Saturday, October 26, 2019
*అహంకార మమకారాలు....
నేను, నాది.. అనే భావాలే అహంకార మమకారాలు. అహంకారం పుట్టిన తర్వాతనే మమకారం పుడుతుంది. అహంకారమంటే దేహాన్ని నేను అనుకోవటమే. మమకారమంటే అన్నింటిని నావి, నావారు అనుకోవటం. ఈ భావాలను తొలగించుకోవాలి. ఎందుకంటే ఇది అధ్యాస, భ్రమ. ఎలా తొలగించుకోవాలో క్రిందటి శ్లోకంలో చెప్పారు. స్వ - ఆత్మ- నిష్టా అని. 'ఆత్మలో నిష్ఠ కలిగి' అని. ఆత్మలో నిష్ట కలిగి అధ్యాసను తొలగించుకునే సాధనా మార్గం...
నీ దేహాన్ని, దేహం చేసే పనులను.
నీ మనస్సును, మనస్సు చెందే ఉద్రేకాలను, అనుభవాలను.
నీ బుద్ధిని, బుద్ధిలో కలిగే ఆలోచనలను, అలజడులను, వీటన్నింటిని చూసే సాక్షిగా నీదేహంలోని ఆత్మను గుర్తించాలి.
ఆ ఆత్మ యొక్క స్వభావం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అది నిరాకారం అని, నిర్గుణం అని, నిర్వికారం అని, సర్వవ్యాపి అని, అన్నింటికి చైతన్యాన్ని ఇచ్చి తాను మాత్రం అసంగంగా ఉండేదని... ఇలా ఆత్మయొక్క స్వభావాన్ని మననం చేసి దానిని బాగా వంట పట్టించుకోవాలి.
ఇలా ఆత్మ ఈ దేహమనోబుద్ధులను, వాటి వృత్తులను సాక్షిగా చూస్తున్నదని గ్రహిస్తూ.. గుర్తిస్తూ.. క్రమంగా ఆ 'ఆత్మ నేనే' ననే దృఢ నిర్ణయానికి రావాలి. అదే ఆత్మకు దగ్గరగా రావటం.
సోఽహం...
అదే నేను అని గుర్తించటమే ఆత్మవైపు జరగటం, ఆత్మతో తాదాత్మ్యం చెందటం. కనుక అనాత్మతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని ఆత్మతో తాదాత్మ్యం చెందాలంటే... 'స్వ - ఆత్మ - నిష్ట' లో నిలవాలి. నిలవాలంటే మనం ఏంచేయాలి..
"శరీర మనోబుద్ధులను వాటి వృత్తులను సర్వకర్మలను కేవల సాక్షిగా చూస్తూ జీవించటం ప్రారంభించు". ఈ సాక్షి ఎవరు.. అనే ప్రశ్న రాగానే ఇది ఆత్మ, అది నేనే. నేను ఆత్మనే 'అహం బ్రహ్మాస్మి' అనే భావన దృఢంగా కలుగుతుంది. కనుక ఈ అభ్యాసాన్ని నిరంతరం కొనసాగించాలి. చాలాకాలం కొనసాగించాలి. అలా అయితేనే ఎన్నో కోట్ల జన్మల నుండి 'దేహమే నేను' అనే భ్రమ, అధ్యాస తొలగిపోతుంది. ఆత్మనే నేను అనే భావం బుద్ధిలో దృఢంగా నాటుకుంటుంది. ఆత్మలో నిష్ఠ కుదురుతుంది. అదే "సద్వృత్తి".
బ్రహ్మాకారవృత్తి...
'చైతన్యమే నేను' అనే భావమే బ్రహ్మాకారవృత్తి. ప్రవాహంలా కదిలిపోతున్న ఆలోచనలను గుర్తించేదే చైతన్యం. దేహేంద్రియాల కదలికలకు ఆధారమైనదే చైతన్యం. ఈ చైతన్యాన్ని గుర్తించిన తర్వాత దానివైపు జరగటానికి ప్రయత్నించాలి. అంటే ఆ చైతన్యంతో తాదాత్మ్యం చెందాలి. అంటే చైతన్యం నేనే ననే భావన రావాలి. అదే దగ్గరగా జరగటం అంటే ఇలా చైతన్యానికి దగ్గరపడి దానితో తాదాత్మ్యం చెంది, అదే నేనుగా ఉండిపోవాలి...
Forwarded by Sunanda pss
*దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ:
*దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |*
*దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||*
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాల పండుగ అయిన దీపావళి[1]రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు ~ *తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?* అంటాడు.
దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. *త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని*~ అని సమాధానమిచ్చింది.
అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వ
సంపదలు కలుగుతాయి. పేద ధనిక అని భేదము లేకుండా, అన్ని వర్గాలవారూ శ్రీమహా లక్ష్మీదేవిని పూజిస్తారు.

*శ్రీధన్వ౦తరీ అష్టోత్తర శతనామావళి*
ప్రతీ నామముకు ము౦దు *ఓమ్* మరియు వివర *నమ:* పదములు చేర్చి అర్చన సమర్పి౦చగలరు.
శ్రీమతే నారాయణాయ నమ:
విష్ణవే.
సురాసుర సమాశ్రితాయ.
క్షీరాబ్ధిమధన వ్యగ్రాయ.
మ౦ధరాచల ధారకాయ.
సముద్రరాజతనయా ప్రేప్సామధితసాగరాయ.
హరప్రాశితకాకోల విషహృత్ నామవైభవాయ.
మధిత క్షీరజలధే ప్రాధుర్భూతాయ.
శుభోదయాయ.
భావిక్షయనివృత్యర్ధ౦ అవతీర్ణాయ.
పరాత్పరాయ.
అతసీపుష్పస౦కాశాయ.
శ౦ఖచక్రగదాధరాయ.
ఖడ్గశార్గధరాయ.
పద్మమాలోద్భాసి భుజా౦తరాయ.
సుగ౦ధితులసీమాలా౦కృతాయ.
కౌస్తుభా౦చితాయ.
ధీర్ఘపీవరదోర్ధ౦డాయ.
క౦బుగ్రీవాయ.
అరుణేక్షణాయ.
శ్యామలాయ.
తరుణాయ.
సర్వదివ్యాభరణభూషితాయ.
స్నిగ్దకు౦చితకేశా౦తాయ.
సుభగాయ.
సి౦హవిక్రమాయ.
రమ్యక్షౌమోత్తరా స౦గాయ.
పీతవాససే.
జగత్పతయే.
ఔషధాయితపాదాబ్జతీర్ధాయ.
ధన్వ౦తరయే.
హరయే.
పీయూషకలశీ హస్తాయ.
జలూకాళీ లసత్కరాయ.
దివ్యౌషధీ ధరాయ.
ప్రాణివల్లభాయ.
ప్రాణిరక్షకాయ.
పు౦డరీక విశాలాక్షాయ.
శ్రీశాయ.
శ్రీవత్సలా౦చనాయ.
మ౦దస్మిత౦చిత ముఖాయ.
సుభ్రువే.
ఉన్నతనాసికాయ.
సముద్రలీనకల్పద్రు చి౦తామణ్యాదిభాసకాయ.
*(పైన తెలిపన నామము పూర్తిగా ఒకటే నామము)*
సుధాపహారీ ధైత్యారయే.
మోహినీరూప మాస్థితాయ.
దేవేభ్య సుధాప్రధాత్రే.
దుష్టదానవ వ౦చకాయ.
పీయూషప్రాసనోద్యుక్త చ్ఛన్నరాహు శిరోహరాయ.
*(పూర్తిగా ఒకటే నామము)*
పీయూష కలశీ గోప్త్రే.
విజితాశేష దానవాయ.
దేవాసుర మహాయుద్ద క్షతదేవ చికిత్సకాయ.
దైవస౦పత్ప్రతిష్టాత్రే.
దేవనాధ ప్రపూజితాయ
సముద్రరాజతనయగాడాశ్లిష్ట సమా౦తరాయ.
కామధేను పయ:కల్పితాభిషేచనక క్రియాయ.
ఐరావతవితీర్ణోరు మ౦దరస్రక్ అల౦కృతాయ.
చి౦తామణీ స్రష్టదివ్య నానాభరణ భూషితాయ.
ఉచ్ఛైశ్రవ ప్లుతస్తోత్రే.
అప్సరోనృత్య విస్మితాయ.
ధర్మగోప్ర్తే.
ధర్మమూర్తయే.
ధర్మద్వేషీ జనా౦తకాయ.
శ్రుతీనామాది ఆచార్యాయ.
ఆయుర్వేదప్రవర్తకాయ.
అశ్విన్యాది భిషగ్వ౦ద్యాయ.
భవరోగభిషగ్వరాయ.
ఆదివ్యాదినిదానోపదేశకాయ.
రోగశమకాయ.
ధర్మమూలవపుస్తాత్రే.
వపుస్తత్వ ప్రబోదకాయ.
దర్శన స్పర్శన ధ్యాన విద్రావిత మహామయాయ.
కరణత్రయదోషఘ్నాయ.
తాపత్రయనివారకాయ.
జగచ్చరీరణే.
విశ్వాత్మనే.
జగద్రక్షణదీక్షితాయ.
మణిమ౦త్రఔషధాధీనా౦ ప్రసక్త్రే.
ఆరోగ్యదాయకాయ.
సుప్రజాన౦ద స౦ధాత్రే.
ధీర్ఘాయుష్యప్రదాయ.
పరాయ.
జితే౦ద్రియత్వ ప్రస్తోత్రే.
ప్రాణాయామపరప్రియాయ.
సుదాచారోగ్యదత్వభోదకాయ.
మహతే భేషజాయ.
సుశీలాయ.
సులభాయ.
సౌమ్యాయ.
వత్సలాయ.
కరుణాకరాయ.
సర్వఙ్ఞాయ.
సర్వశక్తయే.
వరదాయ.
అభయప్రదాయ.
ఫణీ౦ద్రశయనాయ.
జిష్ణవే.
వినతాసుతవాహనాయ.
మహాజ౦గలికాయ.
లోకక్షేమకృతే.
లోకభా౦ధవాయ.
నానాదివ్య ఔషధీ స్రష్టే.
రస గ౦ధాధి భేషజాయ.
దేవతిర్యక్ మనుష్య స్థావరా౦త సుఖప్రదాయ.
ఐహిష్ముకాన౦ద ప్రదాయ.
*ఓమ్ సమస్త పరివారాయ సర్వదివ్య మ౦గళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ:*

Friday, October 25, 2019
ఆషాఢస్య ప్రథమ దివసే
పరిచయము
ఆకాశము దట్టంగా కారు మబ్బులతో నిండి, ఉన్నట్లుండి కర్ణభేరి బద్దలయేట్టుగా ఉరుముల మ్రోతలు వెనుకంటి వస్తుంటే మెరుపుతీగలు మిరుమిట్లు గొలుపుతూ ఒక వైపునుండి మరోవైపుకు ప్రాకుతున్నప్పుడు, జడివాన మొదటి చినుకులు నేలపై పడి మట్టివాసనను రేపినప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చే పంక్తి మేఘదూతము లోని ‘ఆషాఢస్య ప్రథమ దివసే’. మహాకవి కాళిదాసు (నా ఉద్దేశములో అతడిని కాలిదాసు అని పిలవాలి, ఎందుకంటే అతడు కాలి అంటే శివుని భక్తుడు, కాళికాదేవి భక్తుడయితే అతని పేరు కాళీదాసుగా ఉండి ఉండేది) సంస్కృతములో మేఘదూతమును ఒక ఖండకావ్యముగా వ్రాసినాడు. వర్షము పడుతున్నప్పుడు తనకు ప్రియమైన వ్యక్తి తోడు లేక విరహపు వ్యధ బాధిస్తున్నప్పుడు జ్ఞాపకము వచ్చేది మేఘదూతమే. ఇందులోని పద్యాలు సుమారు 110కి పైగా పూర్వమేఘము, ఉత్తరమేఘము అనే భాగాలలో ఉన్నాయి. కాళిదాసు అన్ని పద్యాలను మందాక్రాంత వృత్తములో వ్రాసినాళ
మందాక్రాంత వృత్తములో ప్రతి పాదానికి 17 అక్షరాలు ఉంటాయి, దాని గణములు – మ భ న త త గగ. పాదమును మూడు భాగాలుగా విడదీయవచ్చును – UUUU – IIIIIU – UIUUIUU. సంస్కృతములో పదాలను వాడేటప్పుడు, పదాలను పై విధముగానే అమర్చాలి. నాలుగవ అక్షరము, ఐదవ అక్షరము, అదే విధముగా పదవ అక్షరము, పదకొండవ అక్షరము సంధి ద్వారా తప్ప మరే విధముగా కలుపబడవు. పాదాంతములో తప్పని సరి యతి ఉంటుంది. తెలుగు భాషలో ఈ నియమాలు లేవు. మందాక్రాంతానికి తెలుగులో ఒక యతి మాత్రమే నియమం. తెలుగు మందాక్రాంత పద్య పాదములో మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి అక్షరమైత్రి ఉండాలి, దీనినే వడి అంటారు. మనకందరికీ తెలిసిన ఒక మందాక్రాంత వృత్తము విష్ణుసహస్రనామము లోని క్రింది పద్యము:
శాంతాకారం – భుజగశయనం – పద్మనాభం సురేశం
విశ్వాధారం – గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం – కమలనయనం – యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం – భవభయహరం – సర్వలోకైకనాథం
విశ్వాధారం – గగనసదృశం – మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం – కమలనయనం – యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం – భవభయహరం – సర్వలోకైకనాథం
ప్రయాగ ప్రశస్తి
ఈ మందాక్రాంతవృత్తము కాళిదాసుకు సుపరిచితమే. కాళిదాసు రెండవ చంద్రగుప్తుని కాలములో నివసించాడు, అతని ఆస్థానకవి. ఈ చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుడు (క్రీ. శ. 335-380). సముద్రగుప్తుని ఆస్థానకవి హరిసేనుడు. గుప్తయుగములో సామ్రాజ్యాన్ని విస్తరించినది సముద్రగుప్త చక్రవర్తి. ఆ సామ్రాజ్యము కామరూపము నుండి యమున వరకు, హిమాలయము నుండి నర్మద వరకు ఉండినది. అది కాక దక్షిణ భారతదేశము లోని రాజులతోబాటు ఎందరో సామంతరాజులు ఉండేవారు. అతడి విజయాలను వర్ణిస్తూ ప్రయాగ (నేటి అలహాబాదు) దగ్గరి కౌశాంబిలో అశోకుని శాసనస్థంభముపై ఒక భాగములో ఈ హరిసేనకవిచే వ్రాయబడిన శాసనము ఒకటి ఉన్నది. దానిని ప్రయాగ ప్రశస్తి అంటారు. ఉత్తభారతమంతా దిగ్విజయయాత్రలో జయించి దక్షిణములో కంచివరకు వచ్చాడు సముద్రగుప్తుడు. కళింగ, విశాఖ, గోదావరి, పిఠాపురము మున్నగునవి కూడ ఈ శాసనములో ప్రత్యేకముగా పేర్కొనబడ్డాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, హరిసేనుడు వ్రాసిన ఆ ప్రయాగ ప్రశస్తిలో [1,2] ఒక మందాక్రాంత వృత్తము కూడ ఉన్నది. ఆ మందాక్రాంతవృత్తములో రెండు పంక్తులు మాత్రమే పూర్తిగా ఉన్నాయి. అవి:
సంగ్రామేషు – స్వభుజ విజితా – నిత్యముచ్చాపకారాః
తోషోత్తుంగే – స్ఫుట బహురస – స్నేహ ఫుల్లైర్మనోభిః
తోషోత్తుంగే – స్ఫుట బహురస – స్నేహ ఫుల్లైర్మనోభిః
ఎవరు పరులకు అపకారము చేస్తారో వారిని తన భుజపరాక్రమముతో యుద్ధములో జయిస్తాడో / మనసులు ప్రస్ఫుటమైన బహురసములతో నిండి స్నేహముతో విరిసి చాల సంతోషముతో ఉంటుందో…
వియత్నాంలో మందాక్రాంతము
కాళిదాసు మేఘదూతాన్ని చర్చించడానికి ముందు మరో రెండు శాసనాలలోని మందాక్రాంత పద్యాలను తెలియబరుస్తాను. క్రీ. శ. నాలుగవ శతాబ్దానికే భారతదేశము నుండి నేటి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వలస వెళ్లి అక్కడి రాజులను జయించి హైందవ సిద్ధాంతాల పైన ఆధారపడిన సామ్రాజ్యాలనే నిర్మించారు కొందరు. నేటి వియత్నాం లోని మీసోన్ ప్రాంతము ఆనాడు చంపాదేశము అని పిలువబడేది. భద్రవర్మ మహారాజు (క్రీ. శ. 380-413) భద్రేశ్వరాలయము అనే ఒక శివుని గుడిని నిర్మించాడు. రెండు శతాబ్దాల తరువాత ఇది నిర్మూలించబడగా, శంభువర్మ (577-629) శంభు-భద్రేశ్వరాలయమని దీనిని పునర్నిర్మించాడు. నలభై యేళ్లకు ముందు జరిగిన వియత్నాం యుద్ధములో భద్రవర్మ కట్టిన కొన్ని గుడులు బాంబులు పడి ధ్వంసమయిన విషయము శోచనీయము. నేడు మీసోన్ ఒక world heritage site. ఈ శంభువర్మ శిలాశాసనాలలో[3] శివునిపైన ఒక మందాక్రాంత వృత్తము ఉన్నది. అది:
సృష్టం యేన – త్రితయ మఖిలం – భూర్భువస్స్వః స్వశక్త్యా
యేనోత్ఖాతం – భువనదురితం – వహ్నినేవాంధకారం
యస్యాచింత్యో – జగతి మహిమా – యస్య మాదిర్న చాంత
శ్చంపాదేశే – జనయతు సుఖం – శంభుభద్రేశ్వరోऽయం
యేనోత్ఖాతం – భువనదురితం – వహ్నినేవాంధకారం
యస్యాచింత్యో – జగతి మహిమా – యస్య మాదిర్న చాంత
శ్చంపాదేశే – జనయతు సుఖం – శంభుభద్రేశ్వరోऽయం
ఎవడు భూర్భువస్సువర్లోకాలను సృష్టించాడో, ఎవడు వెలుగు చీకటిని తరిమివేసినట్లు సకలపాపాలను నిర్మూలిస్తాడో, ఎవడి మహిమలను ప్రపంచములో ఊహించుకోడానికి వీలుకాదో, ఆ శంభు-భద్రేశ్వరుడు చంపాదేశానికి సుఖములను ప్రసాదించుగాక!
క్రీ. శ. 653-687 మధ్యకాలములో విక్రాంతవర్మ చంపాదేశానికి రాజు. ఇతడు కూడ కొన్ని శాసనాలను మీసోన్‌లో చెక్కించాడు[3]. వాటినుండి ఒక మందాక్రాంతవృత్తమును క్రింద ఉదహరిస్తున్నాను:
యస్యాత్మానః – సకలమరుతాం – మానినాం మాననీయా
అష్టౌ పుణ్యా – వరహితకృతః – సర్వలోకాన్ వహంతి
అన్యోన్యస్య – స్వగుణవిధయా – గాఢసంబధ్యమానా
యోగ్యా యుగ్యా – ఇవ పథి పథి – స్యందనాన్ స్యందమానాన్
అష్టౌ పుణ్యా – వరహితకృతః – సర్వలోకాన్ వహంతి
అన్యోన్యస్య – స్వగుణవిధయా – గాఢసంబధ్యమానా
యోగ్యా యుగ్యా – ఇవ పథి పథి – స్యందనాన్ స్యందమానాన్
ఏ ఈశ్వరుని ఎనిమిది పుణ్యమూర్తులు మరుద్గణములచే నుతించబడుచున్నవో, ఏవి చక్కగా మంచి పనులచే ఎల్ల లోకములను భరించుచున్నవో, ఏవి తమలోతాము గాఢ సంబంధము గలిగి యున్నవో, ఏవి రథమును బాగుగా మార్గముపై నడిపించే గుఱ్ఱములవంటివో, ఆ ఈశ్వరుడు రక్ష నిచ్చుగాక!
మహాకవి కాళిదాసు నాలుగవ శతాబ్దపు అంత్యకాలములో జీవించాడు. ఇతడు పంచకావ్యాలలో రెండైన రఘువంశ కుమారసంభవములను, అత్యుత్తమ నాటకముగా పరిగణించబడే అభిజ్ఞానశాకుంతలముతోబాటు విక్రమోర్వశీయ మాళవికాగ్నిమిత్రములను, మేఘదూత ఋతుసంహార ఖండకావ్యములను రచించాడు. శృంగారతిలకము కాళిదాసు రచన అంటారు కొంతమంది. లాక్షణికగ్రంథమైన శ్రుతబోధ, దండకరాజమయిన శ్యామలాదండకము మాత్రము నిస్సందేహముగా ఇతని రచనలు కావు. మరే పుస్తకాన్ని వ్రాసినా, వ్రాయకపోయినా కాళిదాసు అద్వితీయ ప్రతిభకు ఒక్క మేఘదూతము చాలంటే అది అతిశయోక్తికాదు.
మేఘదూతము
మేఘదూత ప్రయాణ మార్గం
మేఘదూతము ఒక ఖండకావ్యము. ఇందులో మనకు కనబడే సజీవమైన పాత్ర యక్షునిది మాత్రమే. కుబేరుని కొలువులో ఉండే ఈ యక్షుడు రాజకార్యము చేయడములో ఏకాగ్రత చూపకపోయిన కారణాన శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా రామగిరి ప్రాంతములో విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమయినది. గుంపులుగుంపులుగా కారు మేఘాలు గున్న ఏనుగులలా ఆకాశములో కనబడుతాయి. ఆ మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్లి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు. అంతేగాక ఆ అలకానగరానికి ఎలా వెళ్ళాలో దారి కూడా చెప్తాడు. కాళిదాసు మేఘదూతములో సూచించిన స్థలములను ఆధారము చేసికొని జాఫర్ ఉల్లా గీసిన మేఘ మార్గాన్ని యిక్కడ చూడవచ్చును. క్లుప్తముగా యిది మేఘదూతపు కథ.
రఘువంశ రచయిత యయిన కాళిదాసుకు రామాయణ గాథ సుపరిచితమే. వర్షాకాలములో కిష్కింధలో రాముడు విరహబాధను అనుభవిస్తున్నాడు. అతడు లంకకు హనుమంతుని ద్వారా సీతకు సందేశాన్ని పంపిస్తాడు. రాముడికి బదులు యక్షుడు, లంకకు బదులు అలకాపురి, కిష్కింధకు బదులు రామగిరి, సీతకు బదులు యక్షిణి, హనుమంతుడికి బదులు మేఘము – ఇలా రామాయణానికి మేఘదూతానికి సాదృశ్యము ఉన్నది. గణితశాస్త్ర రీత్యా ఒకదానికి బదులు మరొకదానిని మనము ఉంచితే మనకు perfect isomorphism లభిస్తుంది. ఈ రామగిరి మధ్యప్రదేశములోని నేటి రాంటేక్ అంటారు. మహాభారతములోని నలోపాఖ్యానములో కూడ హంస ఒక దూత. నలునిచే పంపబడిన హంస తనకు “నలినసంభవు సాహిణములు వారువములు కులముసాములు మాకు కువలయాక్షి” అని దమయంతితో చెబుతుంది. దమయంతి హంసతో “అ నల సంబంధ వాంఛ నాకగున యేని అనల సంబంధ వాంఛ నాకగున చూవె” అంటుంది
గాయత్రి అంటే
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం...డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.Forwaded By Jyoti reddy

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత – తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యకార్యానికి ఫలం ఉంటుంది. తెలిసి చేస్తే మరింత జాగరూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్బోధ. దీపావళి పర్వదినం మూడు రోజుల పాటు ఆచరించాలి. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి. ఈ మూడు రోజులూ తెల్లవారు ఝాముననే తైలాభ్యంగన స్నానం చేసి కులదేవతారాధనం చేసి, యమధర్మరాజుని, పితృదేవతలను, ఇష్టదేవతలను స్మరించి పూజించడం భగవదనుగ్రహానికి మార్గం. దరిద్ర నివారణకు ఈ దీపావళి త్రిరాత్ర ఉత్సవం చక్కని మార్గం. భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కులదేవతారాధనం, స్వధర్మ పాలనం, ఆచార సంప్రదాయాలను పాటించడం గురుపాదసేవనం ఇవే ఐశ్వర్యం, తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం.
Subscribe to:
Posts (Atom)