Wednesday, September 27, 2017

25/09/17, 11:01:09 AM: ‪+91 79811 59026‬: *అమృతం చైవ మృత్యుశ్చ  ద్వయం దేహే  ప్రతిష్ఠితం*
*మృత్యు రాపద్యతే  మోహాత్  సత్యే నాపద్యతే మృతం*

అమృతము, మృత్యువు -- ఈ రెండూ దేహమునందే ఉంచబడి యున్నాయి.మోహము, లేక
కోరిక వలన మృత్యువును, సత్యదర్శనము వలన అమృతమును మానవులు పొందగలుగుతున్నారు.

26/09/17, 6:08:55 PM: ‪+91 98490 65431‬: దశ మహావిద్యలు - ఫలితాలు

తొలి మహా విద్య
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2 వ మహా విద్య
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3 వ మహా విద్య
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4 మహా విద్య
దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహా విద్య
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహా విద్య
దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహా విద్య
దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహా విద్య
దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహా విద్య
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహా విద్య
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది
7/09/17, 8:52:22 AM: ‪+91 79811 59026‬: *సతాం సాప్తపదీ మైత్రీ*
*సత్సతాం త్రిపదీమతా*
*సత్సతామపి యే సంతి*
*తేషామ్ మైత్రీ పదే పదే*

మంచివారు ఏడడుగులు కలిసి వేసినంతనే స్నేహితులగుదురు. మరీ మంచివారికి
మూడడుగులు కలిసి వేసినంతనే మైత్రి కలుగును. ఉత్తమోత్తములకు  అడుగడుననూ మిత్రులు ఏర్పడుతుంటారు.
27 Sep at 6:34 PM

27/09/17, 2:38:56 PM: ‪+91 98660 49721‬: 🎆సరస్వతీ దేవి🎆

శ్లో|| యాకుందేందు తుషారహార ధవళా యాశుభ్రవస్త్రాన్వితా|
యావీణావరదండ మండితకరా యాశ్వేతపద్మాసనా||
యాబ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభి ర్ధేవైస్సదాపూజితా|
సామాంపాతు సరస్వతీ భగవతీ భారతీ నిష్షేషజాడ్జాపహా||

      త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవత సరస్వతీదేవి.  జ్యోతి లక్షణం కాంతి, ప్రసరణ కాంతి యెక్క లక్షణం. అదే విధంగా చైతన్య మయమైన విద్యవల్లనే పరబ్రహ్మం గోచరించబడుతుంది.

      సరస్వతీదేవి స్వరూప వర్ణన:  సఖలాభరణ భూషితయై నాలుగు చేతులతో కూడి కుడిచేతులయందు వీణ, అక్షమాల ఎడమచేతి యందు పుస్తకం ఉండును.హంసవాహిని.

      ఆమెకు తెలుపు అంటె ఇష్టం. తెలుపు చీర ధరించి ఉంటుంది. అందుకని ఆమెని తెల్లటి పూవులతో పూజిస్తారు.

      మాఘశుద్ధ పంచమి ఆమె జన్మదినం. ఈ రోజున వసంతపంచమి లేక శ్రీ పంచమి అంటారు. ఋగ్వేదం, దేవి భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణాల్లో ఈమె గుఱించి తెలియజేయబడింది. సకల సృష్టి కర్త బ్రహ్మ సరస్వతిని కూడా సృష్టించాడని, సృష్టి కార్యక్రమంలో తనకు తోడుగా ఉండటానికి తన జిహ్వపై ధరించాడని ఒక గాథ. శివమహాపురాణంలో ఉమా సంహితలో సరస్వతీ ప్రాదుర్భావం గుఱించి చెబుతూ ఈసరస్వతి 'పార్వతీదేవి దేహమనే కోశమునుంచి ఉద్భవించుటచే కౌశిక అని పేరు వచ్చిందని శుంభనిశుంభులనే రాక్షసులను వధించిందని చేప్పబడింది'.

      ఈమెను సమస్త దేవతలు, బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సదా కొలుస్తూవుంటారు. ఈమె దేవతల్లో గొప్పది అలాగే నదుల్లోనూ గొప్పది. సరస్వతీనది ఒక మహానదిగా ప్రవహించింది. ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది.

    అమ్మని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటారు. అందుకునే నవరాత్రుల్లో మూడు రూపాల్లో ఒకే అమ్మ అరాధింపబడుతోంది.

సరస్వతీ ద్వాదశ నామాలు:
1. భారతి,
2. సరస్వతి,
3. శారద,
4. హంసవాహిని,
5. జగతీఖ్యాత,
6. వాణీశ్వరీ,
7. కౌమారి.
8. బ్రహ్మచారిణి,
9. బుద్దిధాత్రి,
10. వరదాయిని
11. క్షుద్రఘంట
12. భువనేశ్వరి.

photos & Videos