Friday, July 20, 2018

NINE LEAVES bILWA dALAM

Sri Padmavati Thayar

A rare and great darshan of Sri Padmavati Thayar of Tiruchanur. Sri Alarmemangai Thayar decorated with Complete lotus. 
#PadmaPriye_Padmini_Padmahasthe.
...Namo Namaha👇

sarabha salvudu




చమత్కార చాటువు.

చమత్కార చాటువు.

"నారీ లలామ నీ పేరేమి చెపుమన్న 
వామాక్షముం జూపి పలుకకుండె 
మత్తేభయాన ! నీ మగని పేరేమన్న 
దన చేత జీర్ణ వస్త్రంబు జూపె 
వెలదీ! నీ కేమైన బిడ్డలా? చెపుమన్న 
గరమొప్ప మింటి చుక్కలను జూపె 
కుటిల కుంతల నీదు కులము నామంబన్న 
బంజరంబున నున్న పక్షి జూపె 
ప్రభువు మీకెవ రన్న గోపకుని చూపె 
ధవుని వ్యాపార మేమన్న దండ మిడియె 
చతుర మతులార !ఆ ప్రౌఢ జాణ తనము 
తెలిసి కొనరయ్య బుద్ధి కౌశలము మెరయ ."

కుచేలుని భార్య వామాక్షీ. ఆవిడని మీ పేరేమిటి?ఎంతమంది పిల్లలు? మీ వారేంచేస్తుంటారు? అని అడిగితే 
ఆవిడా పండిత తనయ. నోరు మెదపకుండా సమాధానం ఇచ్చింది ఆ తల్లి.

ఆమె పేరు వామాక్షి .కనుక పేరడిగితే వామ ..అక్షం(ఎడమ కన్ను) చూపింది .మగని పేరు కుచేలుడు ..(జీర్ణ =వస్త్రం కలవాడు ).అని చినిగిన వస్త్రాన్ని చూపించింది .పిల్లలో ...లెక్కపెట్ట లేమని చుక్కలను చూపింది .(గంపెడు సంతానం,నక్షత్రాలు కదా! కుచేలునికి 27 మంది సంతానం అని చెప్తారు ) .ఏ కులం? అంటే ...ద్విజులము అని పక్షులను చూపించింది (బ్రాహ్మణులము) ..పక్షులూ ద్విజన్మలు కలవే .మీ ప్రభువు ఎవరు?...గోపాలుడు (గోవులను కాచేవాడిని చూపించింది) ..వ్యాపారం ఏమిటి?(ఏమిచేస్తుంటారు?) 
దండం పెట్టి, అంజలి ఘటించి భిక్ష (మధూకర వృత్తి) వేడడం అని సూచించింది.
ఎంతైనా బ్రాహ్మణ ఆడపడుచు. గుట్టు విప్పలేదు.రట్టు చేయలేదు.కృష్ణ భక్తురాలు.మహాసాధ్వి.

No comments:

Post a Comment