Tuesday, January 23, 2018

16/01/18, 2:42:54 PM: ‪+91 79811 59026‬: వేదమంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

పీఠాదిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు వింటే చాలు మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.
మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు, అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటిగుడ్డుకి. ఇదే విధంగా వేదమంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్దతరంగాలు అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్దబ్రహ్మం మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. కొన్ని రేడియో తరంగాలు, కొన్ని AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV  తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు ఒక వాటి వాటి నిర్దుష్ట frequencyతో మనను చుట్టుముట్టి వుంటాయి. నేనొక రేడియో రిసీవర్ పెట్టుకుని ఆ స్టేషన్ కి ట్యూన్ చేస్తే ఆ తరంగాలు నా రేడియో నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. లేదా నా మొబైల్ నుండి నేను వాటిని డేటా గానో, ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలను. అటువంటి పరికరం నా దగ్గర ఉన్నప్పుడు వాటిని నేను సరిగ్గా రిసీవ్ చేసుకుని ఆనందించగలవాడను. వాటితో పాటు నాకు noise కూడా వస్తుంది. నా రిసీవర్ సరైనది కాకపోతే ఆ noise నా చెవులకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా నేను వినగా వినగా చిరాకు పుట్టి మానసిక ప్రశాంతత కోల్పోగలను.

ఎలా అయితే  ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి. ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి. ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొక్కిపెట్టి ఉంచుతాయి. తద్వారా కేవలం మన కర్ణావయవం ద్వారా కేవలం మంచికి సంబంధించిన frequency నా మెదడుకు అందిస్తుంది. తద్వారా నా బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. అదే మంత్రం మరిన్ని సార్లు నేనే చదవగలిగితే ఆ ఎనర్జీ నేనే తయారు చేసుకోఅలవాడను. మంత్రాన్ని కేవలం వినడం ద్వారా నా చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే అదే నేను ఉచ్చరించగలిగితే మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని నేను గ్రహించగలను. ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే నేనొక రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలనో అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది. అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో నేను కనిపెట్టి దాన్ని బయటకు విసర్జించి సంపూర్ణంగా నివారించడం అనేది నేనే మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపడం లాంటిది.

కేవలం ఉచ్చరించడం తో ఆగిపోతే అక్కడ వరకు లాభం. అన్నం కేవలం తిని ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమె కాదు కదా. అది జీర్ణం అవ్వాలి. అది జీర్ణం అయితేనే ఆ ఆహారం నాకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో నేను మరిన్ని పనులు చెయ్యగలను. అదే విధంగా కేవలం మంత్రోచ్చ్చారణతో ఆగకుండా ఆ మంత్రం ప్రయోజనం మీద మనం ధ్యానం చెయ్యగలిగితే ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది. తద్వారా నేను మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాను. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః”. మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది. ఇక నిధిధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి నీకే కాదు నీ చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది. మన కర్మలవలన లోకశాంతి ఆశిస్తే ఆ లోకంలో నువ్వు ఒక వ్యక్తివి కాబట్టి నీకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతనధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది. నువ్వు చెప్పే అష్తోత్తరంలో నీ నక్షత్ర పాదానికి ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27నక్షత్రాల x 4పాదాలకు చెందిన లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించేవిధంగా మనకు 108 నామాలు జపించమని, లేదా మంత్రం కనీసంలో కనీసం 108 జపించమని కండిషన్ విధిస్తుంది శాస్త్రం. ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతనం.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ  వేంకటేశ్వరార్పణమస్తు !!
16/01/18, 4:12:39 PM: ‪+91 94408 97850‬: 🕉🕉🕉🕉🕉🕉

* ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే …. ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 -620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలు గా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది .

🌸* నిర్మాణ సోయగం :-🌸

ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిథా కృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి జోహార్లు ప్రతి యాత్రీక భక్తుడు వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతిఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోతున్నారు.

💐* మొదటి అంతస్తు :-💐

క్రింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ద సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గము , విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది.

💐* రెండవఅంతస్తు :-💐

రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతి గా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి.

* మూడవ అంతస్తు లోకి మెట్లమార్గం

💐చారిత్రక నేపథ్యం :-💐

ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయము. సాథారణం గా బౌద్ధ ,జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాథికారిగా పనిచేసిన మాథవరెడ్డి చేత ఈ అనంత పద్మనాభుని గుహాలయము నిర్మింపజేసినట్లుగా చెప్పబడుతోంది.

రెండవ అంతస్థుకు వెళ్ళే మెట్లమార్గం ప్రక్కనే ఉన్న కొండపై శాసనం ఒకటి శిథిలమై కన్పిస్తోంది. ఇక్కడ నుండి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించేవారని జనశృతి. ఈ విషయాన్ని “మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి” అనే వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. రాజులు యుధ్ధసమయాల్లో శతృరాజులకు తెలియకుండా సైన్యాన్ని ఈ సొరంగమార్గం ద్వారా తరలించేవారని ఒకరు వ్రాశారు. కాని ప్రస్తుత కాలంలో దాపురించే వివిథ ప్రమాదాలను నివారించడానికిగాను అథికారులు ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు.

🌸* శాసనం🌸

మూడవ అంతస్తు :- మూడవ అంతస్థులోనికి వెళ్లడానికి గుహను అందగా తొలిచి మెట్లమార్గాన్ని నిర్మించారు. మెట్లను మలిచిన విధానంలోనే ఈ అంతస్థు ప్రత్యేకతను ప్రకటించారు శిల్పులు. ఈ గుహాలయంలోకి ప్రవేశించడమే ఓ వింత అనుభూతిని కల్గిస్తుంది. రెండు వరుసల స్థంభాల మథ్యలో విశాలమైన మండపము విశ్రాంతిమండపంగా భక్తుల్ని ఆహ్వానిస్తుంది. ఆ స్థంభాలపై దశావ తారాలు, వివిథ దేవతామూర్తుల శిల్పాలు కొలువు తీరి చూడగానే పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం.

* మహా గణపతి

లంబోదరుని సహస్ర రూపాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పం లో దర్శింపజేయడం నాన్యతో దర్శనీయం.

🌸* ఉగ్రనరసింహుడు :-🌸

ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితో పాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి.

* శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి

స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు.

🌸* కుడ్యశిల్పం🌸

మరొకస్థంభం మీద కన్పించే శిల్పం ఉగ్రనరసింహుడు. ఇందాక చూచిన రెండు శిల్పాల కంటే పూర్తి వైవిథ్యం కల్గిన మనోహర శిల్పం ఇది. హిరణ్యకశిపుని సంహరిస్తున్న నరసింహునిలో మహోగ్ర రూపాన్ని చూస్తాం. కాని ఈ నారసింహుని వదనంలో ఒక మహోన్నతమైన ఆనందాన్ని ఎంత స్పష్ఠంగా ఆ శిల్పి చెక్కాడో మనం గమనించ వచ్చు. ఉగ్ర నరసింహుని ముఖంలో ఆనందాన్ని చూపించడానికి కారణం ఆ శిల్పి గొప్ప దైవభక్తుడు, ఉపాసనాపరుడై ఉండాలి. హిరణ్యకశిపుని సంహరించడం వలన తన ప్రియభక్తునికి విమోచనం కలిగించాననే ఆనందం ఆ పరమాత్మకు కల్గిందనేది ఆ శిల్పి భావన. అందుకే ఆ ఉగ్రమూర్తి ముఖంలోని ఆనందాన్ని అంత స్పష్టంగా ప్రదర్శింపచేశాడో.

ఆ ప్రక్కనే కన్పించేది వామనావతార ఘట్టం

వామనావతార ఘట్టము

మరొకస్థంభం మీద రూపుదిద్దుకన్నది హనుమత్సందేశం

హనుమత్సందేశ ఘట్టం

ఆ కొండ లోపలి గూడులో అంజనీసుతుడు.

🌸* శ్రీ అనంతపద్మనాభస్వామి :-🌸

మూడవ అంతస్తు చివరి మందిరంలో కొలువుతీరి ఉన్నాడు శ్రీ అనంతపద్మనాభుడు. చూడటానికి రెండు కళ్లు చాలవనేది మనలో మాట. నల్లని గ్రానైటు లో ఏకశిలా నిర్మితమై. పద్మపత్ర విశాలాక్షుడై, అనంతశయనుడై, పద్మనాభుడై, గగనచరులైన దేవతలందరూ ఆనందంనాట్యం చేస్తుంటే, జయ-విజయులు పాదాల చెంత కర్తవ్య పాలనలో ఉండగా, మహర్షులు తపోమగ్నులై యుండగా, ఆకాశంలో గరుడుడు నాట్యం చేస్తుంటే, దర్శనమిస్తున్నాడు శ్రీ అనంతపద్మనాభస్వామి. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి తరించవలసిందే కాని వర్ణింపవలవికాదు. ప్రతిరోజు పూజారి గారు ఏడున్నరకు వచ్చి తొమ్మిదింటి దాక ఉంటారట. శనివారంనాడు దూరప్రాంతాల నుండి కూడ భక్తులు వస్తారు. భక్తులు చల్లే పసుపుకుంకాలతో ”నల్లనయ్య” రూపం ఎర్రగా మారిపోయి, ఎర్ర గ్రానైటుతో చెక్కిన శిల్పంలా కన్పిస్తోంది

* నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మ

శ్రీ పద్మనాభుని మందిరంలోని సమస్త దృశ్యాన్ని ఒకేసారి మనం చూడగలిగితే, స్వామితో పాటు పద్మోద్భవుడైన బ్రహ్మ, ఆనందంలో సురేశుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో ఉన్న ఋషులు, ఆయుథ పాణులైన అంగరక్షకులు, గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడు ఇదీ దృశ్యం. ఈ అనంత శయనుణ్ణి చూడగానే ఈ శ్లోకం స్భురణ కొస్తుంది :
”శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగనసదృశం, మేఘవర్ణం, శుభాంగం,
లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం” ఈ శ్లోకమే ఈ శిల్పికి ప్రేరకమై, శ్రీ అనంతపద్మనాభుని రూపాన్ని భువన మోహనంగా మన ముందు రూపు కట్టించింది.

* ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు

🌸* నాగబంథం :-🌸

మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.

నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు

🌸* వేదపురుషులా?🌸

ఈ గుహాలయాల్లో నాల్గవ అంతస్తు కూడ అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

🌸* రవాణాసౌకర్యాలు :-🌸

విజయవాడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. మంచినీళ్లు తీసుకువెళ్లడం మాత్రం మరచిపోవద్దు.

🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
16/01/18, 4:14:58 PM: ‪+91 94411 78068‬: 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
కనుమ పండుగ.
కనుమ'. దీన్నే పశువుల పండుగ అని అంటారు
వేదం జంతువులు మనుషులకు సోదరసమానమైనవని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.

ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి. వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.

ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.

మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి  తెలియజేద్దాం.

చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది. 

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ{శివ కింకరుడు దగ్గొలుమునేంద్ర }ॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

16/01/18, 8:57:51 PM: Ivaturi Umashankar: శ్లో :      సుశీలోమాతృపుణ్యేన,

            పితృపుణ్యేన చాతురః

          ఔదార్యం వంశపుణ్యేన

          ఆత్మపుణ్యేన భాగ్యవాన్.

తాత్పర్యం :

                తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం                                                పొందుతాము. అలాగే వంశపుణ్యాన ఉదారత్వం లభిస్తుంది, కానీ స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి.

                              శివాయ గురువే నమః
17/01/18, 7:02:12 AM: MVMRAO: 🕉🕉🕉🕉🕉🕉

🌸మాఘ మాసం -🌸

💐 వసంతోత్సవాలు / శారదా నవరాత్రులు 💐

మాఘ శుద్ధ పాడ్యమి  నుండి మాఘ శుద్ధ నవమి వరకు శారదా నవరాత్రులు గ జరుపుకుంటాము. ఇక్కడ నుండి వసంత కాలవాతావరణం కనిపిస్తుంది కనుక ,ఇతర ప్రాంతాలలో వసంతాధి దేవతలు అయినటువంటి రతి మన్మధులను పూజిస్తారు. రతి ,మన్మధుల అనుగ్రహం చేత జీవితం లో సర్వాభీష్టాలు తీరి, ఆనందమయం గ ఉండి, ఎమైన అవరోధాలు ఉంటే తొలగిపోతాయి అని శాస్త్రవచనం. ఈ మాఘమాసం మొదలు..అంటే ఈ నెల నుండి, ఉత్తరాయణ పుణ్యకాలంలో రతి,మన్మధ ఉత్సవాలు,లేక వసంత ఉత్సవాలు అనేవి అనేక విధాలుగ జరపబడుతుంతే,మన ప్రాంతంలో ఈ కాలంలో శారదా నవరాత్రులు గ పండుగ జరుపుకుంటాము.

విద్యాధిదేవీ, ఙ్ఞానాధిదేవీ అయిన శ్యామల దేవి కి సంబందించినటువంటి రోజులు ఈ శారదా నవరాత్రులు.
ఇవి ఙ్ఞానప్రధానమైన నవరాత్రులు. ఈ రోజుల్లో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, వారికి ఙ్ఞానం లభిస్తుంది.
తొమ్మిది రోజులు వీలుకాని వారు, మాఘ శుద్ధ పంచమి, అనగా శ్రీ పంచమి రోజున మాత్రం ఆ శారదా దేవిని తప్పనిసరిగా పూజించాలి.
ఇది ఒక నియమముగా పెట్టుకోవాలి. ఇది భారతీయులకు ఒక పండుగ.
అక్షరములు అంతా శారదా మయం,కనుక అసలు ఏ రంగమైన సరే//ఒక ఆధ్యాత్మిక రంగము లో సిద్ధించాలంటే ఆ శారదా అనుగ్రహం పొందాలి. ఆవిడే చైతన్య స్వరూపిణి.
ఆ అమ్మే జగము అంతా వ్యాపించి, ఆవిడ శక్తిని ప్రసరింపచేస్తోంది.

అలాంటి తల్లిని ఈ నవరాత్రులలో పూజించి, మనము అందరము అమ్మ కటాక్షమునకు పాత్రులము అవ్వుదాము.

భజే శారదాంబ మజస్రం మదంబాం!

17/01/18, 11:47:24 AM: Yes Pk: *ఈశ్వరుడి ప్రియ పుష్పాలు* 
మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటలోని పూలు తెద్దాం. అన్నట్టు ఈశ్వరు నికి  ఇష్టమైన పూలేంటో తెలుసా!
ఇవిగో.....👇

*అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః*
*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః*
*జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ* 
*సత్యం  అష్ట విధం  పుష్పో: శిహో  ప్రీతి కరం  భవేత్ !!*

*1.అహింసా పుష్పం:*
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

*2.ఇంద్రియ నిగ్రహం:*
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

*3.దయ:*
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

*4.క్షమ:*
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

*5.ధ్యానం:*
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

*6.తపస్సు:*
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

*7.జ్ఞానం:*
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

*8.సత్యం:*
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
 
అవి చాలా అరుదైన పుష్పాలు,అవి మా తోటలో *అన్ని లేవే* అంటున్నారా!మరేం పర్లేదు,ఇవాళే వాటిని నాటండి ఈ పూలు పూయించండి. మీరంతా ఏడాది పూజ వాటితోనే చేస్తారని ఆశిస్తూ

16/01/18, 9:34:32 PM: ‪+91 79811 59026‬: *మహాప్రాణాలతో అల్పప్రాణులపై మారణకాండ*
(కొన్ని ఉచ్చారణా/ముద్రణా వైపరీత్యాలు)

      1) శాకాహారమా? శాఖాహారమా?

‘శాకము’ అంటే కూరగాయ. ‘శాఖ’ అంటే కొమ్మ. చాలామంది రెండోదాన్నే వ్రాసేస్తుంటారు. ఇక హొటళ్ళ బోర్డులైతే సరే సరి. (ఒక్కోసారి పెద్దపెద్ద కొమ్మలవంటివి ప్లేటుల్లో కనిపించినపుడు ఈ మాట సార్థకం!)

      2) సింధూరమా? సిందూరమా?

కమర్షియల్ రచయితలు వ్రాసేవాటిల్లో మొదటిది సరైనదేమోగానీ, నిజానికి రెండవదే సరైనది. పైగా ‘సింధురము’ అంటే ఏనుగు అనే అర్థం ఉంది. సినిమాలలో కూడా ఇది రూపాంతరంచెంది, తరువాత మొదటిదిగా రూఢియైపోయింది! (సినారె వ్రాసినపుడు ‘కిలకిల నవ్వులు’ అనే పాటలో స్పష్టంగా ‘నీ పాదధూళి సిందూరము కాదా?’ అని పలకబడింది. తరవాత వచ్చిన పాటల్లోను, రచనల్లోను ఎందుకో ‘ద’కి మహాప్రాణం వచ్చేసింది!)

      3) ఆనందబాష్పాలా? భాష్పాలా?

  మొదటిదే సరైనది, నమ్మలేని నిజం!   

      4) ఎన్ని విధాలుగా పాఠకులను, శ్రోతలను ‘బాధించవచ్చు?’

      భాద
      భాధ
      బాధ
      బాద

      దురదృష్టవశాత్తు పైవాటిలో మూడవది మాత్రమే సరైనది. మొదటి రెండూ విపరీతప్రయోగాలే!
      నాలుగోదైతే మరీను!

      5) దురంధరుడా? ధురంధరుడా?

        ఇక్కడ మాత్రం రెండవదే సరైనది -  (‘ధుః ధుర్’ లకు సంబంధిచినది) - ‘భారాన్ని వహించే నాయకుడు’ అని అర్థం!

        6) బహుమతి ప్రదానమా? ప్రధానమా?

        గొప్పకు పోయి రెండవదాన్ని వాడుతూంటారు చాలామంది. నిజానికి మొదటిదే సబబైనది. ‘దాన’ అనే మాటకు ‘ప్ర’ అనే ఉపసర్గను చేర్చితే, ప్రకృష్టమైన (ప్ర) దానం - గొప్పగా ఇవ్వడం అవుతుంది. ఇక్కడ ‘ప్రధానమైనది’ ‘ప్రదానమే’గాని, ‘ప్రధానం’ కాదు.

        7) ‘కచ్చితంగా’ వస్తాను - ‘ఖచ్చితంగా’ వస్తాను - వీటిలో ఏది సరైన పదం?
       
          రెండవది సరైనదనిపిస్తుంది, కానీ మొదటిదే సరైనది. ఎందుకంటే అది ఆచ్ఛికం (అచ్చమైన తెలుగుపదం). అచ్చమైన తెలుగు పదాలలో పెద్ద అక్షరాలుండవు!

        8) ‘ఖర్మ కాలి  అక్కడికెళ్ళాను’ - అయ్యా! ‘ఖర్మ’ అనే మాట ఏ నిఘంటువులోనూ దొరకదు. కానీ పరిస్థితి బాగుండనపుడు నొక్కిచెప్పడానికి (emphasis) వాడేస్తూంటాము. ఇది ఎంతవరకూ పోయిందంటే, గీతలోని కర్మయోగాన్ని కూడా అదేదో తప్పులుచేసినవాళ్ళకు కలిగే శిక్షలు వగైరా అందులో ఉంటాయని ఎందరో పామరులు అనుకునేంతవరకు!

        9) అన్నట్లు ‘తెలుగు భాషా? తెలుగు బాషా?”

ఏదైనా పరవాలేదంటున్నారు పండితమ్మన్యులు కూడా! ‘బాషా’ అనే మాటకు ఉర్దూలో ‘రాజు’ అనే అర్థం ఉంది. ‘ఆసు, రాజు, మదాం’ - అని మనం అనేదానికి కొన్ని ప్రాంతాలవాళ్ళు ‘ఎక్కా, బాషా, రండీ’ అంటారు. సంస్కృతంలో ‘భాష్’ అనే ధాతువుకు ‘మాట్లాడు’ అని అర్థం. దానినుండే ‘భాషా’ అనే స్త్రీలింగరూపం సంస్కృతంలోను, దానినుండి మన పద్ధతి ప్రకారం ‘భాష’ అనే పదం తెలుగులోను ఏర్పడ్డాయి.

        10) చివరిగా ఇదంతా ‘పద్ధతి’గా ఉందా?/ ‘పద్దతి’గా ఉందా?

ఈ విషయమై మీకూ ఎన్నోసార్లు అనుమానం వచ్చిఉంటుంది - ఎందుకంటే ఏ డీటీపీ చేసే వ్యక్తికి ఇచ్చినా ఒత్తులేని ‘ద’నే కొట్టగా చూచానుగానీ ‘ద్ధ’ ఎవడిచేతిమీదుగానూ పడలేదు!