Sunday, November 3, 2019

ధర్మ సందేహాలు

*ఆకాశ దీప ప్రాముఖ్యం,  వాటి పరమార్థం వివరణ*

         ధర్మసింధు ప్రకారము కార్తీకమాసములో ఆకాశదీప ప్రజ్వలనము, దానము
చెయ్యాలి. సూర్యాస్తసమయములో  ఇంటి సమీపములో మేడి కర్రను చెయ్యెత్తు పొడవుగల దానిని పాతి, దానిపైన అష్టాగళాకారములో దీప యంత్రాన్ని నిర్మించాలి. దాని మధ్యలో ప్రధాన దీపమును, దాని చుట్టూ ఎనిమిది దీపాలను
వెలిగించి, భక్తితో ఈ మంత్రాన్ని పఠంచాలి:

*దామోదరాయ నభసి తులాయాందోళయా సహ*
*ప్రదీపంతే ప్రయచ్చామి నమో అనంతాయ వేధసే!*

           అనంతుడు సృష్టికర్త అగు శ్రీవిష్ణువునకు అంతరరిక్షములో ఉయ్యలూగే దీపమిచ్చితిని అని దీని అర్థము. ఇలా కార్తీకమాసములో చేస్తే అన్ని రోజులు ఆకాశదీపమిస్తే మహా సంపద కలుగుతుంది‌.

*ఏకత సర్వ దానాని దీపదానం తథైకతః*
*కార్తీక దీప దానస్య కలాం నార్హంతి షోడశీం*

       అంటే ~ *అన్ని దానములు కలసి దీపదానానికి సమానము కావు.* *కార్తీక మాసములో దీప దానానికి దీటైన దానము లేదు.  ఈ మాసములో శివాలయాలలోనూ, విష్ణ్వాలయాలలోనూ ఆకాశదీపాలనెత్తడము ఆచారము. దీపాన్ని పెడితే జ్యీతి స్వరూపుడైన దైవాన్ని కొలిచినట్లే! అది* *పరమార్థము. కనుక కార్తీకమాసంలో కార్తీక దీపాలను వెలిగించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులవుదాము!*

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~
మారేడు..గొప్ప తనం..

మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు.

ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.

పూజలు, పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వ పత్రం ప్రధానమైంది, శ్రేష్ఠమైంది. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది.

దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.

బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వృద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.

ఇప్పుడు మారేడులోని ఏయే భాగాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

--> బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు.
--> మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది.
--> మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది.
--> ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది.
--> మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.
--> బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి.
--> ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం.Forwarded by chakravarthy B


*ఈషణ త్రయం అంటే ఏమిటి?*

        *దారేషణ ~ పుత్రేషణ ~ విత్తేషణ* ~~ ఈ మూడూ కలిపి ఈషణత్రయమని అంటారు.

*దారేషణ* ~~ తనకు అన్ని విధాలా నచ్చి, తాను చెప్పినట్లు నడుచుకునే భార్య  కావాలనుకోవడము దారేషణ. ఇదే విధంగా తనకు రాబోయే భార్య కూడా                                     ఆశిస్తుందనే  ఇంగితము మగవాళ్ళకు కూడా ఉండాలి.  మంచి భర్త/భార్య‌ దొరికితే జీవితములో 50% విజయా‌న్ని సాధించినట్లే!

*పుత్రేషణ* ~~ వివాహమైన తరువాత వంశం, పేరు నిలబెట్టే పుత్రుడు కలగాలనే తపన; పున్నామ నరకము నుండీ తప్పించే వాడే కదా పుత్రుడంటే!

*విత్తేషణ*~~  ఇది అ‌న్నింటికన్నా ప్రధానమైనది.  *ధనమూలం ఇదం జగత్*
ధనాన్ని సంపాదిస్తే కదా అధికారము, పదవి, హొదా, కీర్తికాంత ~ అన్నీ కరతలామలకం అవుతాయి.

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~

Saturday, November 2, 2019

5th day Ganarchana 2.11.2019

























_*శివమంత్రాన్నే మృత్యుంజయ మంత్రమని ఎందుకంటారు ? దోసపండుకు, మృత్యువుకు సంబంధమేంటి ?*_

*ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /*
*ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //*

అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!

ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధం ఏమిటి? .

_*What is the proper way to chant Maha Mrityunjaya Mantra ?*_

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?

ముందుగా ఉర్వారుక, అంటే,  దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ. ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది. ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -

శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

*పంచభూతాత్మకుడు :-*

శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

*త్రయంబకుడు :-*

శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

*నామము :-*

శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.

*విభూతిదారుడు :-*

సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

*త్రిశూలం :-*

సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.

*నాగాభరణుడు :-*

సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

శివుణ్ణి *బోళాశంకరుడు* అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.

శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.

తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది.

మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను.

ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం.

(Forwarded as received)


కృతజ్ఞత.....

“కృతజ్ఞత ”అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది నాగరిక సంస్కారం...

వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. సీతమ్మను అపహరించుకొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు. రావణసంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం.. ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.

మహా భారతంలో.. దగ్ధమైన లాక్షాగృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్నకుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో .. “ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం” అంటుంది.

“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”.. అనే చందంగా కాకుండా, మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే -అతనియందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత ఔతుంది. ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.

ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. ఆ చెట్టే ఆశ్రయంగా, దానితొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం దానిని వదలలేక దానిమీదనే ఉండిపోయింది. దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి.. "ఓ కీరమా! ఈ వృక్షం బెండువారిపోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, ఇంకా దీనినే అంటి పెట్టుకున్నావెందుకు..?" అని అడిగాడు.

అపుడాశుకం "ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అనిమిషనాథా!" అంది. తాను మానుషరూపంలో వచ్చినా "పురాకృత సంజనిత విశేషము" చేతనే ఈ మహా శుకం తనను ఇంద్రునిగా పోల్చుకో గలిగిందని ఆశ్చర్య పోయి.. "నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో" అన్నాడు ఇంద్రుడు. అపుడా మహాశుకం "ఈ వృక్షానికి మేలు చెయ్యి చాలు" అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.

ఈ కథవల్ల ఉత్తములైన ఆశ్రితులు, ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ , కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలుస్తోంది. సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు...

Forwarded by Surendra pss

*అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఎందుకు ?*

*మనం తినే అన్నం తదితర ఆహార పదార్థాలు మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం.*
           
అయితే........

*ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి*
*వడ్డిస్తున్నారన్న*
*విషయం కూడా చాలా*
*ముఖ్యమైనది.*

👉🏾  అందు వలననే పూర్వకాలంలో  మడి, ఆచారాల విషయంలో
 ఖచ్చితంగా వుండేవారు.

👉🏾  మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన
దోషాలు నిమిడివున్నాయి.

అవి.....
*అర్ధ దోషం*                *నిమిత్త దోషం*          
*స్ధాన దోషం*                   *గుణ దోషం*        
*సంస్కార దోషం*

*ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.*

🌸 *అర్ధ దోషం:*

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి , సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలో నే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది ,
ఆ మూటలో నుండి
కొంచెం డబ్బు తీసుకుని
తన సంచీలో దాచేశాడు.
తరువాత శిష్యుని వద్ద
 సెలవు తీసుకుని, తిరిగి
తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.
మరునాడు పూజా సమయంలో తను చేసిన
పనికి సిగ్గుతో పశ్చాత్తాపం
చెందాడా సాధువు.
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్ధం చేసుకున్నాడు. వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు.
 శిష్యుడిని   ఎలాటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని,
"నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో
సంపాదించని డబ్బు తో
కొన్న పదార్థాలతో , తయారు చేసిన  ఆహారం
భుజించడమే అర్ధ దోషం.
మనం న్యాయం గా సంపాదించిన దానితోనే ఆహారం తయారు
చేసుకుని , భుజించడం
ముఖ్యం.

*🌸నిమిత్త దోషం🌸*

 మనం తినే ఆహారాన్ని
వండేవారు కూడా మంచి మనసు కలవారైవుఇంటికి
వారు సత్యశీలత కలిగి
దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగిన వారిగా వుండాలి.  వండిన  ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు.
ఆహారం మీద దుమ్ము,
శిరోజాలు  వంటివి పడ కూడదు.

🌻 *అపరి శుభ్రమైన ఆహారం*

మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి  కలుగుతాయి.

భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద  ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.
వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించి
నప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు "అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో   వారిచ్చిన ఆహారం భుజిస్తూ  వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ
ఆ ఆహారం  తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా
బయటికి పోయి, నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.
నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను.
అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన  మనిషిలోని మంచి
గుణములు నశించి
'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.

*స్ధాన దోషం*

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో,
అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి.
వంట చేసే సమయంలో
అనవసరమైన చర్చలు
వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి , కోర్టులు , రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు.

దుర్యోధనుడు  ఒకసారి
యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి, విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు
చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడి అరటి పండుతొక్క  ఒలిచి,
పండు యివ్వడానికి బదులుగా తొక్కని  అందించింది.కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో
భుజించాడు.
ఇది చూసిన విదురుడు
భార్య వైపు కోపంగా చూశాడు.

కృష్ణుడు,  " విదురా!  నేను ఆప్యాయత తో కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను.
నిజమైన శ్రధ్ధాభక్తులతో యిచ్చినది అది
కాయైనా ,  పండైనా, ఆకైనా,  నీరైనా, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను.' అని అన్నాడు.

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో
వడ్డించాలి.

*🌻గుణ దోషం :*

మనం వండే ఆహారం
సాత్విక ఆహారంగా వుండాలి.
సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం
కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం .


*సర్వేజనాః సుఖినోభవంతు*

*శుభం భూయాత్*Forwarded by P Venugopal