Saturday, November 2, 2019
*Spiritual Seekers 🙏*
*రెండు వాక్యాల వేదాంతం.....*
త్రిపుటిలో నుండి, ద్విపుటిలో నుండి, బ్రహ్మ నిష్ఠ నుండి పరబ్రహ్మ నిర్ణయానికి మేల్కొల్పుతారు. అక్కడ చేయడానికి సాధన ఏమీ లేదు. కేవలం మేల్కొల్పు ద్వారా నీకా నిర్ణయాన్ని తెలియచేస్తారు. తురీయాతీతంలోకి మేలుకోగానే తురీయం లేనిదైపోయింది.
ఈ రకంగా 'స్వస్వామి సంబంధతః' ఎందుకు పుట్టిందయ్యా.. అంటే...
'శిష్యాచార్యతయాతథైవ పితృపుత్రాద్యాత్మ్రనాభేదత'. 'అభేదతః' గురుశిష్యుల ఐక్యతా సిద్ధి జరిగింది...
పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగానే ఏ స్వామినైతే ఆశ్రయించావో ఆ స్వామితో నీకు అభేదం వచ్చింది. అట్టి ఐక్యతాసిద్ధి చేత మాత్రమే పొందదగినటువంటి, గొప్పదైనటువంటి, శాశ్వతమైనటువంటి, మార్పు లేనటువంటిది ఆ పరబ్రహ్మ నిర్ణయం.
అట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని అలాగే పొందాలి.. 'ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు' ఇక. సాధనలన్నీ బ్రహ్మనిష్ఠ కంటే క్రిందే. 'సాధనలందు మరిగితే రాకు' అనే కందార్థం ఒకటుంది.
ఏ సాధనైనా నీకు చెయ్యాలని తోస్తే అయ్యో ఈ సాధన నేను చెయ్యలేదని తోస్తే ఎక్కడికి పోతావు.. మరల బ్రహ్మ నిష్ఠలోకి, మరల ఆత్మ నిష్ఠలోకి, మరలా జీవుడిగా వ్యవహరిస్తావు. మరల త్రిపుటిలో వ్యవహరిస్తావు. లేక ద్విపుటి అనేటటు వంటి పులినోట పడతావు.
కాబట్టి ఆ ఎరుక అనేటటు వంటి పులినోట పడమాక. "శిష్యాచార్య తయా తథైవ పితృ పుత్రా ద్యాత్మనాభేదతః". నాకూ మహానుభావు డైనటువంటి దేశికేంద్రుడికీ ఎట్టి భేదమూ లేదు.
'అభేదతః' కాలాతీతులైన దేశికేంద్రులయందు, నాకు ఐక్యతా సిద్ధి ప్రసాదించినటువంటి మహనీయుడి యందు నేను లేకుండా పోయాను. నేను లేనివాడను అని తనకు తాను ఎరిగి, తనని తాను తెలుసుకున్నవాడై తనను తాను పోగొట్టుకున్నాడు.
ఇంతేనయా... వేదాంతం అంతా రెండు వాక్యాలు.
"విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః"
"శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మ నా భేదతః"...
ఈ అభేద స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరావో, నీవు లేకుండా వున్నటువంటి స్థితికి ఎప్పుడైతే చేరావో, సర్వకాల సర్వత్రా, సర్వే సర్వత్రా ఉన్నది ఒక్క గురువు మాత్రమే. ఉన్నది పరబ్రహ్మమే, నేను లేనివాడను.
ఈ స్థితికి ఎప్పుడైతే చేరావో ఇప్పుడేముందటా.. మూడవ పాదంలో ఏం చెప్పాడు..
"స్వప్నే జాగృతి వాయ ఏష పురుషః"...
స్వప్నంలో వాడు ఎలా మాట్లాడుతున్నాడు.. సత్యమేనా వాడు మాట్లాడేది.. ఎప్పుడైనా కలలో మాట్లాడావా.. చిన్న పిల్లలు కలవరిస్తారా లేదా.. మనం కూడా కలవరిస్తాం. ఎప్పుడు.. ఆ బలమైన జ్ఞాపకం చేత ప్రేరేపించబడినప్పుడు...
By Surendra pss

Friday, November 1, 2019
🔱🙏వారణాసి పీఠస్థాన వివరములు: (వివిధ భైరవ రూపాలు)...🙏🔱
ఇక్కడ ఇవ్వబడ్డ వివరాలు అన్ని కాశీ లోని శివలింగం రూపాల్లో ఉన్న భైరవులు ఇవి చాలా వరకు భూగర్భంలో కలసి పోయింది , కొన్ని మటుకే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి ..మొత్తం వారణాసిలో 10,000 పైన శివలింగాలు భూగర్భంలో ఉన్నాయి వాటికి రక్షణగా ఈ బైరావులు ఉంటారు, కాలక్రమంలో కొన్ని దాడుల వలన చాలా ఆలయాలు భూమట్టంలో కలిసిపోయాయి అందువల్ల ఈ శివలింగ రూపంలోనే భైరవ రూపాలు నామాలు చాలా మందికి తెలియదు, అలాగే విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే కాస్మిక్ ఎనర్జీ శక్తి కేంద్రాలు ఒక్క కాశిలోనే 51 ప్రాంతాలు ఉన్నాయి వాటికి గుర్తుగా వినాయక పురాతన ఆలయాలు అక్కడ ఉన్నాయి..
కాశీ క్షేత్రం మహా మహిమాన్వితమైన నది ,ఇది శతకోటి యొగినులుతో పరివేష్టితమై యుండును.ఈ స్థానం మండాలాకార రూపముగా మాతృకా స్వరూపముగా విరాజిల్లుతుంది.కోటానుకోట్ల స్వయంభూలింగములు సాధకులకు అభీష్టములు నెరవెర్చుతుంది.. ఎక్కడ జపం చేసే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది, కాశీలో మరణించిన వారు శివుని రూపంలోనే కైలాసం చేరుకుంటారు అంటారు..అటువంటి కాశీ క్షేత్రంలో ఏ దిశలో ఏ రూపంలో భైరవుడు లింగ రూపంలో ఉంటారో ఇక్కడ వివరాలు తెలుసుకుందాము. బైరవుడి అనుగ్రహము ఆజ్ఞ లేకుండా కాశీలో అడుగు పెట్టలేరు... ఈ నామాలు చదివి భైరవుడికి నమస్కరించు కున్నా ఎన్నో భయాలు తొలగిపోతాయి ఆ స్వామిని తలుచుకున్నాను అంత అనుగ్రహం దక్కుతుంది.
పూర్వదిశయందు దశలింగములు ముఖ్యమైనవి కలవు.వాటిపేర్లు 1.జటిల 2.కాల 3.ఉన్మత్త 4.క్రోధరాజ 5.సదాశివ 6.దధీచినాధ 7.సువాశీ 8.ప్రమధేశ్వర 9.యఙనాధేశ్వర 10.అయితేశ్వర వల్లభ.
ఆగేయదిశలో 10 లింగములున్నవి. 1.వజ్రధర 2.మహాకాల 3.కపిలేశ్వర 4.పంచానన 5.యోగినాధ 6.ఘఘిరేశ 7.పినాకదృక్ 8.పశుపాల 9.క్షేమద 10.బ్రహ్మనాధ.
దక్షిణదిశలో 10 లింగములున్నవి. 1.వీరేశ్వర 2.శూలేశ్వర 3.సిద్దేశ్వర 4.శ్రీ పార్వతీశ్వర 5.గణనాదీశ్వర 6.శంభు 7.ప్రచండ 8.దక్షయఙహా 9.కామరాజేశ్వర 10.కామకలేశ.
పశ్చిమ దిశలో 10 లింగములున్నవి. 1.ఆరుణేశ్వర 2.యోగేంద్రేశ్వర 3.ఈశాన 4.అసురాంతకేశ్వర 5.త్రిశూలేశ్వర 6.వరుణేశ్వర 7.కాళేశ్వర 8.కామదాయకేశ్వర 9.కాలఙిరుద్రేశ్వర 10.భద్రేశ.
వాయువ్యదిశలో 10 లింగములున్నవి. 1.మహారుద్ర 2.వాతనాధ 3.రుద్రాత్మ 4.రౌద్రరూపక 5.రూపనాధ 6.హనుమాన్ 7.సూర్యేశ 8.వసుదేశ్వర 9.వాసుకీవల్లభ 10.సత్యపతి.
ఉత్తరదిశలో 11 లింగములున్నవి. 1.ఉత్తరాస్య 2.కుబేరేశ్వర 3.ఈశ్వర 4.పంచాధార 5.పరమేశ 6.పరహంస 7.ప్రభాకర 8.ఆనంతేశ 9.కామరక్ష 10.రత్నేశ్వర 11.ఉమాపతి.
ఈశాన్యదిశయందు 11 లింగములున్నవి. 1.ఈశ 2.వైశ్వానరేశ్వర 3.ఈశాన 4.మాయేశ 5.బటుకేశ 6.రామేశ్వర 7.కాలంతకేశ 8.విస్వామిత్రేశ్వర 9.మహాకామపురీశ్వర 10.సర్వరూపప్రకాశక 11.కామాఖ్యేశ్వర.
మండలములో క్రిందభాగమందు 13 లింగములున్నవి. 1.మృత్యుంజయ 2.మోక్ష 3.శివేశ 4.భైరవేశ 5.భూతనాధ 6.భూతకర్తా 7.క్షేత్రపాల 8.పరాపర 9.మృత్యుఘోషేశ్వర 10.కాలదమన 11.కౌశలేశ్వర 12.మునినాధ 13.వర్ణమాలి.
ఈ భైరవరూప రుద్రమూర్తులు 10వేలలింగములకు ప్రతినిధులుగా ఉన్నవి.పంచతత్వములతో సాధకులను రక్షించిచూ అభీష్టసిద్దినిచ్చుచున్నవి.
ఊర్ధ్వస్థానమున 13 లింగములున్నవి. 1.బ్రహ్మేశ 2.బ్రహ్మకులేశ 3.బ్రహ్మలింగ 4.విధీస్వర 5.బ్రహ్మాండభేదక 6.ఆత్మరామ 7.వక్రేశ్వర 8.బలీశ 9.భార్గవేశ 10.సదానందేశ్వర 11.హర 12.కృష్ణేశ్వర 13.రామనాధ.
కాశీనాధుడు అర్చించిన 12 మహావిద్యలు కలవు. 1.త్రిపురసుందరి 2.త్రిపుర భైరవి 3.భువనేశీ 4.అన్నపూర్ణ 5.మాతంగి 6.వింధ్యవాసిని 7.చినమస్తా 8.బగళాముఖి 9.త్రికూటా 10.పంచమి 11.కాళీ 12.తార.
ఇవి తంత్రోక్త పూజావిధానములో అర్చించిన సాధకుల అభీష్టములు నెరవేర్చ గలవు.
శ్రీ మాత్రే నమఃForwarded by Prasad

సత్త్వసంశుద్ధి.....
'సత్త్వం' అంటే అంతఃకరణం.. మనస్సు.
'శుద్ధి' అంటే కల్మషాలు లేకుండా స్వచ్ఛంగా ఉండటం.
'సంశుద్ధి' అంటే పూర్తిగ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండటం. ఇలా మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటే అది దైవీసంపద అవుతుంది. మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ప్రకాశం ఉండేది.
నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా.. కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి.
మనస్సు నిర్మలంగా ఉంటేనే బయటి ప్రవర్తన ఆచరణ పవిత్రంగా ఉంటుంది. బయటి ప్రవర్తన లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే పరమాత్మకు సమీపంగా నీ మనస్సు ఉంటుంది.
ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే నిరంతరము భగవత్ సంబంధమైన పూజాదికాలు, యజ్ఞ దాన తపస్సులు, శ్రవణం, సత్సంగం, గురుభక్తి, గురుసేవ, ఆధ్యాత్మిక సాధనలు ప్రీతితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో, రజోగుణ తమోగుణ ప్రాబల్యంతో ఉన్నట్లైతే అది ఆసురీ సంపదను పెంచి పరమాత్మకు దూరం చేస్తుంది...
Forwarded by Surendra pss
శివ వైభవమ్
కీకారణ్యం ! ఆకాశపు జాడ కనబడని, వెలుగురేఖ కూడా చొరబడలేని ప్రదేశం.
ఎత్తైన కొండల మథ్య చెట్లన్ని జడలు కట్టి కఠోర తపస్సమాథిలో ఉన్న యోగుల్లా ఉన్నాయి.
వాటి మథ్యలో శిథిలావస్థలో ఉన్న శివాలయం. గర్భగుడిలో తనకేమి పట్టని, తనని పట్టించుకోని నిర్వికారంగా “జగత్పిత లింగాకారంలో !
పానపట్టం చుట్టు చీమల పుట్టలు తాము తెచ్చుకున్న పదార్థాన్ని నైవేద్యం పెడుతున్నాయి.
పై కప్పు లేకపోవడం వల్ల వృక్షజాతుల కొమ్మలమీద నుంచి జాలువారుతున్న వర్షపు థారాపాత్ర లా అభిషేకం చేస్తున్నాయి.
చెట్లమీద దాచుకున్న తేనటీగలు మధురాభిషేకం చేస్తున్నాయి పైనుంచే.
“ ఆదిత్య కిరణం” దీపమైంది.
రేయి శశికిరణానికి పోటీగా "మిణుగురు " శివగురువుకి చిరుదీపమైంది.
అమావాస్యకి కూడా నీకు నేనున్నాను సుమా శివా! అంటూ! వాయువు మోసుకొచ్చే పుష్పజాతులు ఆయన శిరస్సుమీద స్థిరంగా
తలపక్కకి పెట్టినా చూపుమాత్రం తండ్రిమీదే కదా నందీశ్వరునికి ఆయనని ధ్యానిస్తూ !
ప్రాంగణంలో ని ఒరిగిన గంటను మ్రోగిస్తున్న శుకపికాలు. తీక్షణమైన వేడికి ఒరిపిడికి కాలిన చందనవృక్షాల సుగంథం థూపమైతే, ప్రజ్వలించిన దావానలం త్రినేత్రునికి హారతవ్వగా ఆయన ఎక్కడుంటే ఎలాఉంటే ఆయనకి జరుగుబాటుకి, వైభవానికి లోటేలా?
చాగంటి ప్రసాద్
9000206163
అనుయుక్తాలు : చంద్రుని 16 కళలు
షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు
ఆ 16 కళలు
1. అమృత. 2. మానద. 3. పూష. 4. తుష్టి.
5. సృష్టి. 6. రతి. 7. ధృతి. 8. శశిని.
9. చంద్రిక. 10. కాంతి. 11. జ్యోత్స్న. 12. శ్రీ.
13. ప్రీతి. 14. అంగద. 15. పూర్ణ.16. పూర్ణామృత.
చంద్రుడు దేవతలందరిలోకీ అందగాడు. చల్లని వాడు. పదునాలుగు లోకాల వారికీ ఇష్టుడు.
అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు దక్షప్రజాపతి కుమార్తెలు. వాళ్లందరూ అందగత్తెలే. వాళ్లందరినీ దక్షుడు చంద్రుడికిచ్చి వివాహం కావించాడు. చంద్రుడు వాళ్లందరినీ అనురాగంతోనే చూశాడు. కానీ, రోహిణిపైన మాత్రం కొంచెం ఎక్కువ స్నేహం కనబరిచాడు. అదిచూసి మిగతా వారు అసూయ చెంది, లోలోపల కుమల సాగారు. వారందరూ కలిసి పుట్టింటికి వెళ్లి తమ దౌర్భాగ్యాన్ని తండ్రితో చెప్పుకొని కంటనీరు పెట్టుకున్నారు.
దక్షుడు వారి పట్ల జాలిపడి, చంద్రుణ్ని తన ఇంటికి పిలిచి తన కుమార్తెలందరిపట్ల సమానమైన ఆదరం కనబరచవలసిందని హితవు చెప్పి పంపాడు. కానీ చంద్రుడు తన పక్షపాతాన్ని మానుకోలేకపోయాడు.
దక్షుడు ఆగ్రహం చెంది, అల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపించాడు. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయి. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారు.
లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారు. బ్రహ్మ చంద్రుడితో, 'సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు' అన్నాడు.
చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, 'వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు' అని వరమిచ్చాడు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయి. సకల ప్రాణులకూ సంతోషం కలిగింది.Forwarded by G Sheshamma

Subscribe to:
Posts (Atom)