున్నది”
నేను: పగలబడి నవ్వుతూ “ఏంటి మణి అయ్యర్! ఈయనా డాక్టర్? వైద్యులకు వైద్యుడా? ఏం మాట్లాడుతున్నారు? ఒక సన్యాసి డాక్టర్ ఎలా కాగలడు? ఏదో పూజలు పద్ధతుల గురించి ఐతే చెప్పగలరు కాని. కాని మీరేమో ఈయన్ని డాక్టర్ అంటున్నారు. ఈయన మా అమ్మ అనారోగ్యాన్ని బాగుచేయగలరా? అది కేవలం మీ భ్రమ మాత్రమే”

మణి అయ్యర్: “ఏంటి మీనాక్షిసుందరం! బ్రాహ్మణుల ఇంట పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నవ్?”
నేను: “ఐతే ఏంటి సార్! మొదట ఒక పెద్ద డాక్టరు వద్దకు తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇప్పుడు ఒక సన్యాసి వద్దకు తీసుకువెళ్తాను అంటున్నారు. ఇది ఎలా సాధ్యం?”

మణి అయ్యర్: “మీనాక్షిసుందరం, నీకు కావాల్సింది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడడం ఒక్కటే కదా? దానికి నేను పూచీ. మనం రేపే కాంచీపురం వెళ్తున్నాం సరేనా?”
నేను: “మణి అయ్యర్, మనం వెళ్తే నిజంగా మా అమ్మకు బాగవుతుందా?”

మణి అయ్యర్: “ఖచ్చితంగా! కేవలం వారిని దర్శించుకుని మీ తల్లి గురించి ప్రార్థించు ఆవిడకు నయమవుతుంది. నీకు మనఃశాంతి కూడా లభిస్తుంది”
నేను: “అలా అయితే సరే నేను కాంచీపురం వస్తాను. కాని అక్కడ మీరు నన్ను చొక్కా తీయమని, స్నానం చెయ్యమని, విభూతి-కుంకుమ పెట్టుకొమ్మని, నమస్కారం చెయ్యమని ఇలాంటివి నాకు చెప్పకూడదు. వస్తాను; వారిని చూస్తాను; మా అమ్మ గురించి చెప్తాను అంతే!”

మణి అయ్యర్: “ఏమయ్యా! రోజూ స్నానం చెయ్యవా? అప్పుడప్పుడు చొక్కా విప్పవా? ఎప్పుడూ విభూతి-కుంకుమ పెట్టుకోలేదా? అవన్నీ రేపు ఒక్కరోజు చెయ్యి. నీ వంశానికొచ్చిన సమస్యేంటి?”

మరుమాట్లాడకుండా సరే అన్నాను. మరుసటి రోజు నేను, మణి అయ్యర్, నా సహోద్యోగి తిరు వేంకటరామన్ ముగ్గురము కంచి బయలుదేరి ఉషోదయ వేళలో కంచి చేరుకున్నాము. సర్వతీర్థ కుళంలో స్నానం చేసి, విభూతి-కుంకుమ ధరించి, పంచకట్టుకుని నా జీవితంలో మొదటిసారి కంచి శ్రీమఠం ద్వారం వద్దకు వచ్చాము. నిజం! నాలో ఎదో తెలియని భావన, ప్రశాంతత కొంత ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

మేము మఠం లోపలికి వెళ్ళాము. ముందరి హాల్లో కంచి మహాస్వామివారు. పెద్ద డాక్టర్! కూర్చుని ఉన్నారు. ఒక బియ్యం బస్తాకి ఆనుకుని కూర్చున్నారు. వారి ముందు పళ్ళ బుట్టలు, పూలహారాలు ఉన్నాయి. స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడిఉన్నారు. మేము కూడా ఆ వరుసలో నిలబడ్డాము.

నాచేతిలో ఒక వెదురుబుట్ట అందులో కొన్ని పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు. సాలోచనగా సన్యాస చక్రవర్తి మహాస్వామివారిని చూశాను. అప్రయత్నంగా నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అవును నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. నేనెందుకు ఏడుస్తున్నానో కారణం తెలియదు.

ఆ పలికే దేవుడు నన్ను రమ్మన్నట్టు సైగ చేశారు. నేను చిన్నగా ప్రశాంతంగా దగ్గరకు వెళ్ళి నా చేతిలో ఉన్న బుట్టని అక్కడ పెట్టి నాకు తెలియకుండానే స్వామికి సాష్టాంగం చేశాను.

”మీరు అష్టసహస్రం అయ్యర్లా?” (తమిళ అయ్యర్లలో ఒక శాఖ. మన ఆరువేల నియోగుల లాగా)

“అవును”

“కరుకుడిలో(తిరువయ్యారు దగ్గర) ఉన్న శేషాద్రి, కుంజు నీకేమవుతారు?”

“వాళ్ళు మా పిన్నికి బంధువులు”

“తంజావూరు రాజభవనం రిసీవర్ మీ తాతగారు. సుందరం అయ్యర్ కు ముందా లేదా తరువాతా?”

నాకు తెలియదన్నట్టు తలాడించాను. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.

స్వామివారు తలెత్తి, ”మీ అమ్మని ఆస్పత్రిలో చేర్పించావు కదా? ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగారు

నేను ఇక్కడకు వచ్చిందే ఆ విషయం అడిగుదామని. అదే విషయం స్వామివారు అడుగుతున్నారు. దీనికి కూడా మౌనంగా రోదిస్తూ నిలబడ్డమే నా సమాధానం.

”దిగులుపడకు! మీ అమ్మగారు కోలుకుని తిరిగి వస్తారు“

అవును! ఆ పెద్ద డాక్టరు మా అమ్మ ఆయుష్షును మరికొంత పెంచారు. ఆ మహాత్ములు నావైపు కొద్దిసేపు తీక్షణంగా చూసి ప్రసాదం ఇచ్చి, “ఇది మీ అమ్మకు ఇవ్వు. తను ఆరోగ్యవంతురాలై ఇంటికి వస్తుంది” అని నన్ను ఆశీర్వదించారు.

ఈనాటికి నేను, నాలోని ఆజ్ఞానాన్ని పారద్రోలి నన్ను సరైన దారిలో పెట్టిన ఆ “పెద్ద డాక్టరు”కి తలవంచి నమస్కరిస్తాను. ’పెద్ద డాక్టరు” చెప్పినట్లుగానే మా అమ్మకు నయమై ఇంటికి తిరిగొచ్చింది. మా అమ్మను కాపాడింది వారే. ఈనాటికి వారు మమ్మల్ని సర్వదా రక్షిస్తున్నారు.

[తన తల్లి సదాచారపరాయణురాలు, భక్తురాలు కాబట్టి ఇతణ్ణి స్వామివారు ధర్మాచరణ వైపు తిప్పి, అతణ్ణి అతని వంశాన్ని కాపాడారు. మరి తల్లితండ్రులే నాస్తికులు, హేతువాదులు అయితే వాళ్ళ పిల్లల్నీ, ముందుతరాల్ని రక్షించేదెవరు? ఏ పుణ్యం అడ్డుపెట్టుకుని ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు?]

--- వి. మీనాక్షిసుందరం, సెక్రెటరి, హిందు ధర్మ మన్రం, చెన్నై-33. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం
28/09/17, 8:40:47 PM: ‪+91 80088 84529‬: Experiences with Maha Periyava: A Little Girl offered Water to MahaSwamigal!

Many years ago, Sri Maha Periyava was on His way to have darshan of Sri Nandeeswarar at Parangimalai, St Thomas Mount in Madras. Enroute He had darshan of Trisulanathar and Tripurasundari and then rested for a while under a fig tree (as He always walked, whatever be the distance).

He felt thirsty and so called out for one of His shishyas. But, since they were resting at a distance, no one heard it. Then, there appeared a Little Girl with water in a 'sombu' (a small vessel) and offered it to Him. He drank it and when He wanted to return the sombu, She was not be seen around any where. He asked every one, but no one had even seen Her.

Then He sat in meditation for a while and realised that the Girl was none other than Ambal herself. He called the village head and other people and told them to dig the place where He sat.They found the vigraha (idol) of Balambika and Chandikeshwari there!

He told them to install the vigrahas and thus came about the present day Sri Vidya Raja Rajeswari temple at Nehru Nagar, Pazhavanthangal, Nanganallur, Chennai!

The address is:
Nehru Colony 2nd St, Nanganallur, Chennai


27/09/17, 8:44:52 PM: ‪+91 91105 71415‬: *గతాన్ని వదిలివేయటానికి తొమ్మిది దశలు*

బాధాకరమైన బావోద్వేగాలను తీసుకు వచ్చే సంఘటనకు లేక ఏ వ్యక్తి మనకు వున్నప్పుడు ఈ తొమ్మిది ప్రశ్నలు అడగండి :

1. *నేర్చుకోవలసిన పాఠం ఏమిటి ?*

మనం నేర్చుకోవాలి అని ఆత్మ కోరుకుంటున్న పాఠాల కోసం చూడండి. అది మన సత్యాన్ని మనం చెప్పాలి అని వుండవచ్చు. స్వరపేటిక యొక్క వాపుగా కూడా అది  కనిపించవచ్చు లేక మన గొంతును మనం తరచుగా అణిచివేస్తున్నాము అని మనకు అద్దం పట్టే వారుగా  మనకు అనిపించవచ్చు. అతను లేక ఆమె మన ధ్యాసను పొందటానికి హద్దులు ఉల్లంఘించవచ్చు. ఈ ప్రవర్తన  స్వీకరించబడలేనిది అని మనం మన సత్యాన్ని చెప్పడంతో మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం వుంది. స్వీకరించలేని దాన్ని స్వీకరించడం అనేది చేసి ఏదో మనం పావనం అయ్యాము అని కాదు. అది (స్వీకరించలేని దాన్ని స్వీకరించడం అనేది)
సహజంగా పని చేసేది కాదు.

2. *ఒప్పందం ఏమిటి ?*

ఈ జన్మ తీసుకోబోయే ముందు, మన ఎదుగుదలకు సహాయం చేయడానికి మనతో సంకర్షణ జరిపే ప్రతి ఒక్కరూ మనతో ఒప్పందం చేసుకున్నారు. వారు మిమ్మల్ని అంచుకు తోసేయడానికి ఒప్పుకొని వుంటారు మరియు మనం వారికి అలాగే చేయవచ్చు. అడగండి, "నేను మరియు మీకు మధ్యన నటిస్తోన్న ఒప్పందం ఏమిటి ?" నాకు ఎన్నో మరణం వరకు వెళ్ళిన అనుభవాలు వున్నాయి మరియు అప్పుడు ఆత్మల లోకంలో వున్నప్పుడు, ప్రజలు ఒకరితో ఒకరు చేసుకునే విస్త్రుతమైన ఒప్పందాలను చూసి నేను విస్మయం పొందాను. వారిలో ఎంతో మంది, ఉత్ప్రేరక సన్నాహకాలుగా వుండటానికి ఎంతో ప్రేమతో ఒప్పుకున్నారు. మనం సమతులనంలో వున్నప్పుడు, అక్కడ ఎదుగుదల వుండదు కనుక మనం పాఠాలు నేర్చుకోవటాన్ని  కొనసాగించడానికి మనల్ని సమతులనం నుండి పక్కకు తప్పించమని విశ్వానికి అది ఒక సూచన. అలానే, ఊహించగల ప్రతి దారిలో పరీక్షించే విధంగా  సంబంధాలను మనం మన జీవితంలోకి లాక్కుంటాము.

ప్రజలు మార్పును ఇష్టపడరు మరియు అది సమంజసం కాని పరిస్థితి, అయినా కూడా, ఎంతో మంది దాన్ని నివారించడానికి ఎంత దూరం అయినా వెళుతారు. మారడాన్ని ఇష్టపడక పోవడానికి కారణం వారు మూలంతో వేరు అనే భావన పొందుతారు. వారు ఒంటరి అని మరియు సృష్టికర్త యొక్క రక్షణ నుండి పూర్తిగా తెగిపోతామేమో అని నమ్ముతారు. ఇతరులతో మన ఒప్పందాలను మనం అవగాహన చేసుకోవడం అనేది క్రైస్ట్ చెప్పినట్టు "కనపడేదాన్ని బట్టి తీర్పు చెప్ప కూడదు" అనే విషయాన్ని సాధించటానికి అది మనకు సహాయం చేస్తుంది. ఆయన ఏమన్నారంటే, మనం కష్టతరమైన అనుభవాల చింతలలో వున్నప్పుడు, వాటిని చూడకండి - వాటి వెనకాల చూడండి అని అన్నారు.

3. *పాత్ర ఏమిటి ?*

నేను బాదితుల పాత్రను పోషిస్తున్నానా ? చెడు వ్యక్తి యొక్క పాత్రను పోషిస్తున్నానా ? బోధకుడి పాత్రనా ? ఈ ఒప్పందంలోపల నేను పోషిస్తున్న పాత్ర ఏమిటి ?  ఉదాహరణకు, మన జీవితంలో మనకు ఒక కౄరమైన వారు వుండవచ్చు. అది మన జీవిత భాగస్వామి, తల్లి లేక యజమాని కావచ్చు. ఒకసారి మీరు నిర్ధారించుకున్నాక, ఆ వ్యక్తి యొక్క పాత్రతో మన సంబంధం ఏమిటి. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం అని మన పాత్రను మనం మార్చుకోవచ్చు అని గుర్తుంచుకోండి.

4. *ఇక్కడ అద్దం పట్టేది ఏమిటి?*

కింద ఇవ్వబడ్డ ఏదో ఒక విషయం చేయడానికి మనం మన జీవితాలలోకి సంబంధాలను లాక్కుంటాము; మనలోని అంశానికి వారు అద్దం పడతారు, మనం ఏమి ఇచ్చేసాము, అంటే ఇంకా మనం అభివృద్ధి చెందని వాటి పట్ల మనం మన తీర్పును ఇస్తున్నాము. మన అమాయకత్వం వెళ్ళిపోతే, మనల్ని మనం ఒక యుక్త వయస్సు వ్యక్తిని ఆకర్షించడాన్ని కనుక్కుంటాము. మనం మన సమగ్రతను ఇచ్చివేసి వుంటే, మన దృష్టిలో సమగ్రతకు ప్రాతినిధ్యం వహించే ఒక మిషినరీతో  (ఆధ్యాత్మిక సంస్థతో) మనం ప్రేమలో పడతాము.

ఇక్కడ అద్దం పట్టే ఇంకొక విషయం ఏమిటంటే మనం తీర్పు చెప్పే విషయం. అపద్దాలు చెప్పే వ్యక్తుల ద్వారా మనము సమస్యలు పొందుతూవుంటే, వారి మీద మనం మన తీర్పును పెడుతున్నాము మరియు మనం అపద్దాలు చెప్పే వారిని ఆకర్షిస్తాము. ఒక పురుషుడు తనలోని స్త్రీ తత్వాన్ని సరిగ్గా తెలుసుకోకుంటే, అప్పుడు ఆయన సంపూర్ణత్వాన్ని అనుభూతి చెదటానికి తన స్వీయ స్త్రీ తత్వంతో ఎక్కువగా వుండే స్త్రీని ఎంచుకోవచ్చు. తరువాత, నీళ్ళ పైపు కారితే ఆ పరిస్థితిని ఎలా నిర్వహించాలో తనకు  తెలియదు కాబట్టి,  వారాతరాలలో తాను సిటీని వదిలి వెళ్ళలేక పోతున్నందుకు ఆయన విసుగు చెందుతాడు. ఆయన తన అభివృద్ధి చెందని స్త్రీ తత్వాన్ని ఇక్కడ తాను  ప్రతిబింబిస్తున్నాడు అని స్వేచ్ఛగా గుర్తించడాన్ని ఎంపిక చేసుకోకుంటే ఈ చిన్న చిన్న విసుగులు ఆగ్రహావేశాలను నిర్మిస్తాయి.

5. *బహుమతి ఏమిటి ?*

మనం ఆకస్మికంగా కలిసే ప్రతి వ్యక్తి మనకు బహుమతిని అందివ్వడానికే వచ్చారు. ఇది ఎంతో సాధారణంగా పొందగలిగే వాటికి కూడా వర్తిస్తుంది. అడగండి, "ఈ వ్యక్తి నుండి నేను ఏ బహుమతిని పొందబోతున్నాను ? అది బేషరతు ప్రేమను అందించడం లాంటి ఎంతో సరళమైన విషయం కావచ్చు, లేక ఇతరులు ఎవ్వరూ వారిలో చూడని అందమైన విషయం మనం గుర్తించవచ్చు. లేక ఎన్నో ఏళ్ళలో మొదటి సారిగా ఆ వ్యక్తి చెప్పేది మనం స్వచ్చంగా వినవచ్చు. ఇంకొక సారి మనం కోపాన్ని వెలగకక్కే స్త్రీని ఎదుర్కోవచ్చు మరియు ఆ సంఘటన పట్ల మన స్వామి తత్వాన్ని ప్రదర్శించే అవకాశం పొందవచ్చు.

గమనిక : రాబోయే నాలుగు ప్రశ్నలు మొదటి ప్రశ్నల యొక్క సమాధానాల పట్ల మన వైఖరులను వివరిస్తాయి.

6. *నేను అనుమతించవచ్చా ?*

దేన్ని అనుమతించవచ్చు, దేన్ని మార్చాలి మరియు ఆ పని చేయడానికి కాలసిన ధైర్యాన్ని కనుక్కోవడం  అనేవాటిని తెలుసుకునేటందుకు వున్న విషయం ఇది. మిమ్మల్ని మీరు నదిలోని నీటిగా ఊహించుకోండి. మీ ముందర ఒక రాయి వుంది, మీరు ఇక్కడ ఆగిపోతారా లేక దాని చుట్టూ ప్రవహిస్తారా ? మీ జీవితంలో ప్రతి సంఘటనను పూర్తిగా నేర్చుకున్నారు - రాయిని కూడా - అప్పుడు దాన్ని ఆ క్షణానికి అనుమతించవచ్చా ? ఈ యుద్ధం మనదేనా ? పందెం తెచ్చుకోవడానికి విలువైనవిగా వున్నప్పుడు మాత్రమే యుద్ధాన్ని పోరాడాలి. పాఠం మీరు ముందే నేర్చుకొని వుంటే, మళ్ళీ యుద్ధం చేయాల్సిన పనిలేదు.

7. *నేను స్వీకరించవచ్చా ?*

మనకు జరిగే బాధాకరమైనవి వాటి వెనకాల దాగివున్న పరిపూర్ణతను చూసేంత వరకు మనం వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదు. కావలసినన్ని జీవితాలు జీవించి మనం  పరిపూర్ణం అయ్యేంత వరకు జన్మల తరువాత జన్మలలో మనం ఎన్నో బాధలకు లోనయ్యే పునర్జన్మ చక్రం మీద మనం వున్నాము అనేది  సాధారణంగా అందరికీ వుండే నమ్మకం. భగవంతుడు మనల్ని సృష్టికర్త యొక్క సామర్థ్యంతో వుండేలాగ పరిపూర్ణంగానే  సృష్టించాడు. గుర్తుంచుకోండి, ఆలోచనలు మరియు బావోద్వేగాలు కలిసి వాస్తవికతను సృష్టిస్తాయి. హృదయం ఒక మైక్రోఫోన్ లాంటిది. కనుక మన హృదయం యొక్క బావోద్వేగాలు ఎంత బలంగా వుంటే, మన కోరికలు వాస్తవరూపం దాల్చటానికి విశ్వం అంత బలంగా స్పందిస్తుంది. కానీ విశ్వానికి వివక్ష లేదు; మీరు ఆలోచించింది సకారాత్మకమైనదైనా లేక నకారాత్మకమైనదైనా విశ్వం వాస్తవీకరిస్తుంది. సంఘటనను మనమే సహ - సృష్టించాము అని మనం అంగీకరించాలి, అప్పుడు మనకు జరిగిన విషయాల పట్ల మన అనుభూతులను అది తొలగిస్తుంది.

8. *నేను విడుదల చేయవచ్చా ?*

విడుదల చేయడం అంటే ఒక సంఘటన లేక వ్యక్తి చుట్టు వున్న శక్తిని వదిలివేయడం. మనం విడుదల చేయక పోతే, దాన్ని మన ఆలోచనల శక్తిని ఆహారంగా ఇస్తూ మనమే దాన్ని జీవంతో వుంచుతాము. (కన్నిసార్లు సృహ లేకుండా). అతను లేక ఆమె మనల్ని ఏదో ఒక రకంగా బాధపెట్టి వుంటే కూడా మనం మన భాగస్వామితో విబేధంలో వుంటే, ఆ దశల ద్వారా మళ్ళీ వెళ్ళి వాటి యొక్క అంతరార్థాన్ని పొందడమే ఉత్తమైన మార్గం. తరువాత దృష్టి కేంద్రీకరించడాన్ని ఏదైనా సకారాత్మకమైన విషయాలకు మర్చడంతో దాన్ని విడుదల చేయండి. మనల్ని బంధించి వున్న తాడు మనం తెంచేసేంత వరకు ఆ వ్యక్తి ఒక పిశాచిలా మన శక్తిని పీల్చేస్తుంది. ప్రతిసారి మనం ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు, అతను లేక ఆమెకు ఆశీర్వాదాలను పంపండి, మరియు అప్పుడు ఆ తాడు యొక్క పని పూర్తౌతుంది.

9. *నేను కృతజ్ఞతాభావంతో వుండవచ్చా ?*

అన్ని తొమ్మిది దశల నుండి మనం  వెళ్ళినప్పుడు మరియు నిజంగా కృతజ్ఞతను అనుభూతి చెందితే అంతరార్థాలు పొందినట్టే, అది చైతన్యాలను ఉన్నతీకరిస్తుంది.  కృతజ్ఞత అనేది మూడు ఎదుగుదల వైఖరులలో ఒకటిది మరియు అది ముగిసే దశ. మనం నిజమైన కృతజ్ఞతను చేరుకుంటే, అది మనల్ని మన ఉన్నత కాంతి దేహాలతో అనుసంధానం అవ్వడానికి తోడ్పాటును అందిస్తుంది మరియు కష్టాలను అధిరోహణ పనిముట్లుగా మారుస్తుంది.

మొదటి ఎనిమిది దశలను మీరు పూర్తి చేసి వుంటే, మరియు కృతజ్ఞతను అనుభూతి చెంది వుండకుంటే, దయచేసి మళ్ళీ వెనక్కు వెళ్ళి అవన్ని మళ్ళీ చేయండి. మనం బహుమతులను, అద్దాలను మరియు విలువైన పాఠాలను చూసినప్పుడు, మన జీవితంలోని ప్రతిదానికి మనం కృతజ్ఞతతో వుండాలి. పాఠాలు పెద్దవి అయినా కూడా, యుద్ధం లో పాల్గొనాల్సి వచ్చినా, అత్యాచారానికి గురైనా, లేక అనాధగా మిగలాల్సిన పరిస్థితి వచ్చే పెద్ద పెద్దవి అయినా కూడా, ఉన్నత దృక్కోణం నుండి వాటిని చూసినప్పుడు అది మనకు పాఠము లేక బహుమతే. ఇంకా మనం పిల్లలుగా వున్నప్పుడు అత్యాచారానికి గురైనా కూడా, దాన్ని మనం అధిగమించినప్పుడు భూమి కూడా దీనికి గురి అయ్యింది కాబట్టి మనం దాని యొక్క ప్రకంపనలను కూడా ఉన్నతీకరిస్తాము. ఇంకా, మనలో ఏ ఒక్కరు అధిగమించినా, తరువాతి వ్యక్తికి ఇది ఇలాగే చేయడానికి సులభతరం అవుతుంది
28 Sep at 12:54 PM

28/09/17, 9:15:33 AM: Yes Pk: 🌻🌹🌻శ్రీ  దుర్గాష్టమి.🌻🌹🌻

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.

అష్టమికి ఉన్న ప్రత్యేకత ఎమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి అంటే, కొన్ని ప్రత్యేకమైన తిధులు ఉన్నాయి...అవి అష్టమి,నవమి,చతుర్దశి, అమావాశ్య,పౌర్ణమి, ఈ తిధులను పంచమహాపర్వములు అని అంటారు, వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్ధము.ఈ తిధులలో అరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది. కాని శరన్నవరాత్రులలో సప్తమి తో కూడిన అష్టమి పనికిరాదు. సూర్యోదయానికి అష్టమి తిధి ఉండాలి.

అశ్వినస్య చితాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి
భద్రకాళి సముత్పన్నా పూర్వాషాడః సమాయుతే
తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయగ్న వినాసిని
ప్రాతుర్భూతా మహాఘోర యోగిని కోటివిస్సః

ఆశ్వియుజ శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్ర కాళి రూపేణ ఆవిర్భవించింది.

భద్రకాళి అంటే దక్షయగ్న వినాసనం కోసం, శివుని జటాజూటం నుండి వీరభద్రుని తో పాటు ఉద్భవించినటువంటి అమ్మ ! నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.

అష్టమి , నవమి తిధుల యందు అమ్మని దుర్గ గా , కాళి స్వరూపేణ పూజలు అందుకుంటుంది

సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ....దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ..

కామ బీజ స్వరూపిణి మహాకాళిగా, మాయా బీజ స్వరూపిణి మహాలక్ష్మిగా, వాగ్బీజ స్వరూపిణి మహాసరస్వతిగా దుర్గాదేవిని ధ్యానిస్తూ షట్కోణ సంయుక్తా అష్టదళ పద్మ - చతుద్వింశతి పత్రక - భూగృహ సమాయుక్త......ఇలాగ దుర్గమ్మను ధ్యానిస్తూ ఆరాధన చెయాలి.

సాలగ్రామములో కాని, మంగళకలశములో కాని, శ్రీ చక్రయంత్రములో కాని, దేవి ప్రతిమలో గాని, బాణ చిహ్నములో కాని, సూర్యుడిలో కాని....ఇలాగ ఎవరి ఆచారవిధానములబట్టి.....అమ్మ ని ఉపాసన చేయాలి.

జయాది శక్తియుతమైన పీఠములో దుర్గాదేవిని నిలిపి తూర్పు కోణములో సరస్వతి సమేత బ్రహ్మను, నైఋతి కోణములో లక్ష్మి సమేత మహా విష్ణువుని, వాయువ్య కోణములో పార్వతి సమేత పరమేశ్వరుడిని, దేవికి ఉత్తరముగా సింహాసనము, దక్షిణముగా మహిషాసురుడిని నిలిపి అర్చన చెయ్యాలి.

అనంతరం అష్టదళాలలో వరుసగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారహి, నారసిమ్హ, ఐంద్రి, చాముండికా రూపాలని ఆహ్వానించి అర్చన చెయ్యాలి.

దుర్గా స్తోత్రములు, అష్టొత్తరముతో పూజించాలి.

ఇలాగ మన శక్తి మేరకు అమ్మని పూజించి, ఆవిడ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి....

అమ్మని ఆరాధించడం వల్ల సర్వరోగాలు, సర్వ భయాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ధైర్యం వృద్ధి చెందుతుంది. దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి..

శ్రీ దుర్గా దేవ్యై నమో నమః
28 Sep at 12:55 PM

28/09/17, 7:19:40 AM: ‪+91 98660 49721‬: దశరా నవరాత్రులలో ఎనిమిదవరోజు మహాగౌరి అవతార విశేషాలు

(8) మహాగౌరి

శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||       
ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగిఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. ఈమె వాహనము వృషభము

చక్కెర పొంగలి

కావ లసిన పదార్థాలు:--

బియ్యం -- 2 కప్పులు
వేయించిన పెసరపప్పు -- 1/2 కప్పు
బెల్లంకోరు -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు
తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం, పెసరపప్పు కలిపి కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, బెల్లం అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, చక్కర పొంగలిలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని చక్కెర పొంగలి రెడీ.